For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Coconut Day 2021 : రెగ్యులర్ గా కొబ్బరి పాలు తాగడానికి గల అమేజింగ్ రీజన్స్ ..!!

కొబ్బరి పాలు తాగడానికి కొన్ని అద్భుతమైన కారణాలు..!!

|

కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు పొందుతామన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే కొబ్బరి పాలు కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తాయన్న విషయం మీకు తెలుసా..?

Amazing Reasons Why It Is Good To Drink Coconut Milk
కొబ్బరి పాలు అనేది కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్థం. ఇది ఒక పరిపక్వమైన కొబ్బరికాయ యొక్క కొబ్బరి నుండి తయారయ్యే తీయని, పాలవంటి వంటలో ఉపయోగించే పదార్థం. ఈ పాల రంగు మరియు కమ్మని రుచికి కారణం, అందులోని అధికమైన నూనె పదార్థం మరియు చక్కెరలు. కొబ్బరి పాలు అనే పదం మరియు కొబ్బరి నీరు (కొబ్బరి పానీయం) ఒకటి కాదు, కొబ్బరి నీరు అనేది కొబ్బరికాయ లోపలివైపు సహజంగా ఉత్పన్నమయ్యే ద్రవం. కొబ్బరి పాలు చాలా రుచిగా ఉండటమే కాక, చాలా ఎక్కువ నూనె శాతం ఉంటుంది. ఈ పాలల్లో ఉండే కొవ్వు ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది. దక్షిణ తూర్పు ఆసియాలోను, దక్షిణ ఆసియాలోనూ, దక్షిణ చైనాలోను, కరేబియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనూ ఎక్కువగా వంటల్లో ఈ పాలను వాడుతుంటారు.

కోకనట్ మిల్క్ లోని అద్భుతమైన సౌందర్య రహస్యాలు

ఈ కొబ్బరి పాలు రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి . అందుకు ప్రపంచవ్యాప్తంగా వీటిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కోకనట్ వాటర్ కు కోకనట్ మిల్క్ కూడా మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.కొబ్బరి పాలు పచ్చిగా సైతం త్రాగవచ్చు, లేదా టీ, కాఫీ మొదలైన వాటిలో జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. తాజా కొబ్బరి పాలకు ఆవు పాలతో సమానమైన స్థిరత్వం మరియు కొద్దిగా తీయని రుచి ఉంటుంది మరియు సవ్యంగా తయారుచేసినట్లయితే, కొబ్బరి వాసన ఉండదు, ఉన్నప్పటికీ ఎంతో తక్కువగా ఉంటుంది.

కొబ్బరి పాలలో అధిక శాతం లారిక్ ఆమ్లం, కొవ్వు ఉంటాయి. ఈ కొవ్వు వల్ల రక్తంలో అధిక సాంధ్రత కలిగిన లిపోప్రొటిన్ కొవ్వు శాతం పెరుగుతుంది. కొబ్బరిపాలల్లో కొవ్వు ఆమ్లం(ఫ్యాటీ ఆసిడ్)లు ఎక్కువగా ఉండటం వల్ల డైట్ పాటించే వారికి రక్తంలో కొవ్వు నిల్వలు ఉండకుండా కాపాడుతుంది.

కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు

కొబ్బరి పాలను ఆయుర్వేదంలో ఎంతో ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు, ఆధునిక కాలంలో జఠరాశయంలో మరియు నిర్దిష్ట శరీరభాగాలలో దీనికి రక్తంలో లిపిడ్ల సమతౌల్య గుణాలు మరియు సూక్ష్మక్రిమినాశక ధర్మాలు ఉంటాయని తెలిసింది. దీనిని నోటి పూతలను తగ్గించేందుకు సైతం ఉపయోగిస్తారు. అదనంగా, కొబ్బరి పాలలోని సంతృప్త క్రొవ్వుపదార్థం చాలావరకూ లారిక్ ఆమ్లం, ఇది హృదయ సంబంధ వ్యవస్థపై అనుకూల ప్రభావాలు చూపుతుంది. కొబ్బరి పాపలలో విటమిన్స్, మినిరల్స్, మరియు క్యాలరీలు అత్యధికంగా ఉన్నాయి. అందుకే మనం ఈ కోకనట్ మిల్క్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

నిపుణులు అభిప్రాయం ప్రకారం, కొబ్బరి పాలను మితంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. కొబ్బరి పాలను బ్యూటి మరియు హెల్త్ కు ఉపయోగించినా కొన్నిఅద్భుత ఫలితాలను ఇస్తుంది. కొబ్బరి పాలలోని మరికొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్ డైట్ లో ఒక భాగం చేసుకుందాం...

