For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి..పగలు..ఎప్పైడైనా సరే ఇన్ స్టాంట్ ఎనర్జీని అందించే 9 ఎలక్ట్రోలైట్స్

|

మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తాయి? మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా...హైడ్రేషన్ లో ఉండాలంటే ఎలక్ట్రోలైట్స్ చాలా అవసరం. ఎలక్ట్రోలైట్స్ అంటే మన శరీరానికి అవసరమైన ఎనర్జీని అందించే ఖనిజలవణాలు. అంటే ఎలక్ట్రిక్ చార్జ్ లా పనిచేస్తాయన్నమాట. ఈ ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలోని ఫ్లూయిడ్స్ మరియు బ్లడ్ లో ఉంటాయి.

ఈ ఎలక్ట్రోలైట్స్ శరీరం మొత్తానికి సప్లై అవ్వడంతో తక్షణ ఎనర్జీని పొందుతారు. శరీరంలో ముఖ్యమైన జీవక్రియలు జరగడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి శరీరంలో అసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి. నాడీవ్యవస్థను రెగ్యులేట్ చేస్తాయి. మజిల్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తాయి. ఇన్ని రకాలుగా పనిచేసే ఎలక్ట్రోలైట్స్ లో హెచ్చుతగ్గులు లేదా లోపిస్తే ఏంజరుగుతుంది.

క్లోరైడ్, పొటాషియం మరియు సోడియం వంటి ఖనిజలవణాలు(ఎలక్ట్రోలైట్స్ ) మన శరీరంలో ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవల్స్ పెరిగితే కిడ్నీలు అదనంగా పనిచేసి, వాటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ పెరగడం వల్ల కిడ్నీల పనిభారం పెరుగుతుంది.

కాబట్టి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువతక్కువ కాకుండా బ్యాలెన్స్ చేయడం వల్ల శరీరంలోని జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి. మజిల్స్ ఆరోగ్యానికి కూడా ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా అవసరమవుతాయి. శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయాలంటే సరైన మోతాదులో ఎలక్ట్రోలైట్స్ ఉండాలి.

పొటాషియం, సోడియం వంటి మినిరల్స్ లోపం లేదా ఎక్సెస్ అయినప్పుడు డీహైడ్రేషన్ కు గురౌతారు. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఒక వేళ బాడీ డీహైడ్రేషన్ కారణంగా లేదా అనారోగ్య కారణంగో ఎలక్ట్రోలైట్స్ తగ్గింతే వెంటనే రీఫిల్ చేయడానికి సహాయపడే కొన్ని నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. కొబ్బరి నీళ్ళు:

1. కొబ్బరి నీళ్ళు:

కోకనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు వెంటనే టండర్ కోకనట్ ఇవ్వమని సూచిస్తుంటారు .నిజానికి చాలా త్వరగా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించి శరీరాన్ని కూల్ గా , తేమగా మార్చుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది.

2. ఆకు కూరలు:

2. ఆకు కూరలు:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం మరియు క్యాల్షియం అత్యధికంగా ఉన్నాయి. ఇవి ఎలక్ట్రోలైట్స్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

3. ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ :

3. ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ :

కొన్ని రకాల ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ లో మెగ్నీషియం, క్యాల్షియం మరియు పొటాషియం అత్యధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అత్యవసరమైన ఎలక్ట్రోలైట్స్ . ఆకుకూరల్లో క్యాల్షియం, స్వీట్ పొటాటోలో పొటాషియం మరియు బెండకాయలో మెగ్నీషియం ఉంటాయి. ఈ మూడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో పుష్కలంగా ఉన్నాయి.

4. నట్ బట్టర్:

4. నట్ బట్టర్:

ఫాస్పరస్, సోడియం మరియు మెగ్నీషియం వంటి మినిరల్స్ నట్ బట్టర్ లో పుష్కలంగా ఉన్నాయి . రెగ్యులర్ డైట్ లో కొద్దిగా తీసుకుంటే చాలు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా అందుతాయి.

5. ఉప్పు:

5. ఉప్పు:

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కానీ రోజూ మితంగా ఉప్పు కూడా శరీరానికి అవసరమవుతుంది. వంటల్లో ఉప్పు జోడించడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే సోడియం అందుతుంది. సాల్ట్ ఫుడ్స్ మన శరీరానికి అవసరమయ్యే ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి.

6. లెమన్ వాటర్ :

6. లెమన్ వాటర్ :

లెమన్ వాటర్ లో పొటాషియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇది శరీరానికి త్వరగా ఎనర్జీని అందిస్తుంది.

7.అరటిపండ్లు:

7.అరటిపండ్లు:

అరటి పండ్లు మజిల్స్ క్రాంప్ మరియు అలసటను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి?ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం అనే ఖనిజలవనం(ఎలక్ట్రోలైట్ )ఎక్కువగా ఉంటుంది.

English summary

Natural Sources Of Electrolytes

Electrolytes play a very important role in our survival. What are electrolytes? Well, they are nothing but minerals that possess electric charge. Your blood and some of the bodily fluids contain electrolytes.
Story first published:Tuesday, August 2, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion