For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోంపు టీ తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు..!!

సోంపు టీ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్

By Swathi
|

సోంపు.. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. దీన్ని సాధారణంగా.. మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. లేదా భోజనం తర్వాత ఆహారం తేలికగా జీర్ణం అవడం కోసం తీసుకుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో దీన్ని ఎక్కువగా ఇస్తుంటారు.

అయితే సోంపులో అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్ గా తినడం ఇష్టంలేని వాళ్లు.. టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. సోంపు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యం శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయమవుతుంది.

ఒక టీస్పూన్ సోంపు గింజలు తీసుకుని.. ఒక కప్పు మరుగుతున్న నీటిలో కలపాలి. 10 నిమిసాల తర్వాత.. అందులోని పోషకాలను నీళ్లు గ్రహిస్తాయి. ఈ టీని ప్రతిరోజూ భోజనం తర్వాత అంటే.. రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. మరి ఈ సోంపు టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో చూద్దామా..

గ్యాస్ట్రిక్ ట్రబుల్

గ్యాస్ట్రిక్ ట్రబుల్

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లకు సోంపు టీ అద్భుత పరిష్కారం. ఇది బ్లోటింగ్, అజీర్ణం వంటి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తుంది.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

సోంపు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది.

దుర్వాసన

దుర్వాసన

సోంపు టీ దుర్వాసన సమస్యను నివారిస్తుంది. జీర్ణ సమస్యల వల్ల దుర్వాసన వస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల నోట్లో.. మంచి సువాసన ఉంటుంది. ఈ టీ మౌత్ వాష్ లా పనిచేస్తుంది.

ఏకాగ్రత

ఏకాగ్రత

సోంపు టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. ఏకాగ్రత సమస్యలను నివారిస్తుంది. ఇందులో పొటాషియం ఉండటం వల్ల ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

టాక్సిన్స్

టాక్సిన్స్

సోంపు టీ తాగడం వల్ల శరీరంలో పేరుకున్న మలినాలు తొలగిపోతాయి. యురినరీ ట్రాక్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.

మెనోపాజ్

మెనోపాజ్

సొంపు టీ మెనోపాజ్ లక్షణాలతో పోరాడే శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

బ్లడ్

బ్లడ్

సోంపు టీ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ ప్యూరిఫై అవడమే కాకుండా.. కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. మెటబాలిజంను కూడా పెంచుతుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

సోంపు టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి.. రెగ్యులర్ గా సోంపు టీ తాగడం అలవాటు చేసుకోండి.

English summary

What Happens If You Drink Fennel Tea

What Happens If You Drink Fennel Tea. Here is a list of surprising reasons on why you could be feeling tired all the time, have a look.
Desktop Bottom Promotion