For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చసొన తినడం లేదా ? ఐతే పోషకాలు కోల్పోయినట్టే

By Swathi
|

రోజంతటికీ కావాల్సిన పోషకాలన్నింటినీ.. గుడ్డు ద్వారా పొందవచ్చు. అయితే ఎగ్ వైట్ మంచిదా ? ఎగ్ లోని ఎల్లో మంచిదా ? అంటే చాలా మందికి సమాధానం ఉండదు. కొంతమంది తెల్లనొన మంచిది అంటారు. కొంతమంది పచ్చసొన మంచిది అని సూచిస్తారు. ఏది తినాలి అన్నది చాలామందికి డైలమా. కానీ ఎక్కువమందిలో పచ్చసొన అంటే ఫ్యాట్ అన్న ఫీలింగ్ ఉంది. కానీ.. ఇది అపోహ మాత్రమే.

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎగ్ హెయిర్ మాస్క్ లు

re Egg Whites Healthier Than Egg Yolks

హై క్వాలిటీ ప్రొటీన్, క్యాలరీస్ పొందడానికి కోడిగుడ్డు చాలా మంచిది. ఒక కోడిగుడ్డులో 5.5 గ్రాముల ప్రొటీన్, 68 క్యాలరీలు ఉంటాయి. మన శరీరం ఉత్పత్తి చేయని.. చాలా అవసరమైన కోలిన్ కోడిగుడ్లలో ఉంటుంది. శరీరంలో కోలిన్ తక్కువైతే.. పోషకలోపం, ఫోలిక్ యాసిడ్ లోపం వస్తుంది. పచ్చసొనలో ఫ్యాట్ ఉంటుంది. కానీ అందులో పుష్కలంగా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఎగ్ వైట్ మాత్రమే తినడం వల్ల ఎన్ని పోషకాలు మిస్ అవుతారో ఒకసారి గ్రహించండి.

గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్

re Egg Whites Healthier Than Egg Yolks

అంతేకాదు కోడిగుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, బి12, డి, క్యాల్షియం, ఫోలేట్, ఒమేగా త్రీ అధికంగా ఉంటాయి. వీటన్నింటినీ ఎగ్ ద్వారా పొందవచ్చు అంటే.. అంతకంటే ఏం కావాలి. ఒకవేళ మీరు పచ్చసొనలో ఉండే ఫ్యాట్ గురించి చింతిస్తున్నారా ? అవసరం లేదు. ఎందుకంటే.. రోజుకి 300 ఎమ్ జీ కొలెస్ర్టాల్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు నిర్మొహమాటంగా రోజుకి ఒక ఎగ్ ని పూర్తీగా తినవచ్చు. అలాగే మీట్, చీజ్, డైరీ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకునే కొలెస్ర్టాల్ ని కంట్రోల్ చేసుకుని.. రోజుకి ఒక పూర్తీ ఎగ్ తీసుకుంటే మంచిది.

English summary

Are Egg Whites Healthier Than Egg Yolks?

Are Egg Whites Healthier Than Egg Yolks? Chock-full of protein, eggs are a quick and easy way to get this essential nutrient anytime of the day. From omelets in the morning to quiche at night, you may be shying away from the yolks to save calories and cholesterol.
Story first published: Tuesday, January 19, 2016, 13:03 [IST]
Desktop Bottom Promotion