For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో ఖర్జూరాలను తినడానికి గల ఖచ్చితమైన కారణాలు ..!!

డేట్స్ వింటర్ సీజన్లో ఖచ్ఛితంగా తినాలి అనడానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం...

|

సహజంగా ఏదైనా స్వీట్ తినాలంటే ఆరోగ్యానికి మంచిది కాదని ఆలోచించే వారిక సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారు అనుకుంటా..? కొంత మంది పండ్లు కూడా స్వీట్ గా ఉంటాయని తినడం మానేస్తుంటారు. అయితే పండ్లు నేచురల్ షుగర్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి, వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. నేచురల్ షుగర్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక రకంగా స్వీట్స్ తినాలన్న కోరికను కూడా తగ్గిస్తాయి. అలాంటి పండ్లలో డేట్స్ ఒకటి. అయితే డేట్స్ డ్రైట్స్ ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

8 Reasons Why You Should Eat Dates During Winter

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే ఎండు ఖర్జురాల్లో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి కూడా వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వీటిని రెగ్యులర్ గా తిడనడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. డ్రై డేట్స్ లో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, ఐరన్, పొటాసియం, నేచురల్ గ్లూకోజ్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి, వీటిని వింటర్ సీజన్ లో తినడం వల్ల బాడీని వెచ్చగా మార్చుతాయి.

డేట్స్ ను ముస్లీమ్స్ ఎక్కువగా రంజాన్ సీజన్ లో వినియోస్తుంటారు. రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ను బ్రేక్ చేయడంలో డేట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి . ఉపవాసం ఉండే వారికి మాత్రమే కాదు, ఇతరులు తిన్నా, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తాయి. అంతే కాదు, బరువు తగ్గించుకోవాలనుకొనే వారికి కూడా డేట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. మరి డేట్స్ వింటర్ సీజన్లో ఖచ్ఛితంగా తినాలి అనడానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం...

వింటర్ చలి నుండి శరీరానికి కాపాడుటకు వెచ్చదనం కలిగిస్తుంది:

వింటర్ చలి నుండి శరీరానికి కాపాడుటకు వెచ్చదనం కలిగిస్తుంది:

డేట్స్ లో ఫైబర్, క్యాల్షియం, విటమిన్స్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంను వెచ్చగా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అందుకే వింటర్లో డేట్స్ ను ఎక్కువగా తినమని సూచిస్తుంటారు.

 జలుబును నివారిస్తుంది:

జలుబును నివారిస్తుంది:

జలుబుతో బాధపడుతున్నట్లైతే, రెండు మూడు డేట్స్ తీసుకుని, అందులో రెండు మూడు మిరియాలు, 1 లేదా 2 యాలకలు నీటిలో వేసి మరిగించి, గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే జలుబు ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

ఆస్త్మా నివారిస్తుంది:

ఆస్త్మా నివారిస్తుంది:

వింటర్లో వేధించే సమస్యల్లో ఆస్త్మా ఒకటి. ఆస్త్మా నివారించడంలో డేట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఒకటి, రెండు డేట్స్ ఉదయం మరియు సాయంత్రాల్లో తినడం వల్ల క్రమంగా ఆస్త్మా తగ్గుతుంది.

ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది:

ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది:

డేట్స్ లో నేచురల్ షుగర్స్ ఉన్నాయి. ఇవి ఇన్ స్టాంట్ ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అలసటగా, నిస్సహాయంగా అనిపించినప్పుడు ఒకటి రెండు డేట్స్ తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందవచ్చు.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

డేట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డేట్స్ ను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం డేట్స్ మరియు వాటర్ రెండ్ గ్రైడ్ చేసి కాలీ పొట్టతో తాగాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం నివారించబడుతుంది.

హార్ట్ కు మంచిది:

హార్ట్ కు మంచిది:

డేట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది. హార్ట్ రేటును కంట్రోల్ చేస్తుంది. దాంతో హార్ట్ అటాక్ ప్రమాధంను తగ్గించుకోవచ్చు.

 ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది:

ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది:

డేట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి వింటర్లో వచ్చే ఆర్థ్రైటిస్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. రోజూ 5, 6 డేట్స్ ను తినడం వల్ల ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గించుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

డేట్స్ లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. రోజుకు 5, 6 డేట్స్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను క్రమంగా తగ్గించుకోవచ్చు.

English summary

8 Reasons Why You Should Eat Dates During Winter

Dates have a lot of health benefits, especially when consumed during the winter season.
Desktop Bottom Promotion