For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ముందు స్పినాచ్ జింజర్ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

ఆకుకూరలను జ్యూస్ చేసి తాగితే కూడా అద్భుత ప్రయోజనాలను పొందుతారు.అయితే మంచి ఫ్లేవరు, రుచికోసం కొద్దిగా అల్లం, నిమ్మరసం, ఉప్పు చేర్చి తాగితే మరిన్న బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్

|

పచ్చని ఆకు కూరలను రెగ్యులర్ డైట్ నుండి అవాయిడ్ చేయకూడదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం. ప్రస్తుత కాలంలో వివిధ ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోటకూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి.

సీజన్ బట్టి ఆయా సీజన్ లో దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. ఉదా పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి మొదలైనవి. ఆకుకూరలు మంచి పౌష్టికకరమైన ఆహారం. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ 'ఎ', 'సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు అధికంగా ఉంటుంది.

మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి.

ఇవి తొందరగా నలిగే గుణం ఉండ టం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలు, జ్యూసులుగా తీసుకోవచ్చు. ముఖ్యంగాఆకు కూర లు వండే సమ యంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే... వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంతే కాదు, ఆకుకూరలను జ్యూస్ చేసి తాగితే కూడా అద్భుత ప్రయోజనాలను పొందుతారు.అయితే మంచి ఫ్లేవరు, రుచికోసం కొద్దిగా అల్లం, నిమ్మరసం, ఉప్పు చేర్చి తాగితే మరిన్న బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం మరింత మంచిది. స్పినాచ్, జింజర్ మిక్స్ జ్యూస్ తాగితే పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఈ నేచురల్ స్పినాచ్ జింజర్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మెటబాలిక్ రేటును పెంచుతుంది. దాంతో శరీరంలో కొన్ని పౌండ్స్ ను కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.

కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఆకుకూరల్లో విటమిన్ ఎ, లూటిన్ , జియాక్సిథిన్ అనే కాంపౌండ్స్ కళ్ళకు సంబంధించిన నారాలను స్ట్రాంగ్ గా మార్చి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 బోన్ హెల్త్ :

బోన్ హెల్త్ :

ఈ హోం మేడ్ హెల్త్ డ్రింక్ లో బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చే క్యాల్షియం, అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లోకి చేరి, బోన్స్ ను స్ట్రాంగ్ గా, హెల్తీగా మార్చుతుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

స్పినాచ్ మరియు జింజర్ డ్రింక్ లో రక్తనాళాలను శుభ్రం చేసే గుణాలు, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి హైపర్ టెన్షన్ మరియు హైబిపి తగ్గించడంలో గ్రేట్ గా సహాపడుతుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ పొట్టలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి జీర్ణవ్యవస్థను హెల్తీగా మార్చుతుంది, ఎసిడిటిని ని తగ్గిస్తుంది.

బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

స్పినాచ్ జింజర్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , ఇతర న్యూట్రీషియన్స్ ఇతర లక్షణాలు, బ్రెయిన్ సెల్స్ ను , బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది.

 హార్ట్ అటాక్ ను నివారిస్తుంది:

హార్ట్ అటాక్ ను నివారిస్తుంది:

ఆకుకూరలు, అల్లం రెండు కాంబినేషన్ బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో కార్డియాక్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

What Happens When You Drink Spinach Juice With Ginger?

Just add some spinach juice and grated ginger in a blender, grind well to obtain a juice. Consume this natural health drink, every morning, before breakfast. Now, have a look at some of the health benefits of this mixture of spinach juice and ginger, here.
Story first published: Thursday, December 1, 2016, 17:47 [IST]
Desktop Bottom Promotion