For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ లోని 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

ప్రస్తుత రోజుల్లో మల్టీ విటమిన్ కంటె ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ బిగ్గెస్ట్ సెల్లింగ్ సప్లిమెంట్. ఎందుకంటే ఈ ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా అవసరం . అయితే ఈ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను మన శరీరంలో ఉత్పత్తి కాదు . మనం తీసుకొనే ఆహారాలు, న్యూట్రీషియన్ ఫుడ్స్ ద్వారా మాత్రమే ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ను పొందగలము.

ఈ ప్యాటీ యాసిడ్స్ శరీరంలో కణాల ఏర్పాటుకు , మెటబాలిక్ రేటు పెంచడానికి మరియు బయోకెమికల్ ప్రొసెస్ కు సహాయపడుతుంది. కొన్ని పరిశోధన ప్రకారం ఈ ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా అవసరం అని నిర్ధారించారు. ముఖ్యంగా హెల్తీ హార్ట్ మరియు బ్రెయిన్ హెల్త్ కు అత్యంత అవసరం అని నిర్ధారించారు . గర్భధారణ సమయంలో ప్రమాధంను తగ్గించడంలో సహాయపడుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడం ద్వారా హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. అంతే కాదు మతిమరుపు మరియు డిప్రెషన్ తో బాధపడే వారికి ఇది చాలా మంచిది.

స్త్రీల ఆరోగ్య సమస్యలు అధిగమించే ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సీఫుడ్స్ లో అధికంగా దొరుకుతాయి. ముఖ్యంగా హాలిబట్, హెయిరింగ్స్, మార్కెల్, ఓయిస్ట్రెస్, సాల్మన్, సార్డిన్స్, ట్రౌట్, తున మరియు కాడ్ మరియు కేలా, పార్ల్సే, మింట్, బ్రసల్ స్ప్రాట్స్, స్పినాచ్, వాటర్ క్రెస్, గ్రౌండ్ ఫ్లాక్ సీడ్స్ వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బ్రెడ్ అండ్ పాస్తాలలో ఫోర్టిఫైడ్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. చియాసీడ్స్ మరియు క్వీనా వంటి వాటిలో ఓమేగా 3 పుష్కలంగా ఉన్నాయి.

చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

మరి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా ఫాలో అవ్వాల్సింది . మరి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయండి...

ప్రెగ్నెన్సీలో ప్రమాదం తగ్గిస్తుంది:

ప్రెగ్నెన్సీలో ప్రమాదం తగ్గిస్తుంది:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గర్భధారణలో చాలా అవసరం అవుతుంది. గర్భాధారణ సమయంలో తీసుకొనే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఎర్లీ బర్త్ తగ్గించుకోవచ్చు. మరియు గర్భధారణ సమయాన్ని కొద్దిగా పెంచుతుంది . ఈ ఎఫెక్ట్స్ షార్ట్ ప్రెగ్నెన్సీ లేదా లోవెయిట్ బేబీ ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా అవసరం. ఇది పొట్టలో పెరిగే ఫీటస్ బ్రెయిన్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

మతిమరపు తగ్గించి , జ్ఝాపకశక్తి పెంచుతుంది:

మతిమరపు తగ్గించి , జ్ఝాపకశక్తి పెంచుతుంది:

ఓమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ మతిమరుపు నివారించి మెమరీని పెంచుతుంది . కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిష్ తినే వారిలో మంచి జ్ఝాపకశక్తి ఉంటుందంటారు. రోజుకు 10 గ్రాములు ఫిస్ తినే వారిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లర్నింగ్ మరియు మెమరీ ఫంక్షన్ పెంచుతుంది. మతిమరుపు నివారిస్తుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది:

మూడ్ మెరుగుపరుస్తుంది:

మూడ్ ను మెరుగుపరచడంలో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడుతాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల మూడ్ డిజార్డ్స్ మరియు అభిజ్ఞాత్మక శక్తి లోపిస్తుంది . ఓమేగా3ఫ్యాటీయాసిడ్స్ సప్లిమెంట్స్ ను న్యూరో ఫిసియాట్రిక్ డిజార్డర్స్ అంటే మూడ్ డిజార్డర్స్, శ్చీజోఫ్రీనియాల మరియు అటెన్షన్ డిఫిషిట్ హైపరాక్టివ్ డిజార్డర్ కోసం ఉపయోగిస్తుంటారు.

