For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్

|

నేటి రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తోంది. ఎన్ని ఆహారాలు తిన్నప్పటికి ఒత్తిడి కారణంగా అవన్ని మనలను నీరసించేలానే చేస్తూంటాయి. ప్రత్యేకించి చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. ఉదయం 11 గంటలకు ఒక కాఫీ లేదా సాయంత్రం 4 గంటలకు ఒక టీ వంటివి ఎప్పటికపుడు శక్తి పొందేందుకు తాగి పని చేస్తూంటారు. కాఫీలు, టీల వంటివి తాత్కాలికంగా మనలోని శక్తిని పెంచి పని చేసేలా చేసినప్పటికి, వాటి ప్రభావంగా మరల సాయంత్రం అయ్యే సరికి అలసిపోక తప్పదు.

ఆఫీస్ లో విసుగు, అలసట వంటివి మిమ్మల్ని సరిగా పనిచేయనివ్వవు. ఈ కారణంగా వీరు తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. ఆఫీస్ లో సాయంత్రం అయ్యే సరికి కొంతమంది మరుసటిరోజు సెలవు పడేయాలనే భావనలు కూడా కలిగి ఉంటారు. ఒత్తిడి ఈ స్ధాయిలో వారిపై ఉంటుంది. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది.

దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి అందించారని తెలిసింది. రెండు వారాల తర్వాత వారు కార్యాలయ పని అంతా పూర్తయిన తర్వాత వారికి ఒక ప్రశ్నా పత్రం అందించారు. అందులో చాలామంది ఉద్యోగులు వారు చాలా హేపీ భావిస్తున్నట్లుపని ఒత్తిడి భావించకుండా వున్నట్లు, చురుకుగాను, ఎంతో గర్వంగాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రీసెర్చిని ఒక పోమోగ్రానేట్ జ్యూస్ కంపెనీ నిర్వహించింది. దానిమ్మ జ్యూస్ కేవలం స్ట్రెస్ బూస్టర్ మాత్రమే కాదు, ఇందులో వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది.

యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది.

దానిమ్మ జ్యూస్ లో బ్రెస్ట్, ప్రొస్టేట్, స్కిన్ మరియు లంగ్ క్యాన్సర్ ను నివారించే యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే హార్మోనులు డెవలప్ కాకుండా నివారోదిస్తుంది, . ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు గుండె వ్యాధులు మీద పోరాటం చేస్తుంది. రెండు ప్రత్యేక అధ్యయనాలు దానిమ్మ రసం ప్రోస్టేట్ క్యాన్సర్ పోరాడటానికి సహాయపడుతుంది అని వాదన. ఒక లాబ్ ప్రయోగంలో, ఈ రసం వల్ల "సంస్కృతి క్యాన్సర్ కణాలు వృద్ధి మందగించింది మరియు కణాల మరణం" అని తెలిసింది. రెండవ ప్రయోగంలో, దానిమ్మ రసం గుండె వ్యాధులు గల వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్త పరిస్థితి మెరుగుపర్చింది.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:

రక్తాన్ని పలుచగా మార్చుతుంది: సహజ రక్తము పలుచగా ఉండి రక్తం గడ్డకట్టడంలో రెండు రకాల ఉన్నాయి. మొదటిది ఏదైనా కోసుకొని గాయాలు అయినప్పుడు రక్తం ఎక్కువగా పోకుండా వెంటనే గడ్డకట్టడం ముఖ్యం. అలాగే రెండవది అంతర్గతంగా రక్తం గడ్డకట్టడం ప్రమాదకరము. ఉదాహరణకు గుండె మరియు ధమనులు, మూత్రసంబంధమైన నిలుపుదలలో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయి. ఇలా రక్తం గడ్డ కట్టటం అనేది ప్రాణాంతకంగా మారుతుంది.

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

దానిమ్మ గింజలు రఫ్ గా ఉండటం వల్ల ఇది ప్రేగుల్లోని పదార్థాలను ముందుకు నెట్టి త్వరగా జీర్ణం అయ్యే విధంగా సహాయపడుతుంది. ఫలితంగా మీ బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా ఉంటుంది.

దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్.

దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్.

