For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలకు ఖచ్చితంగా నో చెప్పాలంటున్న పోషకాహార నిపుణులు

By Swathi
|

మనం తీసుకునే ఆహారం, తీసుకునే విధానం, శరీరంపై శ్రద్ధ వహించకపోతే.. మనం అనేక రకాల వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. మనం ఏం తింటున్నాం, ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాం అనేది.. ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటిపై ఫోకస్ పెట్టాలి.

పోషకాహార నిపుణులు.. ఈ విషయంపై చాలా శ్రద్ధ తీసుకుంటారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలను పూర్తీగా తీసుకోకూడదని.. అప్పుడు.. ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా.. హెల్తీగా ఉంటారని సూచిస్తున్నారు. మరి అలాంటి ఆహార పదార్థాలేంటో చూద్దాం.

Foods That You Should Avoid According To Nutritionists

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకోవడం మానేయాలి. వీటికి బదులు డేట్స్, తేనె కొద్ది మోతాదులో తీసుకోవడం మంచిది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో సింథేటిక్ సబ్ స్టాన్సెస్ ఉంటాయి. వీటిని శరీరం భరించలేదు. అలాగే.. బరువు తగ్గడానికి ఇవి సహకరించవు.

Foods That You Should Avoid According To Nutritionists

ధాన్యాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం చాలామంచిదని నమ్ముతారు. కానీ.. అవి హెల్తీ కాదు. వీటిల్లో షుగర్, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒక బౌల్ సెరల్స్ తీసుకుంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వేగంగా పడిపోతాయి.

Foods That You Should Avoid According To Nutritionists

చేపలు ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. చేపలు కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వైల్డ్ ఫిష్ అయితే ఆరోగ్యానికి మంచిది. అదే ఫార్మ్డ్ ఫిష్ లో ఎక్కువ మొత్తంలో మెర్క్యూరీ, కాంటామినెంట్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.

Foods That You Should Avoid According To Nutritionists

పీనట్ బట్టర్ ని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. వీటిలో ఎక్కువ మొత్తంలో షుగర్ ఉంటుంది. దీనికి బదులు ఆల్మండ్ బట్టర్ తీసుకోవడం మంచిది. ఇవి కూడా మార్కెట్ లో లభిస్తాయి. అలాగే.. డ్రై ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది. సాల్ట్ నట్స్ కి దూరంగా ఉండటం మంచిది. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది.

Foods That You Should Avoid According To Nutritionists

టిన్ టమోటా.. టిన్ లో ప్యాక్ చేసిన టమోటాల్లో షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే కెమికల్స్ శరీరానికి హాని చేస్తాయి. ఈ కెమికల్స్ హార్ట్, రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

టేబుల్ సాల్ట్ కి దూరంగా ఉండాలి. ఇందులో న్యూట్రిషన్ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ కి కారణమవుతుంది. దీనికి బదులు హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకోవడం మంచిది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ సాల్ట్ తీసుకోవడం కూడా మానేయాలి. వీటిల్లో సోడియం ఎక్కువగా, షుగర్, ప్రిజర్వేటివ్స్, జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపుతాయి.

English summary

Foods That You Should Avoid According To Nutritionists

Foods That You Should Avoid According To Nutritionists. The pace of life has become quicker than it was ever before. People are constantly on the go, rarely sitting down to meals and focusing on what they are eating.
Story first published:Monday, August 1, 2016, 17:03 [IST]
Desktop Bottom Promotion