For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాధులు నివారణకు మీ బ్లడ్ గ్రూపును బట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

|

మ‌నిషి బ్ల‌డ్ గ్రూపు ను బ‌ట్టి వ్య‌క్తి స్వ‌భావం, ఆహార‌పు అల‌వాట్లు, ఆరోగ్య‌స్థితి రాబోయే కాలంలో వ‌చ్చే అస్వ‌స్థ‌లు తెలుసుకోవ‌చ్చు. అయితే ర‌క్తానికి స‌రిప‌డే ఆహారం త‌గినంత‌గా తీసుకుంటే ఎలాంటి హాని మ‌న దరిచేరదు. మనలో చాలామందికి మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలనేదానికి చిన్న సూచన కూడా వుండదు. కనుక మనకు అసలు ఏ రకమైన ఆహారం సరిపడుతుంది? అంటే మనకు ఏ గ్రూపు బ్లడ్ సరిపోతుంది వంటి రీతిలో ఆహారం కూడా తీసుకుంటే మన శరీరానికి తగిన ఆహారం అందించనవారం అవుతాము.

మనకవసరమైన పోషక అవసరాలను ప్రభావించేది అసలు మన శరీరం తీరా? బ్లడ్ గ్రూప్ ఆహారం అవుననే చెపుతోంది. ఈ రకమైన బ్లడ్ గ్రూపు కు సరిపడే ఆహారాన్ని మొదటగా ప్రకృతి వైద్యులు డా. పీటర్ డి ఆడామో కనిపెట్టారు. ఇక అప్పటినుండి ఈ ఆహారాన్ని సెలిబ్రిటీలు సైతం అంటే బ్రిటీష్ నటుడు కటే విన్ స్లెట్ వంటివారు అనుసరిస్తున్నారు. మీ బ్లడ్ గ్రూపు ననుసరించి మీ ఆహారంలో ఏ రకమైన పదార్ధాలు చేర్చాలనేది సిఫార్సు చేయబడ్డాయి.

మీ క్యారెక్టర్ కి, మీ బ్లడ్ టైప్ కి సంబంధమేంటి ?

ఆరోగ్య పరంగా చూసినట్లైతే, బ్లడ్ గ్రూప్స్ మీద జరిపిన కొన్ని పరిశోధనల ద్వారా కొన్ని బ్లడ్ గ్రూప్స్ లో హెల్త్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు, బ్లడ్ గ్రూప్ ఓ ఉన్నవారిలో స్టొమక్ అల్సర్స్ ఎక్కువ ఉన్నట్లు కనుగొన్నారు. కానీ ఇక్కడ వీరి విషయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి హార్ట్ కు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి.

అదే విధంగా బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నవారు బ్యాక్టీరియా, వైరస్, లేదా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా గురి అవుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎ బ్లడ్ గ్రూప్ కలిగి వారిలో వంధ్యత్వంతో బాధపడుతుంటారు.

థిన్ బ్లడ్ కోసం తీసుకోవాల్సి ఆహారం

అలాగే ఏబి మరియు బి బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. అందువల్ల బ్లడ్ గ్రూపుల మీద జరిపిన పరిశోధన ప్రకారం సరైన జాగ్రత్తలు మరియు బ్లడ్ గ్రూప్ కు సరిపోయే ఆహారాలను తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులను ధరిచేరనివ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఎ బ్లడ్ గ్రూప్ వారి ఆహారం ఎలా వుండాలి?:

ఎ బ్లడ్ గ్రూప్ వారి ఆహారం ఎలా వుండాలి?:

వీరిలో చాలా సెన్సిటివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి చాలా వరకూ ఇమ్యూనిటి పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. ఈ బ్లడ్ గ్రూప్ వారు ముందుగా వారి ఒత్తిడి తగ్గించుకోవాలి. లేకుంటే ఏ రకమైన ఆహారం పనిచేయదు. వీరు తినేది ఏ ఆహారమైనప్పటికి వారి జీవక్రియలో ఒత్తిడి అధిక స్ధాయిలో వుంటుంది. కనుక మీరు మటన్ లేదా బీఫ్ వంటి కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే ఆహారం తినకండి. చేపలు, ప్రత్యేకించి సీ ఫిష్ వీరికి చాలా మంచిది. ధాన్యాలనుండి అంటే కిడ్నీ బీన్స్, క్యారెట్, పీచెస్, పీయర్స్, గార్లిక్ , బ్రొకోలి, మరియు అవొకాడో వంటివాటినుండి మీరు ప్రొటీన్లు పొందుతారు.

‘ ఏ బ్లడ్ గ్రూప్ వారు’డైరీ ప్రొడక్ట్స్ మరియు గుడ్డు నివారించాలి:

‘ ఏ బ్లడ్ గ్రూప్ వారు’డైరీ ప్రొడక్ట్స్ మరియు గుడ్డు నివారించాలి:

ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు అన్ని రకాల డైరీ ప్రొడక్ట్స్, వైట్ రైస్, మరియు గుడ్డు తినడం నివారించాలి . వాటికి ప్రత్యామ్నాయంగా పెరుగు, గోట్ చీజ్, కెఫిర్ లేదా సోయా మిల్క్ తీసుకోవచ్చు.