ఇందులో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ధమనులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంది:

యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంది:

దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని యంగ్ గా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్ ను పుష్కలంగా అందించే ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి.

ఇమ్యూనిటి పెంచుతుంది:

ఇమ్యూనిటి పెంచుతుంది:

దానిమ్మలోని విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. దగ్గు మరియు జలుబు వంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తిని పుష్కలంగా అంధిస్తుంది.

కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది:

కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది:

కాలేయం రీజనరేటివ్ ఆర్గాన్. దానంత అది పునరుద్దింపబడుతుంది. దానిమ్మ తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది మరియు రీజనరేట్ అవుతుంది . అందుకే చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు మరియు ఆల్కహాల్ అధికంగా త్రాగే వారు దానిమ్మను అధికంగా తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.

కిడ్నీ క్లెన్సింగ్ :

కిడ్నీ క్లెన్సింగ్ :

శరీరంలో అనేక వ్యర్థాలను బయటకు పంపించే ఒక ముఖ్య యంత్రం కిడ్నీలు. అందువల్ల దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది.

నేచురల్ యాంటీ అలెర్జీంట్ :

నేచురల్ యాంటీ అలెర్జీంట్ :

కొంత మంది వివిధ రకాలుగా అలర్జీలకు గురి అవుతుంటారు . దానిమ్మలో ఫాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇది అలెర్జీలను కంట్రోల్ చేసి అలర్జిక్ రియాక్షన్స్ ను తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్ ను నివారిస్తుంది:

ఆర్థరైటిస్ ను నివారిస్తుంది:

దానిమ్మ రసం రక్తనాళాల్లోని రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని క్రమబద్దంగా ఉండేలా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి, ఫ్రీ రాడికాల్స్ మీద పోరాడటానికి మరియు రక్తం గడ్డకట్టడం నిరోధిస్తుంది. చివరికి మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అభివృద్ధి క్రమంగా స్వేచ్ఛగా రక్తం ప్రవహించటానికి సహాయపడుతుంది.కీళ్ళనొప్పులలో మృదులాస్థికి సంభవించే నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ పండు నొప్పి తగ్గించి మరియు మృదులాస్థి నాశనం చేసే ఎంజైమ్ మీద పోరాడే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

దానిమ్మ బరువును నియంత్రిస్తుంది:

దానిమ్మ బరువును నియంత్రిస్తుంది:

దానిమ్మ బరువును నియంత్రిస్తుంది: ఇది కేలరీలు లేని ఒక పండు.

రక్తపోటును తగ్గిస్తుంది:

రక్తపోటును తగ్గిస్తుంది:

దానిమ్మ పండు రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.

అల్జీమర్ వ్యాధిని తగ్గిస్తుంది:

అల్జీమర్ వ్యాధిని తగ్గిస్తుంది:

అల్జీమర్ వ్యాధి వంటి మెమరీ సంబంధిత రుగ్మతల నుండి నయము చేయుటలో సహాయం చేస్తుంది.

సెక్స్ లైఫ్ కు మంచిది :

సెక్స్ లైఫ్ కు మంచిది :

దానిమ్మలో ఆప్రియోడిసాసిక్ కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటారో అప్పుడు టెస్టోస్టిరాన్ లెవవల్స్ క్రమంగా పెరిగి సెక్స్ లైఫ్ ను ఆంనందంగా మార్చుతుంది. : అంగస్తంభన లోపం అనే సమస్యను దానిమ్మ నయం చేస్తున్నదని ఒక నమ్మకం ఉంది. ఇది ఒక అద్భుత ఔషదం కాదు. దానిమ్మ రసం మాత్రమే మధ్యస్తంగా అంగస్తంభన మెరుగుపరుస్తుంది

English summary

Top 14 Healht Benefits of Pomegranate Juice For Your Health

The pomegranate fruit is well known to everyone and it is grown throughout India. The colour and taste of the fruit gives attraction to the eyes of the individuals. It has curative and medicinal properties and it also helps to cure various ailments in human body. The fruit is red inside and reddish yellow outside. The reddish seed of the fruit gives more taste than that of white one.
Story first published: Wednesday, July 13, 2016, 18:40 [IST]
Desktop Bottom Promotion