For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో మామిడికాయ..మజా చేస్తూ తినడానికి కారణలేంటి..?

పండ్లలో రారాజు ‘‘మామిడి పండ్లు'' ముఖ్యంగా వేసవి సీజన్ లో మామిడిపండ్లకున్నంత క్రేజ్ మరే పండ్లకు ఉండదు. అది మామిడి పండ్లకున్న ప్రత్యేకత..జ్యూసీగా..నోరూరిస్తూ ఉండే మామిడిపండ్లన్నా, పుల్లగా..వగరుగా..కమ్మగ

|

పండ్లలో రారాజు ''మామిడి పండ్లు'' ముఖ్యంగా వేసవి సీజన్ లో మామిడిపండ్లకున్నంత క్రేజ్ మరే పండ్లకు ఉండదు. అది మామిడి పండ్లకున్న ప్రత్యేకత..జ్యూసీగా..నోరూరిస్తూ ఉండే మామిడిపండ్లన్నా, పుల్లగా..వగరుగా..కమ్మగా ఉండే పచ్చిమామిడికాయలన్నా మన ఇండియన్స్ మహా ప్రీతి. అందులోని రుచిన ఘుభాలించే వాసన మాత్రమే కాదు, న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కూడా అధికమే.. పచ్చివి తిన్నా, పండువి తిన్నా వేటి ప్రత్యేకతలు వాటివి. ఆరోగ్య ప్రయోజనాలు అంతే...

సువానతో నోరూరించే మామిడి పండ్లంటే పిల్లల నుండి పెద్దల వరకూ అన్నివయస్సుల వారికి అమితనమైన ఇష్టమే. మరి అయితే వీటిలో హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారా? పచ్చిమామిడి కాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది 35 యాపిల్ , అదే విధంగా 18 అరటిపండ్లు, తొమ్మిడి నిమ్మపండ్లు, మూడు ఆరెంజెస్ పండ్లతో సమానం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ..?

8 Reasons Why You Should Eat Raw Mangoes

విటమిన్స్ మాత్రమే కాదు,ఈ పండ్లు 80 శాతం మెగ్నీషియం, మరియు క్యాల్షియంను కూడా అందిస్తుంది. పచ్చిమామిడి పండ్లలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి, దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందే.

పచ్చి మామిడి పండ్లలో ఉండే హెల్తీ న్యూట్రీషియన్స్, మినిరల్స్ అనేక వ్యాధులను నివారిస్తుంది. పచ్చిమామిడి కాయను ఉప్పుతో కలిపి తినడం వల్ల శరీరంలో నీటిశాతం కోల్పోకుండా నివారిస్తుంది. అందువల్ల వేసవిలో హై టెంపరేచర్ సైడ్ ఎఫెక్ట్స్ ను నివారిస్తుంది.

మామిడి కాయను వంటలకు వండటే టప్పుడు ఉడికించడం వల్ల విటమిన్ సి ని కోల్పోతుంది. కాబట్టి, పచ్చిమామిడికాయను సాధ్యమైనంత వరకూ పచ్చిగా అలాగే తింటే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బరువు పెరగరు:

బరువు పెరగరు:

పచ్చి మామిడికాయలు బరువు తగ్గిస్తాయి. పచ్చిమామిడి కాయల్లో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ుంటుంది. కాబట్టి, పచ్చిమామిడి కాయల నుండి మీరు సాధ్యమైనన్ని ప్రయోజనాలను పొందుతారు.

ఎసిడిటి నివారిస్తుంది:

ఎసిడిటి నివారిస్తుంది:

పచ్చిమామిడి కాయలు తినడం వల్ల ఎసిడిటి సమస్యలను తగ్గిస్తుంది. ఎసిడిటి ఉన్నవారు, మందులు తీసుకోకుండా చిన్న మామిడికాయ ముక్కను తినడం వల్ల ఎసిడిటికి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు.

లివర్ సమస్యలను నివారిస్తుంది:

లివర్ సమస్యలను నివారిస్తుంది:

పచ్చిమామిడికాయలను తినడం వల్ల లివర్ వ్యాధులను నయం చేసుకోవచ్చు. పచ్చిమామిడికాయను తినడం వల్ల , మామిడికాయలో ఉండే యాసిడ్స్ బైల్ యాసిడ్స్(జీర్ణవ్యవస్థకు సహాయపడే జీర్ణ రసాలు లేదా ఆమ్లాల) ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో కాలేయ పనితీరు ఆరోగ్యంగా ఉంటుంది.

డెంటల్ హైజీన్ :

డెంటల్ హైజీన్ :

దంతాలను శుభ్రపరచడంలో పచ్చిమామిడికాయలు గ్రేట్ గా సహాయపడుతాయి . బ్యాడ్ బ్రీత్ ను తొలగించడంతో పాటు, దంత క్షయాన్ని నివారిస్తాయి. కాబట్టి, ఈ సీజన్ లో పచ్చిమామిడికాయను తినడం మర్చిపోకండి. దంతక్షయానికి వ్యతిరేఖంగా పోరాడుతాయి.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

పచ్చిమామిడికాయను తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

బ్లడ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది:

బ్లడ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది:

పచ్చిమామిడికాయలో ఉండే విటమిన్ సి, బ్లడ్ డిజార్డర్స్ ను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఒక గొప్ప ఆరోగ్య ప్రయోజనం. పచ్చిమామిడికాయలో ఉండే విటమిన్ సి కంటెంట్ బ్లడ్ ఎలాసిటిని పెంచుతుంది. కొత్తగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.

సన్ స్ట్రోక్ నివారించే హోం రెమెడీ:

సన్ స్ట్రోక్ నివారించే హోం రెమెడీ:

వేసవిలో సన్ టాన్ లేదా సన్ స్ట్రోక్ చాలా సాధారణం . ఈ సమస్యలను నివారించుకోవడం కోసం మెడిసిన్స్ తీసుకోనవసరం లేదు. పచ్చిమామిడి కాయే అద్భుతం చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా పచ్చి మామిడికాను ముక్కలుగా చేసి నీళ్లలో ఉడికించి పంచదార, జీలకర్ర చేర్చి, చిటికెడు ఉప్పు కూడా వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.

గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ డిజార్డర్స్ ను తగ్గిస్తుంది:

గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ డిజార్డర్స్ ను తగ్గిస్తుంది:

పచ్చి మామిడికాలో ఉండే పెక్టిన్, గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ డిజార్డన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఇది డయోరియా, పైల్స్, అజీర్తి, మలబద్దకం నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

8 Reasons Why You Should Eat Raw Mangoes

Summer is the season of the 'King of fruits' - Mangoes. This is considered as the most delicious and nutrient-rich fruit. There are wide varieties of mangoes available and each one has its own taste, aroma and health benefits.
Story first published: Monday, April 3, 2017, 18:02 [IST]
Desktop Bottom Promotion