For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ వాటర్ తాగడం వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు !

క్యాబేజ్ ని కూరగాయ లేదా సలాడ్ లా తీసుకోవడం అనేది చాలా సాధారణం, కానీ క్యాబేజ్ నీరు చాలా అరుదుగా జరిగేది, ఇది చాలామందికి తెలీని విషయం.క్యాబేజ్ నీళ్ళలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని వినికిడి

By Gandiva Prasad Naraparaju
|

క్యాబేజ్ ని కూరగాయ లేదా సలాడ్ లా తీసుకోవడం అనేది చాలా సాధారణం, కానీ క్యాబేజ్ నీరు చాలా అరుదుగా జరిగేది, ఇది చాలామందికి తెలీని విషయం.

క్యాబేజ్ నీళ్ళలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని వినికిడి. కాబట్టి, వీటి ప్రయోజనాల గురించి మీరు నేర్చుకునే క్షణం, మీరు ఖచ్చితంగా దీనిని రోజూ తాగేలా చేస్తుంది.

అంతేకాకుండా, క్యాబేజ్ కూర లేదా సలాడ్ రుచిని కొంతమంది ఇష్టపడరు, కాబట్టి, క్యాబేజ్ మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది కాబట్టి క్యాబేజ్ నీరు తాగడం మంచిది.

క్యాబేజ్ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను విస్తృతంగా కలిగి ఉంది. పాలీఫెనాల్ మంచి పేరుగాంచిన యాంటీ-ఆక్సిడెంట్ల లో ఒకటి. ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి శరీర కణాలను రక్షించడానికి సహాయపడే ప్రధాన యాంటీ-ఆక్సిడెంట్ల లో ఒకటిగా పరిగణించబడుతుంది.

అన్నిటిలా కాకుండా, క్యాబేజ్ లో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K వంటి ఇతర అద్భుతమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.

cabbage water benefits

దీనితోపాటు, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఇతర మినరల్స్ ఉండడం వల్ల క్యాబేజ్ నీరు అనేక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి సహాయపడుతుంది.

కాబట్టి, ఈరోజు, క్యాబేజ్ నీరు తాగడం వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన కొన్ని జాబితాలు ఇవ్వబడ్డాయి. ఒకసారి దృష్టి పెట్టండి....

1.రోగనిరోధకశక్తి పెరుగుతుంది:

1.రోగనిరోధకశక్తి పెరుగుతుంది:

క్యాబేజ్ లో ఉండే అద్భుతమైన పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకు ఒక గ్లాసు క్యాబేజ్ నీరు తాగితే ప్రమాదకర రోగానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ ని అయినా అడ్డుకుంటుంది.

2.చూపు మెరుగుపడుతుంది:

2.చూపు మెరుగుపడుతుంది:

క్యాబేజ్ లో ఉండే బీటా-కెరోటిన్ మీ చూపు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ క్యాబేజ్ నీరు తాగడం వల్ల ఇది కంటిచూపు మండగించకుండా అడ్డుపడి, మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

3.చర్మానికి మంచిది:

3.చర్మానికి మంచిది:

ప్రతిరోజూ క్యాబేజ్ నీరు తాగితే చర్మానికి చాలా మంచిదని పరిగణించబడింది. ఇందులో ఉండే అద్భుతమైన ఫైటో కెమికల్స్, యాంటీ-ఆక్సిడెంట్ల వల్ల, యాక్నే, ఎక్కువగా పొడిబారడం వంటి చర్మ సమస్యలను అభివృద్ధికి కారణమయ్యే ప్రమాదకర ఫ్రీ రాడికల్స్ పై పోరాడడానికి క్యాబేజ్ నీరు సహాయపడుతుంది.

4.ఎముకలకు మంచిది:

4.ఎముకలకు మంచిది:

క్యాబేజ్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఒకచోట ఉండడం వల్ల క్షీణత, బలహీనతల నుండి ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు క్యాబేజ్ నీరు తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

5.ఆల్కహాల్ డిటాక్సిఫికేషన్:

5.ఆల్కహాల్ డిటాక్సిఫికేషన్:

మీరు ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకుంటే, మరునాటి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు క్యాబేజ్ నీటిని తాగడం మర్చిపోకండి. అధిక యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాల వల్ల, క్యాబేజ్ నీరు తాగితే పొట్ట అలాగే లివర్ డిటాక్సిఫికేషన్ కి సహాయపడుతుంది.

6.పొట్ట అల్సర్ కి చికిత్స:

6.పొట్ట అల్సర్ కి చికిత్స:

క్యాబేజ్ లో ఫైటో న్యూట్రియ౦ట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, మీరు ప్రతిరోజూ క్యాబేజ్ నీరు తాగితే, ఆసిడ్ దాడులకు కడుపు గురికాకుండా దాన్ని నిరోధించే బలం కలిగి ఉండడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో పుండు చికిత్సకు ప్రభావవంతంగా సహాయపడుతుంది.

7.క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

7.క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

క్యాబేజ్ అధిక యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలకు పేరుగాంచింది. ప్రతిరోజూ క్యాబేజ్ లేదా క్యాబేజ్ నీరు తీసుకుంటే ఇది ప్రమాదకర ఆక్సీకరణ ఒత్తిడిపై పోరాడి, క్యాన్సర్ పెరుగుదల ప్రమాదాన్ని తగ్గించడ౦లో సహాయపడుతుంది.

8.రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది:

8.రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది:

ఉండే అధిక యాంటీ-ఆక్సిడెంట్ల కు ప్రసిద్ది చెందిన క్యాబేజ్ మంచి పేరుగాంచిన ఆకుపచ్చని ఆకుకూరలలో ఒకటి. ఇది రక్తానికి హానికలిగించే వాటిని తొలగించి, అధిక రక్తపోటు వంటి రక్త సంబంధిత ప్రమాదకర ఆరోగ్య సమస్యల నివారణకు సహాయపడుతుంది.

9.బరువు తగ్గడానికి చికిత్స:

9.బరువు తగ్గడానికి చికిత్స:

బరువు తగ్గే ఉత్తమ మార్గాలలో క్యాబేజ్ నీరు కూడా ఒకటి. క్యాబేజ్ లో శరీరానికి అవసరమైన అన్ని అద్భుతమైన పోషకాలు ఉన్నాయి, ఇందులో ఎటువంటి కొవ్వు లేదా అదనపు క్యాలరీలు ఉండవు. ఇది విషపూరిత పదార్ధాలతో కూడిన శరీర నిర్విషీకరణకు, బరువు తగ్గడంలో కూడా సహాయాన్ని అందిస్తుంది.

10.లివర్ కి మంచిది:

10.లివర్ కి మంచిది:

అధిక ఆంటీ-ఆక్సిడెంట్ లక్షణాలకు పేరుగాంచిన క్యాబేజ్ నీరు ‘ఇండోల్-3 కర్బోనైల్' అనే మంచి పేరుగాంచిన ఆంటీ-ఆక్సిడెంట్ ను కలిగి ఉంది, ఇది లివర్ నిర్విషీకరణకు సహాయపడి, లివర్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

English summary

Health Benefits Of Drinking Cabbage Water

Cabbage is a commonly found cruciferous vegetable. As a vegetable it has plenty of health benefits. In addition to this drinking cabbage water too is good for one's health. It helps to build one's immune system and also aids in weight loss.
Desktop Bottom Promotion