For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక గ్లాసు అన్నం గంజి ( రైస్ వాటర్ )తో పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్

By Swathi
|

రైస్ వాటర్ ! దీన్నే గంజి అని పిలుస్తారు. అన్నం ఉడికిన తర్వాత వంపేసే నీటిని అన్నం గంజి అంటారు. ఇది ఎంతో మందికి ఆకలి తీర్చే ఆహారం. పల్లెటూర్లలో ఇప్పటికీ చాలామంది రైస్ వాటర్ తో కడుపు నింపుకుంటూ ఉంటారు. అయితే ఈ నీటి ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇకపై మీరు కూడా రెగ్యులర్ గా రైస్ వాటర్ తీసుకోకమానరు.

కొన్ని శతాబ్దాలుగా అన్నం గంజికి ఉన్న విలువే వేరు. ఇందులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. మన ఇండియన్స్ పూర్వ కాలం నుంచి.. ఈ రైస్ వాటర్ ని తీసుకుంటూ ఉన్నారు. ఇందులో న్యూట్రీయంట్స్, కార్బోహైడ్రేట్స్, ఎమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

చాలా సందర్భాల్లో చాలా మంది ఈ అన్నం గంజిని పడేస్తుంటారు. కానీ.. ఇందులో ఉండే మెడిసినల్ గుణాలు అనారోగ్య సమస్యలను, నీరసాన్ని నివారిస్తాయి. అయితే ఒక్క గ్లాసు అన్నం గంజి తీసుకోవడం వల్ల గ్రేట్ బెన్ఫిట్స్ పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి చీప్ గా దొరికే మంచినీళ్లు, బియ్యం ద్వారా హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

రైస్ వాటర్ తయారు చేసే విధానం

రైస్ వాటర్ తయారు చేసే విధానం

బియ్యం కడిగిన నీళ్లే రైస్ వాటర్ అనుకుంటే పొరబడ్డట్టే. ఈ నీటిని కూడా ఉపయోగించవచ్చు. కానీ.. ఇన్ని ప్రయోజనాలు వీటి ద్వారా పొందలేము. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే. ఎక్కువ నీళ్లు పోసి బియ్యంను బాగా ఉడకబెట్టాలి. ఉడికేటప్పుడు బియ్యంను, నీటిని సపరేట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడైనా, చల్లార్చి అయినా ఆ నీటిని తాగవచ్చు. ఇలా రైస్ వాటర్ తయారు చేసుకోవాలి. ఈ నీటిని మీకు పైన చెప్పిన ఈ పద్ధతిలోనైనా ఉపయోగించవచ్చు.

డీహైడ్రేషన్

డీహైడ్రేషన్

ఇది న్యాచురల్ హైడ్రేటింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది. ఇందులో పోషకాలు రిచ్ గా ఉంటాయి. సమ్మర్ లో ఇది అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఒక గ్లాజు గంజి తాగితే.. డీహైడ్రేషన్ బలాదూర్ అవుతుంది.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

రైస్ వాటర్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఒక గ్లాసు దీని రెగ్యులర్ గా తాగితే.. కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఎనర్జీ

ఎనర్జీ

ఒక గ్లాసు అన్నం గంజి తీసుకోవడం వల్ల.. ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ మెండుగా ఉంటాయి.

క్యాన్సర్

క్యాన్సర్

అన్నం గంజిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఫెనోల్స్ ఉండటం వల్ల.. అన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తప్పించుకోవచ్చు.

డయేరియా

డయేరియా

డయేరియా లేదా మోషన్స్ సమస్య నివారించడానికి చాలా కాలం నుంచి ఈ రైస్ వాటర్ ని ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రోలైట్ పౌడర్ కంటే.. అన్నం గంజితో అద్భుతమైన ఫలితం పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి.

అల్జీమర్స్

అల్జీమర్స్

రైస్ వాటర్ లో ఉండే కొన్ని రకాల పోషకాలు.. న్యూరోట్రాన్సిమిట్టర్స్ డెవలప్ మెంట్ కి సహాయపడతాయి. కాబట్టి రెగ్యులర్ గా ఒక గ్లాసు అన్నం గంజి తీసుకుంటే.. అల్జీమర్స్ నివారించవచ్చు.

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్స్ అయిన జ్వరం వంటి వాటిని నివారించడంలో రైస్ వాటర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఎండ నుంచి

ఎండ నుంచి

ఒక గ్లాసు రైస్ వాటర్ తాగడం వల్ల.. సూర్య కిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా.. కాపాడుతుంది. యూవీ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.

బాడీ హీట్

బాడీ హీట్

ఈ నీటిని తీసుకుంటే.. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తితో పాటు ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే క్యాన్సర్ ను నివారిస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు.. బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

జుట్టుకి

జుట్టుకి

ఈ రైస్ వాటర్ తో జుట్టుని శుభ్రం చేసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తూ.. ఆరోగ్యంగా ఉంటుంది.

కండరాలు

కండరాలు

రైస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల కండరాలు, చర్మం స్మూత్ గా, అందంగా కనిపిస్తాయి.

English summary

One Glass Of Rice Water Will Do This!

One Glass Of Rice Water Will Do This! For centuries, people across the globe have used rice water for an array of health benefits.
Story first published: Monday, April 25, 2016, 9:46 [IST]
Desktop Bottom Promotion