For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బార్లీ వాటర్ లోని అద్భుత ప్రయోజనాలు

By Super Admin
|

బార్లీని నీటిలో ఉడికించడం వలన బార్లీ పానీయం తయారవుతుంది. కొద్దిగా తీపి మరియు కొద్దిగా నిరసం కలపటం వలన ఇది ఒక రిఫ్రెష్ పానీయం లా తయారుచేసుకోవొచ్చు. ఈ బార్లీ పానీయం సేవించటం వలన మీకు ఆశ్చర్యం గొలిపించే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా బార్లీ పానీయం తయారుచేసుకోవాలి మరియు దాని వలన కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందిస్తున్నాము. చదవండి.

బార్లీ పానీయాన్ని తయారుచేయటం ఎలా

ఒకరికి సరిపోయేలా పానీయం తయారుచేసుకోవటానికి, ఒక సాస్ పాన్ లొ రెండు టీ స్పూన్ల బార్లీని తీసుకోండి మరియు వీటికి ఒక కప్పు నీటిని కలపండి. బార్లీ బాగా ఉడికేవరకు వేడి చేయండి. బాగా ఉడికిన తరువాత ఈ నీటిని వడపోయండి. ఈ పానీయం చల్లగా అయింతరువాత అలానే తీసుకోవొచ్చు లేదా మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకుని త్రాగవచ్చు. ఈ పానీయాన్ని పెద్ద మొత్తంలో కూడా తయారుచేసుకోవచ్చు మరియు నిల్వ చేసుకోవొచ్చు. ఇలా నిల్వ చేసుకోవాలంటే, ఒక కిలోగ్రాము బార్లీని తీసుకుని, దీనికి రెండింతలు నీరు కలిపి, బార్లీ ఉడికేవరకు వేడిచేయండి. తరువాత వడకట్టి, చల్లార్చి, ఒక బాటిల్ లొ నిల్వ చేసుకోండి. దీనిని రిఫ్రిజిరేటర్ లొ కూడా ఉంచి నిల్వ చేసుకోవచ్చు. రోజులో ఒకసారి లేదా రెండుసార్లు ఈ పానీయాన్ని త్రాగవచ్చు.

ఎ బార్లీని వాడాలి?

పొట్టు ఉన్న - ముత్యాల్లాగా ఉన్న బార్లీ

మీరు హల్డ్ బార్లీ మరియు ముత్యాల వంటివి, ఈ రెండింటిలో మీరు ఎంపిక చేసుకోవొచ్చు. మొదటిదానిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మరియు వండడానికి సమయం పడుతుంది, అయితే, రెండోడి ఉడికించటానికి సులభంగా ఉంటుంది.


హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జనక్రియలో శరీరం నుండి విషపదార్థాలను బయటకు నెట్టివేయటంలో సహాయపడుతుంది, మరియు హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మీకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్ వొచ్చే అవకాశం తగ్గిస్తుంది మరియు ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.

యూరిన్ ద్వారా టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది

యూరిన్ ద్వారా టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది

ఇది మూత్రం ద్వారా నిల్వ చేసిన నీరు మరియు విషాన్ని బయటకు పంపి, మూత్రవిసర్జన ప్రేరకంగా పనిచేస్తుంది.

బాడీ హీట్ తగ్గిస్తుంది

బాడీ హీట్ తగ్గిస్తుంది

ఈ పానీయాన్ని తీసుకోవటం వలన వేసవి నెలల్లో ఏర్పడే శరీరంలో వేడి తగ్గుతుంది.

స్టొమక్ బర్నింగ్ తగ్గిస్తుంది

స్టొమక్ బర్నింగ్ తగ్గిస్తుంది

ఇది ఒక శీతలకరణి కనుక, మీరు స్పైసి ఆహారం తీసుకోవటం వలన కలిగే కడుపు మంటను ఈ శీతల పానీయం తీసుకోవటం వలన ఉపశమించుకోవచ్చు.

కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది

కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది

బార్లీ ఒక యాంటీ-ఇన్ఫ్లమేటరీ. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు బార్లీ నీటిని తాగడం వలన ఉపశమనం కలుగుతున్నదని చెపుతున్నారు.

షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

దీనిలో ఉండే బీటా-గ్లూకాన్ ద్వారా శరీరంలో గ్లూకోజ్ శోషణ మందగిస్తుందని, ఇందువలన బ్లడ్ షుగర్ స్థాయిలు నిలకడగా ఉంటాయి. మీరు డయాబెటిక్ అయినట్లయితే, మీ చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి బార్లీ నీటిని తాగండి.

ఫైబర్ ఫుష్కలంగా అందుతుంది

ఫైబర్ ఫుష్కలంగా అందుతుంది

ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని త్రాగటం వలన మీకు రోజువారి అవసరం అయ్యే పీచు పదార్థం భర్తీ అవుతుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది

హార్ట్ హెల్త్ కు మంచిది

దీనిలొ ఉండే అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివలన మీ గుండె ఆరోగ్యకరంగా తయారవుతుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

బార్లీ రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది మరియు అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటు అదుపులో ఉంచుకోవటానికి ఈ బార్లీ పానీయాన్ని సేవించటం చాలా ఉపయోగకరం.

పాదాల వాపు తగ్గించుకోవచ్చు

పాదాల వాపు తగ్గించుకోవచ్చు

దీనిని సేవించటం వలన గర్భిణి స్త్రీలలో కలిగే పాదాల వాపును నిరోదించవచ్చు..

ప్రెగ్నెన్సీలో యూటీఐ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది

ప్రెగ్నెన్సీలో యూటీఐ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది

గర్భిణి స్త్రీలలో మధుమేహం మరియు ఈస్ట్ మరియు గర్భిణీ స్త్రీలలో వచ్చే మూత్ర అంటువ్యాధులు కూడా నిరోధించబడతాయి.

పాలు బాగా పడుతాయి

పాలు బాగా పడుతాయి

ప్రసవం తర్వాత చనుబాలను ఇస్తున్నట్లయితే, అప్పుడు మీరు రోజు బార్లీ నీటిని ఒక కప్పు సేవించినట్లయితే చనుబాలివ్వడంలో గొప్ప సహాయకారిగా పని చేస్తుంది మరియు తల్లి మరియు బిడ్డ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా

బార్లీ నీరు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంచే ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. రోజువారీ ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తీసుకున్నట్లయితే మూత్రపిండాలలో ఏ రాళ్ళు ఉన్నా బయటకు పంపించివేయటంలో సహాయం చేస్తుంది మరియు మీ మూత్రపిండాలను టాప్ ఆకారంలో ఉంచుతుంది.

అధికబరువు తగ్గించటంలో

అధికబరువు తగ్గించటంలో

ముఖ్యంగా, బార్లీ నీరు అధికబరువు తగ్గించటంలో మీకు సహాయపడుతుంది. దీనిలొ ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మలిని చాలా సమయం వరకు మీ పొట్ట నిండుగా ఉందన్న అనుభూతిలో ఉంచుతుంది మరియు మీరు రోజు తీసుకున్న చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది మరియు మీకు కలిగే శక్తికి ఆటంకాలను తొలగిస్తుంది. మీ జీర్ణక్రియ మరియు జీవక్రియ బాగా మెరుగుపరచి, మీరు అధికబరువును వేగంగా కోల్పోవటంలొ సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం సాయంత్రం మరియు ఉదయం ఒక కప్పు పానీయం తీసుకోండి.

బార్లీ వాటర్

బార్లీ వాటర్

ఇప్పుడు మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాము, మీరు గ్లాసులో బార్లీ పానీయాన్ని తయారు చేసుకోండి మరియు మంచి ఆరోగ్యానికి స్వాగతం పలకండి.

English summary

Health Benefits of Barley Water

Barley Water has a number of health benefits that could surprise you. We tell you how to make Barley water and all the health benefits associated with it.
Desktop Bottom Promotion