For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క వారంలో బాడీలో టాక్సిన్స్ తొలగించే అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ

By Lekhaka
|

మీరు తరచూ బయట ఫుడ్స్ ని తింటూ పొల్యూషన్ లో ట్రావెల్ చేసేవారైతే మీ ప్రేగులలో ఇప్పటికే టాక్సిన్లు ఎక్కువ మొత్తంలో పేరుకుపోయి ఉండుంటాయి.

మీ ప్రేగులలో టాక్సిన్లు చేరుకున్నట్టయితే, మీరు అనేక రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదాలెక్కువ.

మనం తీసుకునే ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు అలాగే పీల్చే గాలి కూడా ఎక్కువ మొత్తంలో కల్ముషానికి గురయినవే. వీటిలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు మన జీర్ణకోశములో చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి.

శరీరంలో వ్యర్థాలను తొలగించే హోం రెమెడీ

పెద్ద ప్రేగును శుద్ధి చేయడానికి ఆయుర్వేదిక్ రెమెడీ

మనం తీసుకునే ప్రతి ఆహరం జీర్ణకోశానికే చేరుతుంది. అందుకే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే టాక్సిన్లకు నిలయంగా మన జీర్ణకోశం మారుతుంది.

జీర్ణకోశం అనేది ఎంతో శుభ్రంగా ఉండాలి. అందుకోసం, తరచూ మీరు సహజమైన రీతిలో టాక్సిన్స్ ని శరీరం నుండి తొలగించాలి.

హోమ్ రెమెడీస్ ని పాటించడం ద్వారా మీ జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మీ ఇంటస్టైన్ నుంచి టాక్సిన్స్ ను సమూలంగా నిర్ములించడానికి ఈ ఆయుర్వేదిక్ రెమెడీ అద్భుతంగా సహకరిస్తుంది. ఈ రెమెడీ ని పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండేందుకు చక్కటి ప్రయత్నం చేసినవారవుతారు.

శరీరంలో వ్యర్థాలను తొలగించే హోం రెమెడీ

ఆయుర్వేదిక్ కొలోన్ క్లిన్స్ రెమెడీ

ఈ రెమెడీ ని తయారు చేసే విధానం

అవసరమైన పదార్థాలు:

ఆపిల్ జ్యూస్ - 1/4 కప్

లైమ్ జ్యూస్ - 1/4 కప్

ఉప్పు - 1/2 టీస్పూన్

ఈ హోమ్ రెమెడీ మీ ప్రేగులను శుభ్రపరచి వ్యర్థ పదార్థాలను అలాగే విష పదార్థాలను తొలగించడంలో తోడ్పడుతుంది. అయితే, సరైన మోతాదులలో క్రమబద్ధంగా ఈ రెమెడీని పాటించాలి.

ఈ రెమెడీని పాటించడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటూ, శుభ్రమైన మంచినీటినే తీసుకోవాలి. ఆ విధంగా చేస్తే ఇంటస్టైన్ నుంచి టాక్సిన్స్ అనేవి తొలగిపోతాయి.

ఆపిల్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బవుల్ మూవ్మెంట్స్ ని మెరుగుపరచి మీ శరీరంలో పేరుకుపోయున్న వ్యర్థ పదార్థాలని బయటకు పంపిస్తాయి.

మరోవైపు, ఉప్పు, నిమ్మరసంల మిశ్రమం అసిడిక్ నేచర్ కలిగి ఉండటం వల్ల టాక్సిన్స్ ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

శరీరంలో వ్యర్థాలను తొలగించే హోం రెమెడీ

తయారు చేసే విధానం:

పైన చెప్పబడిన మోతాదులో పదార్థాలని ఒక కప్ లోకి తీసుకోండి. బాగా కలిపి ఒక మిశ్రమంగా తయారుచేయండి. ఈ మిశ్రమం ఇప్పుడు తాగడానికి సిద్ధంగా ఉంది. ప్రతి రోజు ఉదయాన్నే అలాగే రాత్రి డిన్నర్ తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ రెమెడీని కనీసం రెండు నెలల వరకు పాటించాలి.

English summary

Ayurvedic Remedy To Remove Toxins From Your Intestines In A Week!

Everything we ingest ultimately reach our intestines so, the stomach can be a storehouse of toxins, especially if you are not eating healthy!It is very important to have clean intestines and your body must flush out the toxins naturally.
Desktop Bottom Promotion