For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

By Swathi
|

సొరకాయ భారతీయులు ఎక్కువగా ఉపయోగించే వెజిటబుల్. స్మూత్ గా ఉండే.. లైట్ గ్రీన్ కలర్ లో ఉంటే.. ఈ సొరకాయ రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సొరకాయను ఉపయోగిస్తారు.

ఇండియన్స్ గ్రేవీ రూపంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. ఏ వెజిటబుల్ అయినా.. జ్యూస్ రూపంలో తీసుకుంటే.. అందులోని అన్ని పోషకాలను, ఉపయోగాలను గ్రహించవచ్చు. అలాగే సొరకాయ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందడమే కాకుండా.. ఏడు రకాల వ్యాధులను నయం చేయవచ్చట.

ముందుగా సొరకాయ తొక్క తీసి.. ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ లో వేయాలి. బాగా జ్యూస్ తయారయిన తర్వాత వడకట్టకుండా తాగాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే.. అనేక హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

జీర్ణక్రియ మెరుగుపడటానికి

జీర్ణక్రియ మెరుగుపడటానికి

ఈ న్యాచురల్ జ్యూస్ లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి.. జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఈ హోంమేడ్ జ్యూస్ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెటబాలిజం, ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్

యూరిన్ ఇన్ఫెక్షన్

ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ సొరకాయ, తేనెతో తయారు చేయడం వల్ల.. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కి ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే యూరిన్ లో యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.

హైపర్ టెన్షన్

హైపర్ టెన్షన్

హైపర్ టెన్షన్ నివారించడంలో ఈ హోంమేడ్ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సొరకాయ, తేనె కలిపి తీసుకోవడం వల్ల.. ధమనులకు రక్తప్రసరణ ఆరోగ్యకరంగా జరుగుతుంది.

దీనివల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది.

హెల్తీ ప్రెగ్నన్సీ

హెల్తీ ప్రెగ్నన్సీ

సొరకాయ, తేనెలో విటమిన్స్, క్యాల్షియం, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. ఈ హెల్త్ డ్రింక్ గర్భిణీ స్త్రీలకు అత్యంత ఆరోగ్యకరం.

ఆందోళన తగ్గించడానికి

ఆందోళన తగ్గించడానికి

ఈ న్యాచురల్ హెల్త్ జ్యూస్ లో ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేసి.. ప్రశాంతతను కలిగిస్తుంది.

కాలేయం ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి

కాలేయం ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి

ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్ కాలేయాన్ని లివర్ ని క్లెన్స్ చేయడానికి సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. లివర్ ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary

What Happens When You Drink Bottle Gourd (Lauki) Juice With Honey?

What Happens When You Drink Bottle Gourd (Lauki) Juice With Honey? Did you know that the health drink made from bottle gourd (lauki) and honey come with numerous health benefits that can treat up to 7 ailments?
Story first published:Friday, September 2, 2016, 11:16 [IST]
Desktop Bottom Promotion