For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండ్లలో ఉండే విత్తనాలు పడేస్తే.. పోషకాలు పడేసినట్టేనా.. !! ఎందుకు ?

By Swathi
|

నిమ్మరసం తీసేటప్పుడు విత్తనాలు పడేస్తాం. అలాగే పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలు పక్కన పెడతాం. అలాగే రకరకాల పండ్లలో ఉండే విత్తనాలను తీసేస్తూ ఉండటం కామన్. కానీ.. విత్తనాలు మాత్రమే కాదు.. విత్తనాలతో పాటు.. పోషకాలను కూడా పడేస్తున్నామని ఎప్పుడైనా గ్రహించారా ? అవును.. కొన్ని ఫ్రూట్ సీడ్స్ లో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఖచ్చితంగా తినాల్సిన పండ్ల తొక్కలు.. వాటి హెల్త్ సీక్రెట్స్..!!

కొన్ని రకాల పండ్లలో ఉండే విత్తనాలు తీసుకోవడం చాలా హెల్తీ అని.. నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫ్రూట్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి, మెదడుకి మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా.. ఈ పండ్లలోని విత్తనాలను బ్లెండ్ చేసి తీసుకోవచ్చట. మరి ఏ పండు విత్తనాలు.. ఎలాంటి బెన్ఫిట్స్ ఇస్తాయో తెలుసుకుందామా..

పుచ్చకాయ విత్తనాలు

పుచ్చకాయ విత్తనాలు

పుచ్చకాయనేమో హ్యాపీగా ఆరగించేస్తాం. ఈ ఫ్రూట్ తినేటప్పుడు అడ్డువచ్చే విత్తనాలను మాత్రం పక్కకుపడేస్తాం. కానీ.. ఈ విత్తనాలు తినడం వల్ల గోళ్లు, జుట్టు, చర్మం షైనీగా మారుతాయట. ఎందుకంటే.. ఈ పుచ్చకాయ విత్తనాల్లో జింక్, ఫైబర్, ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి.. ఇకపై ఈ సీడ్స్ పడేయరు కదూ..

నిమ్మకాయ విత్తనాలు

నిమ్మకాయ విత్తనాలు

జ్యూస్, సలాడ్స్ లో నిమ్మరసం వేసేటప్పుడు వాటి విత్తనాలను కలిపి.. బ్లెండ్ చేస్తే.. అద్భుతమైన హెల్త్ బెన్ఫిట్ పొందవచ్చు. ఇందులో ఎక్కువ మోతాదులో సలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎలాంటి నొప్పులనైనా తగ్గిస్తుంది.

బొప్పాయి విత్తనాలు

బొప్పాయి విత్తనాలు

సాధారణంగా బొప్పాయి పండులోని విత్తనాలను అందరూ పడేస్తుంటారు. కానీ.. వాటిని తినడం వల్ల మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు పొందవచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటియోలిక్ ఎంజైమ్స్ ఉండటం వల్ల శరీరంలో ఉండే నులి పురుగులను బయటకు పంపేస్తాయి.

కివీ సీడ్స్

కివీ సీడ్స్

చిన్నగా, నల్లగా ఉండే కివి సీడ్స్ లో విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు పొందడం వల్ల.. కాన్స్టిపేషన్ అరికడుతుంది. హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గిస్తుంది.

అవకాడో సీడ్

అవకాడో సీడ్

అవకాడో సీడ్స్ లో సొల్యుబుల్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి ద్వారా పొటాషియం పొందవచ్చు. అవకాడో సీడ్స్ లో ఉండే ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్.. హై బ్లడ్ ప్రెజర్, హై కొలెస్ట్రాల్ తగ్గించి.. ఇమ్యునిటీ పెంచుతాయి.

గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాలను కొన్ని వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తాయి. డిప్రెషన్ తగ్గించడానికి కూడా గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి. వీటిని వేయించి సాల్ట్ అండ్ పెప్పర్ కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటాయి.

కర్భూజా విత్తనాలు

కర్భూజా విత్తనాలు

కర్భూజా పండు కట్ చేసినప్పుడు ఆ విత్తనాలు తీసి చాలామంది ఎండబెట్టి తింటారు. ఇది మంచి అలవాటు. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇక కార్డియోవాస్కులర్ డిసీజ్ లు, పంటి సమస్యల నుంచి పోరాడతాయి.

యాపిల్ సీడ్స్

యాపిల్ సీడ్స్

యాపిల్ సీడ్స్ లో క్యాన్సర్ సెల్స్ నాశనం చేసే సత్తా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో బి17 విటమిన్ లభిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చట.

English summary

Top Fruit Seeds with numerous health benefits

Top fruit seeds with numerous health benefits. Have you ever considered eating the seeds of lemon or watermelon? It is not uncommon to throw away the seeds, but you are also throwing away some valuable nutrients along with the seeds.
Story first published:Thursday, April 28, 2016, 15:09 [IST]
Desktop Bottom Promotion