For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్ని మూలికలు, కూరగాయల్లో దాగున్న అద్భుత ఔషధ గుణాలు..!!

By Swathi
|

రకరకాల కూరగాయలు, మూలికలను మనలో చాలామంది ఎంజాయ్ చేస్తారు. కొన్ని డిషెస్ లో ఉపయోగించే.. మూలికలు, కూరగాయల్లో చాలా అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మనం రోజూ ఉపయోగిస్తున్నా.. కొన్నింటినీ.. వంటల్లో వాడినా.. పక్కన పడేస్తుంటాం. కానీ వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే.. ఇకపై ఖచ్చితంగా తింటారు.

కొన్ని రకాల మూలికల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి కూడా సహాయపడతాయి. అనేక అనారోగ్య సమస్యలతో పోరాడే సత్తా కొన్ని రకాల స్పైసెస్ లో దాగున్నాయి.

పుదీనా

పుదీనా

పుదీనాలో పంటి నొప్పిని నివారించే గుణం ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి, అలసట, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే టీలో, చికెన్ వంటకాల్లో, నిమ్మరసం నీటిలో, సూప్స్ లలో పుదీనా ఆకులు కలిపి తీసుకోవచ్చు.

పసుపు

పసుపు

పసుపు తలనొప్పిని తగ్గిస్తుంది. లివర్ ని డెటాక్సిఫై చేస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది. త్వరగా గాయాలను మానేస్తుంది. పసుపుని సూప్స్, సలాడ్స్, ఇతర డిష్ లలో ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయ దగ్గు నివారిస్తుంది. లిబిడో స్థాయి పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సమస్యలను నివారిస్తుంది. సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఉల్లిపాయలను సూప్స్, సాస్ లలో, వంటకాలు, సలాడ్స్ లో ఉపయోగించవచ్చు.

జీలకర్ర

జీలకర్ర

జీలకర్ర చర్మ సమస్యలను నివారించడంతో పాటు, డయాబెటిస్ ని నివారించి.. డైజెషన్ ని మెరుగుపరుస్తుంది. సలాడ్స్, వంటకాలు, సూప్ లలో జీలకర్ర వాడవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఇమ్యునిటీని పెంచుతుంది. కార్డియోవాస్కులర్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించి.. కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దాల్చిన చెక్కను వంటకాల్లోనూ, టీలోనూ చేర్చుకోవచ్చు.

అల్లం

అల్లం

అల్లం ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది. మైగ్రేయిన్, వికారంను అరికడుతుంది. అల్లం టీ తాగడం, వంటకాల్లో అల్లం రుచిని చేర్చడం వల్ల మెడిసినల్ బెన్ఫిట్స్ పొందవచ్చు.

English summary

Medicinal Benefits Of Some Spices And Veggies

Medicinal Benefits Of Some Spices And Veggies. Though most of us enjoy various vegetables and spices in our dishes, we seldom care to know about their benefits to the health.
Story first published: Saturday, September 3, 2016, 13:25 [IST]
Desktop Bottom Promotion