For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ డైట్ లో ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ చాలు..?

By Swathi
|

గ్రీన్ గ్రేప్స్.. వీటినే ద్రాక్ష, సీడ్ లెస్ ద్రాక్ష అని పిలుస్తారు. ఇవి చాలా స్వీట్ గా, జ్యూసీ, క్రంచీగా ఉంటాయి. వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. అమెరికన్స్ సీడ్ లెస్ గ్రీన్ గ్రేప్స్ ని ఎక్కువగా తింటారు. ఏడాదికి 8 పౌండ్ల గ్రీన్ గ్రేప్స్ తింటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకవిలువలు మెండుగా ఉన్న గ్రీన్స్ గ్రేప్స్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

READ MORE: ద్రాక్ష రసంలోని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు

గ్రీన్ గ్రేప్స్ ని డైలీ డైట్ లో చేర్చుకోవాలని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ లో 104 క్యాలరీలు, 1.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతే ఆరోగ్యానికి ఎంతో తోడ్పడే.. విటమిన్స్, మినరల్స్ ని వీటి ద్వారా పుష్కలంగా పొందవచ్చు. తక్కువ క్యాలరీలు, జీరో ఫ్యాట్, న్యూట్రీషన్ ఫ్రూట్ కావడం వల్ల వీటిని అందరూ రెగ్యులర్ గా తీసుకోవాలి. గ్రీన్ గ్రేప్స్ ద్వారా పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

తక్కువ క్యాలరీ

తక్కువ క్యాలరీ

ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ లో 104 క్యాలరీలు ఉంటాయి కాబట్టి.. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడం మంచిదని స్టడీస్ సూచిస్తున్నాయి. రోజు ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గించి, శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందిస్తుంది. అలాగే బరువు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

గ్రీన్ గ్రేప్స్ లో ఉండే పోషకాలు ఇన్ఫెక్షన్స్, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ క్లాట్స్ నివారించి, ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తాయి.

క్యాన్సర్

క్యాన్సర్

ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల విటమిన్ సి శరీరానికి కావాల్సిన స్థాయిలో అందుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి నివారించి.. క్యాన్సర్ రిస్క్ ని అరికడుతుంది.

ఎముకలు

ఎముకలు

గ్రీన్ గ్రేప్స్ లో విటమిన్ సి, కె పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి ఇన్ఫెక్షన్స్, ఎముకలు, పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి కేవలం ఆరంజ్ ద్వారానే కాకుండా.. గ్రీన్ గ్రేప్స్ ద్వారా విటమిన్ సి పొందవచ్చు.

కార్బోహైడ్రేట్స్

కార్బోహైడ్రేట్స్

రోజువారీ డైట్ లో కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. వీటి ద్వారా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఈజీగా పొందవచ్చు. అంతేకాదు గ్రీన్ గ్రేప్స్ లో హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ లో 27 గ్రాముల హెల్తీ కార్బ్స్, 14 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

ఎలక్ట్రోలైట్స్

ఎలక్ట్రోలైట్స్

గ్రీన్ గ్రేప్స్ ద్వారా ఎలక్ట్రోలైట్స్ పొందవచ్చు. కండరాల పనితీరుకి ఈ ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ నుంచి 15 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 11 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 288 మిల్లీగ్రాముల పొటాషియం, 30 మిల్లీగ్రాముల ఫాస్పరస్ పొందవచ్చు.

ఎసెన్షియల్ విటమిన్స్

ఎసెన్షియల్ విటమిన్స్

గ్రీన్ సీడ్ లెస్ గ్రేప్స్ నుంచి విటమిన్ ఏ, సి, కే పొందవచ్చు. ఒక కప్పు ద్రాక్ష ద్వారా 100 యూనిట్ల ఏ, 4.8 మిల్లీగ్రాముల విటమిన్ సి, 22 మిల్లీగ్రాముల విటమిన్ కె పొందవచ్చు. విటమిన్ ఏ ఇన్ఫెక్షన్లను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి చిగుళ్లు, కండరాల ఆరోగ్యానికి అవసరం.

English summary

Nutritional Value of Green Seedless Grapes

Nutritional Value of Green Seedless Grapes. Crunchy, sweet and juicy, green seedless grapes satisfy a multitude of cravings, which may be why Americans like them so much.
Story first published: Saturday, February 6, 2016, 10:22 [IST]
Desktop Bottom Promotion