For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ ఆపిల్ లో దాగి ఉండే మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్..!

|

రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం లేనట్లే...! ఈ సామెత మనందరికి తెలిసన విషయమే, అయితే మనలో ఎంత మంది ఈ విషయాన్ని నమ్మతారు, ఆచరిస్తారు?ఎంత మంది ఆపిల్ ను ప్రతి రోజూ తింటారు? నాకు తెలిసి ప్రతి రోజూ రెగ్యులర్ ఆపిల్ తినే వారు తక్కువే అని చెప్పవచ్చు! అలాంటి వారికోసం ఈ ఆర్టికల్. ఇందులోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుకుంటే చాలు, ఇక ఈ రోజు నుండే ఆపిల్ తినడం మొదలు పెడతారు.

"రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు" అని ఒక సామెత ఉన్నది. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్ లో ఈ వాస్తవం కలిగి ఉంది. ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. ప్రతి వ్యక్తి తమ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!

గ్రీన్ యాపిల్స్ లో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్లు అనేకం ఉన్నాయి. ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘ కాలిక ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు . ఎందుకంటే యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ గుణాలన్నీ నివారిణులుగా మరియు ఇక్సిడేషన్ డ్యామేజ్ కలగకుండా మరియు శరీరంలోని కణాల పునరుత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతాయి.

యాపిల్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవలసిన 10 నిజాలు

ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం, BP తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం & ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గ్రీన్ ఆపిల్స్ లో ఉండే ఫైటో న్యూట్రీషియన్స్ మరియు యాంటా ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను , హైపర్ టెన్షన్, డయాబెటిస్ మరియు హార్ట్ సమస్యలను నివారిస్తుంది. మరి మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

1. డైటరీ ఫైబర్ :

1. డైటరీ ఫైబర్ :

గ్రీన్ ఆపిల్స్ లో డైటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. గ్రీన్ ఆపిల్ చర్మంలోనే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది . బౌల్ మూమెంట్ ప్రొపర్ గా ఉంచుతుంది. దాంతో మలబద్దకం తగ్గుతుంది.

2. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

2. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

గ్రీన్ యాపిల్స్ లో ఉండే మినిరల్స్ బోన్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా ఐరన్, కాపర్, క్యాల్షియం, జింక్, మ్యాంగనీస్, పొటాషియం వంటి మినిరల్స్ ఎక్కువగా బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. గ్రీన్ ఆపిల్స్ లో ఉండే మినిరల్స్ బోన్ స్ట్రక్చర్ ను స్ట్రాంగ్ చేస్తాయి. థైరాయిడ్ ఫంక్షన్ ను సరిగా పనిచేసేందుకు సహాయపడుతాయి. దాంతో రుమటాయిడ్ సమస్యలుండవు.

3.కోలన్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది:

3.కోలన్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది:

గ్రీన్ ఆపిల్స్ లో ఉండే ఫైబర్ కోలన్ క్యాన్సర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చాలా ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. కోలన్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. మెటబాలిజం రేటు పెంచుతుంది:

4. మెటబాలిజం రేటు పెంచుతుంది:

గ్రీన్ యాపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బౌల్ మూమెంట్ పెంచుతుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మెటబాలిజం రేటు పెంచుకోవాలంటే గ్రీన్ యాపిల్స్ తినాల్సిందే..

5. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

5. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

గ్రీన్ యాపిల్స్ ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ (బ్యాడ్ కొలెస్ట్రాల్)ను తగ్గించడంలో మరియు హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్(మంచి కొలెస్ట్రాల్ )ను బ్యాలెన్స్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్స్ నేచురల్ ఫుడ్స్ కాబట్టి, కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది.

6. ఆల్జైమర్స్ :

6. ఆల్జైమర్స్ :

మతిమరుపును తగ్గిస్తుంది: మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం. మెంటల్ హెల్త్ ను మెరుగుపరిచే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. ఇది మెంటల్ హెల్త్ ను మెరుగుపరచడంతో పాటు మతిమరుపు వంటి వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

7. లివర్ హెల్త్ మెరుగుపడుతుంది:

7. లివర్ హెల్త్ మెరుగుపడుతుంది:

గ్రీన్ ఆపిల్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గ్రీన్ యాపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ ను హెల్తీగా ఉంచుతుంది. లివర్ సమస్యలను దూరం చేస్తుంది, . అలాగే జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

గ్రీన్ యాపిల్స్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్నిసూపర్ ఫుడ్ గా పిలుస్తారు. వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలోని అన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దాంతో శరీరానికి అలర్జీలు, ఆస్త్మా, వంటివి సోకకుండా గ్రీన్ ఆపిల్ రక్షణ కల్పిస్తుంది.

English summary

Major Health Benefits Of Green Apple

You are well known with the fact that an apple a day keeps a doctors away. The benefits of apples are numerous and when it comes to green apples, these are more nutritious than red apples.
Desktop Bottom Promotion