 ‘బి బ్లడ్ గ్రూప్’వారి ఆహారం

‘బి బ్లడ్ గ్రూప్’వారి ఆహారం

వీరి రక్తం అందరికి సరిపోదు, వీరికి అందరిది సరిపోదు. అయితే, వీరి ఆహారం అందరికి సరిపడేదే. ఈ గ్రూపు రక్తం కలవారు ఏ ఆహారమైనా తినవచ్చు. ఏ ఆహారమైనా సరే ఒకే రకంగా వీరికి జీర్ణమైపోతుంది. వీరికి ఇతర రెండు బ్లడ్ గ్రూప్ లవలే కాకుండా పాలకు కూడా ఏ రకమైన సమస్య వుండదు. కనుక మీరు వెజిటేరియన్ అయితే, పైనాపిల్, అరటిపండ్లు, గ్రేప్స్, మరియు గ్రీన్ లీఫ్స్. ఎక్కువగా మంటన్ మరియు చేపలు, టర్కీ చికెన్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు అవసరమైన ప్రొటీన్ల కొరకు తినాలి.

డైరీప్రొడక్ట్స్ మరియు గుడ్లు ‘బి బ్లడ్ గ్రూప్’ వారికి సురక్షితమే:

డైరీప్రొడక్ట్స్ మరియు గుడ్లు ‘బి బ్లడ్ గ్రూప్’ వారికి సురక్షితమే:

బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి డైరీ ప్రొడక్ట్స్, మరియు గుడ్లు సురక్షితమైన ఆహారమే . వీటి ద్వారా ఎలాంటి ఫ్యాట్ గ్రహించకుండా వీరు ఆరోగ్యకరంగా జీర్ణించుకోగలరు.

ఎబి బ్లడ్ గ్రూప్’ వారి ఆహారం -

ఎబి బ్లడ్ గ్రూప్’ వారి ఆహారం -

ఈ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ గా ఉంటుంది . ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు 5శాతం కంటే తక్కువే. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఏ, మరియు బి రెండు బ్లడ్ గ్రూపుల క్యారెక్టర్స్ కలిగి ఉంటారు. వీరు తీసుకొనే మాంసాహారాలు, తక్కవ స్టొమక్ యాసిడ్స్ వల్ల శరీరంలో కొవ్వు రూపంలో నిల్వచేరుతుంది. అందువల్ల ఎబి బ్లడ్ గ్రూప్ వారు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు కూడా వీరికి ఆరోగ్యం కరం మరియు త్వరగా జీర్ణించుకోగలుగుతారు. గింజలు, పీచు పదార్ధాలు బాగా తినాలి. గుడ్డు ఉత్పాదనలు, అన్ని రకాల కూరగాయలు మీ ఆహారంలో చేర్చండి.

ఎబి బ్లడ్ గ్రూప్ వారు రెడ్ మీట్ తగ్గించి, డైరీ ప్రొడక్ట్స్ అధికంగా తీసుకోవాలి:

ఎబి బ్లడ్ గ్రూప్ వారు రెడ్ మీట్ తగ్గించి, డైరీ ప్రొడక్ట్స్ అధికంగా తీసుకోవాలి:

రెడ్ మీట్, డైరీ ప్రోడక్ట్స్ వంటివి (పెరుగు, ఛీజ్ ) మీ ఆహారంలో చేర్చకండి. కార్బో హైడ్రేట్లు మితంగా వుండాలి. ఇవి శరీరంలో చాలా తర్వాత కొవ్వును చేర్చుతాయి. అయితే డైరీప్రొడక్ట్స్ ను ఒకరకంగా హ్యాండిల్ చేయగలవు.

ఓ బ్లడ్ గ్రూప్ వారి ఆహారం

ఓ బ్లడ్ గ్రూప్ వారి ఆహారం

వీరు మాంసాహారులుగా వుండాలి. మాంసం ప్రధానంగా తినేవారుగా వుండాలి. వీరికి ప్రొటీన్స్ రెడ్ మీట్ నుండి లభిస్తాయి. ఈ మంసం కూడా మేక లేదా ఆవు వంటి వాటిది అయ్యుండాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాగా లభిస్తాయి. పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, గుడ్డు వంటివి కూడా తినాలి. రెడ్ మీట్ తప్పనిసరి. పచ్చగా వుండే కూరలు వీరికి మంచివి. షుగర్, స్వీట్లు తక్కువ తినాలి. ఎందుకంటే వీరిలో కొవ్వు మెటబాలిజం చాలా తక్కువగా వుంటుంది.

English summary

Which Food You Eat Based On Your Blood Group To Prevent Diseases

We all have a certain type of a blood group and it has been seen there is a link between our health condition and the blood group that we have. It has also been shown that we may have a peculiar nature based on the type of our blood group.
Story first published: Tuesday, January 12, 2016, 18:13 [IST]
Desktop Bottom Promotion