ఆర్థరైటిస్ ను నివారిస్తుంది:

ఆర్థరైటిస్ ను నివారిస్తుంది:

ఆర్థరైటిస్ లేదా జాయింట్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారు కొబ్బరి పాలను తాగడం వల్ల, ఇందులో ఉండే సెలినియం, దీన్నే యాంటీఆక్సిడెంట్ అని పిలుస్తారు. ఆర్థరైటిస్ పెయిన్ ను నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

పాల వలనే, కొబ్బరి పాలలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం కొబ్బరి పాలలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం, కొబ్బరి పాలు బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతాయి. కోకనట్ మిల్క్ ను బాగా బాయిల్ చేయడం వల్ల ప్యూర్ కోకనట్ ఆయిల్ తయారవుతుంది. ఇది బరువు తగ్గించడంలో ఎక్కువగా సమాయపడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి, ల్యూరిక్ యాసిడ్ వ్యాధినిరోధకతను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. తరచూ జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లైతే కొబ్బరి పాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. రెగ్యులర్ డైలీ డైట్ లో మితంగా కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల చిన్న చిన్న వ్యాధులను నివారిస్తుంది.

బోన్స్ స్ట్రాంగ్ గా మారుతాయి:

బోన్స్ స్ట్రాంగ్ గా మారుతాయి:

కొబ్బరి పాలలో క్యాల్షియం మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి . ఇవి బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి, ఇది మాత్రమే కాదు. ఇది బోన్ ఫ్రాక్చర్ ను రిస్క్ ను తగ్గిస్తుంది. కాబట్టి, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కొబ్బరి పాలను తాగాలి.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:

కొబ్బరి పాలలో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. మెగ్నీషియం ముఖ్యమైన పని, శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. కొబ్బరి పాలలో ఉండే మెగ్నీషియం ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది.

హెల్తీ హార్ట్ :

హెల్తీ హార్ట్ :

కొబ్బరి పాలను తాగడం లేదా వంటల్లో జోడించడం వల్ల , హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ యాసిడ్స్ లో యాంటీ బ్యాక్టిరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

ఆల్జైమర్స్ ను నివారిస్తుంది:

ఆల్జైమర్స్ ను నివారిస్తుంది:

కొబ్బరి పాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మతిమరుపును నివారిస్తుంది. ఇక ముందు మతిమరుపు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మతిమరుపు సమస్యతో బాధపడే వారు కొబ్బరి పాలను రెగ్యులర్ గా తీసుకోవడం, ఎఫెక్టివ్ మార్పులు జరుగుతాయి. అందువల్ల హెల్తీ బ్రెయిన్ పొందాలంటే కొబ్బరి పాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

స్ట్రెస్ తగ్గిస్తుంది :

స్ట్రెస్ తగ్గిస్తుంది :

ఇందులో “పొటాషియం” కలిగి ఉండడం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

జీర్ణ సమస్యలు తొలగిస్తుంది

జీర్ణ సమస్యలు తొలగిస్తుంది

కొబ్బరి పాలలో "Omega"అను ఆమ్లాలు 3, 6 మరియు 9 శాతం అధికస్తాయిలో ఉండి,ఈ " Omega "లో అమైనో ఆమ్లాలు మరింత అదికంగా ఉన్నాయి, వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనముగా అనిపిస్తుంది.

ఈ పాల మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా,జీర్ణాశయంకు కలిగిన నస్టాన్ని తొలగించటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary

Amazing Reasons Why It Is Good To Drink Coconut Milk

నిపుణులు అభిప్రాయం ప్రకారం, కొబ్బరి పాలను మితంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. కొబ్బరి పాలను బ్యూటి మరియు హెల్త్ కు ఉపయోగించినా కొన్నిఅద్భుత ఫలితాలను ఇస్తుంది. కొబ్బరి పాలలోని మరికొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్ డైట్ లో ఒక భాగం చేసుకుందాం.Coconut milk, the delectable white liquid extracted from grated coconut meat or pulp is salubrious for all if consumed in moderate amount. From ages, the health benefits of coconut milk have been discussed and are used widely across the world. Usually, coconut water is confounded with coconut milk by many.
Desktop Bottom Promotion