 జంక్ ఫుడ్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది:

జంక్ ఫుడ్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది:

ఓమేగా3 ఫ్యాటీయాసిడ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది . జంక్ ఫుడ్స్ లో బ్యాడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్లో జంక్ ఫుడ్ మరియు ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్స్ వల్ల బ్రెయిన్ కు ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల లర్నింగ్ మరియు మెమరీ స్టిమిలేటింగ్ ఏరియాస్ ను డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

వ్యాస్కులర్ డిసీజ్ మరియు ఆర్ధరైటిస్ ను మంచి చికిత్సనందిస్తుంది:

వ్యాస్కులర్ డిసీజ్ మరియు ఆర్ధరైటిస్ ను మంచి చికిత్సనందిస్తుంది:

ఓమేగా 3ఫ్యాటీయాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వ్యాధులు మరియు గాయాల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో నేచురల్ హీలింగ్ ప్రొసెస్ ను కలిగి ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న గాయాలను, నొప్పులను తగ్గించలేనప్పుడు క్రోనిక్ ఇన్ల్ఫమేటరీ క్రమంగా టిష్యు డ్యామేజ్ కలిగిస్తుంది. ఇది క్రోనిక్ డిసీజ్ కు దారితీస్తుంది.వాటిలో ముఖ్యంగా హార్ట్, ఆర్థరైటిస్, క్యాన్సర్, వ్యాస్కులర్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రమాదస్థితికి దారితీస్తుంది. ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది . వాటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్స్ :

అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్స్ :

పిల్లలకు వచ్చే డిజార్డర్స్ లో వచ్చే వాటిలో ఈ సమస్య ఒకటి. ఇది పెద్దవారైయ్యే వరకూ కంటిన్యూ అవుతుంది . చేసే పనులు మీద, ఇతర యాక్టివిటీస్ మీద ఏకాగ్రత, బిహేవియర్లో కంట్రోల్ తప్పడం మరియు హైపర్ యాక్టివ్ (ఓవర్ యాక్టివ్ )గా ఉంటారు. వీటన్నింటిని కంట్రోల్ చేసే గుణాలో కేవలం ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ లోనే పుష్కలంగా ఉన్నాయి.

లర్నింగ్ డిఫికల్టీస్ మరియు బిహేవియర్:

లర్నింగ్ డిఫికల్టీస్ మరియు బిహేవియర్:

ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ రీడింగ్, స్పెల్లింగ్ మరియు ప్రవర్థన వంటి వాటిని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ను చేర్చుకోవడం మంచిది . చిల్డ్రన్స్ డైట్ లో ఓమేగా3 ఫ్యాటీయాసిడ్ సప్లిమెంట్ ను అంధివ్వండి .

ప్రైమరీ డిప్రెషన్ మెరుగుపరుస్తుంది:

ప్రైమరీ డిప్రెషన్ మెరుగుపరుస్తుంది:

ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రైమరీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

 మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది:

మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో ఫిష్ ఆయిల్ గ్రేట్ గా పనిచేస్తుందని స్టడీస్ వెల్లడి చేశాయి. పేషంట్స్ లో రిలాక్సేషన్ కల్పిస్తుంది . డైలీ మైగ్రేన్ ను తగ్గిస్తుంది.

పోస్ట్ మెనోపాజ్ హార్ట్ హెల్త్:

పోస్ట్ మెనోపాజ్ హార్ట్ హెల్త్:

మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు(గుండె రక్షిస్తుంది) తగ్గిపోవడం వల్ల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం నుంచి వారిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Story first published: Friday, March 4, 2016, 13:26 [IST]
Desktop Bottom Promotion