For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్లంగిలో దాగున్న మిరాకిల్ బెన్ఫిట్స్

By Swathi
|

ముల్లంగి.. ఈ వెజిటబుల్ అంటే చాలా మందికి నచ్చదు. కొంచెం చేదుగా, ఘాటుగా ఉంటే వీటి రుచిని ఎక్కువగా పిల్లలు ఏమాత్రం ఇష్టపడరు. అలాగే కొంతమంది పెద్దవాళ్లు కూడా వీటిని తినడానికి ఆసక్తి చూపరు. కానీ ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘంగా ఉంటాయి. కాబట్టి.. రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు ఖచ్చితంగా ముల్లంగి తినాలని స్టడీస్ చెబుతున్నాయి.

ముల్లంగి తెలుపు, ఎరుపు, పర్పల్ కలర్స్ లో లభిస్తాయి. మన ప్రాంతంలో మనకు లభించేది తెలుపు ముల్లంగి మాత్రమే. వీటిని పచ్చిగానూ తినవచ్చు, వండుకుని తినవచ్చు. అలాగే వీటితోపాటు.. వీటి ఆకులు కూడా తీసుకోవచ్చు. ముల్లంగిలో ఫైబర్, పొటాషియం, రైబోఫ్లేవిన్, కాపర్, విటమిన్ బి6, మాంగనీస్, కాల్షియం ఉంటుంది.

ఎన్నో పోషకవిలువలు ఉన్న కూరగాయల్లో ముల్లంగి ఒకటి. అయితే వీటిని కూరలుగా, సాంబార్ లో, సలాడ్స్ ఉపయోగించి తీసుకోవచ్చు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. అనేక రకాల అనారోగ్యాలను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తాన్ని శుద్ధిచేసే సత్తా వీటిలో ఉంది. వీటితో పాటు ముల్లంగిలో దాగున్న మెండైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

కామెర్లు

కామెర్లు

పొట్ట, లివర్ కి సంబంధించిన అనారోగ్య సమస్యలు నివారించడంలో ముల్లంగి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. కామెర్లతో బాధపడేవాళ్లకు ముల్లంగి చక్కటి పరిష్కారం. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. కామెర్లు నివారించవచ్చు. అలాగే శరీరంలోని మలినాలను ఇది తొలగిస్తుంది.

పైల్స్

పైల్స్

కాన్స్టిపేషన్, డైజెషన్, పైల్స్ వంటి సమస్యలను ముల్లంగి నివారిస్తుంది. ముల్లంగి తీసుకోవడం వల్ల చాలా త్వరగా, సహజంగా మొలల సమస్యను తగ్గిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది.

యూరినరీ డిజార్డర్స్

యూరినరీ డిజార్డర్స్

ముల్లంగి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే రసాలు.. యూరిన్ ప్రొడక్షన్ ని పెంచుతాయి. ముల్లంగి రసం తీసుకోవడం వల్ల ఇన్ల్ఫమేషన్, యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలను కూడా శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా.. ఆకలిని తగ్గించడానికి ముల్లంగి సహకరిస్తుంది. ఇందులో తక్కువ కార్బో హైడ్రేట్స్ ఉంటాయి. మెటబాలిక్ రేట్ పెంచి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

హార్ట్ డిసీజ్

హార్ట్ డిసీజ్

కార్డియోవాస్క్యులర్ డిసీజ్ లు నివారించడానికి ముల్లంగి గ్రేట్ గా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ముల్లంగా ఎక్కువగా ఉంటాయి.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. బోవెల్ మూమెంట్స్, కాన్స్టిపేషన్ సమస్యలను ఇది తగ్గిస్తుంది. లివర్, గాల్ బ్లాడర్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.

శ్వాస సంబంధ సమస్యలు

శ్వాస సంబంధ సమస్యలు

ముల్లంగిలలో శ్వాస సంబంధిత సమస్యలు నివారించే సత్తా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, ముక్కు సంబంధిత సమస్యలు, అలర్జీలు నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిండానికి సహాయపడుతుంది. బ్లడ్ వెజెల్స్ రిలాక్స్ చేసి.. శరీరానికి బ్లడ్ ఫ్లో పెరగడానికి సహకరిస్తుంది.

English summary

Unknown Health Benefits Of Radish

Unknown Health Benefits Of Radish. Radish is the most commonly used vegetable in any food preparation. It exists in three colours that is white, red and purple. It has a pungent taste to it.
Desktop Bottom Promotion