For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో హెల్తీగా ఉండాలంటే ఈ బెస్ట్ ఫుడ్స్ తినాల్సిందే..

ప్రస్తుతం చలికాలం, మారిన సీజన్ కు అనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ధరిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన

By Mallikarjuna
|

ప్రస్తుతం చలికాలం, మారిన సీజన్ కు అనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ధరిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే..శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి?

కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఆహారం అనేది, అది మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం, కాబట్టి మీరు వింటర్ సీజన్ లో సరైన ఆహారం తీసుకోవాలి.

winter foods to eat

వింటర్లో తీసుకొనే ఆహారాలు శరీరానికి కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకుని ఖచ్చితంగా వాటిని తీసుకోవడం వల్ల చలి నుండి, చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి శరీరాన్ని బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము.

మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయేటటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి మీకోసం...

1. నెయ్యి:

1. నెయ్యి:

నెయ్యి , ఒక సంప్రదాయ పాల ఉత్పత్తి, ముఖ్యంగా ఇండియాలో నెయి తయారీ మరియు వాడకం కూడా ఎక్కువే. ఎక్కువగా వంటలు మరియు స్వీట్స్ తయారీకి నెయ్యిని విరివిగా వినిగియోస్తుంటారు. అయితే చాలా మంది నెయ్యి కొవ్వు పదార్థం అని అనుకుని చాలా పరిమితంగా మాత్రమే తీసుకుంటారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో మరింత ఆరోగ్యప్రధాయిన, ఎందుకంటే నెయ్యిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.

2. బట్టర్

2. బట్టర్

బట్టర్ కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఎందుకంటే బట్టర్ లో హై క్యాలరీ కంటెంట్ తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ. బట్టర్ కూడా పాలఉత్పత్తే కాబట్టి వింటర్ సీజన్లో కొద్దిగా తీసుకుంటే చాలు, శరీర ఉష్ణోగ్రతను న్యాచురల్ గా పెంచి, వెచ్చగా ఉంచుతుంది.

3. టమోటో

3. టమోటో

ఒక బౌల్ స్టీమ్ చేసిన టమోటో సూప్ తాగడం వల్ల వింటర్ ఆరోగ్యానికి పెద్ద భరోసా. ఎందుకంటే టమోటోలో విటమిన్ సి మరియు లైకోపిన్ కంటెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. ముఖ్యంగా ఈ సూప్ వింటర్లో వచ్చే అనేక వ్యాధులతో పోరాడటానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫ్స్ , కేలా, పుదీనా మొదలగు ఆకుకూరలను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వింటర్ ఆరోగ్యం మరింత భద్రంగా ఉంటుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచడం మాత్రమే కాదు, వ్యాధినిరోధకతను కూడా పెంచి చలికాలంలో వ్యాధుల భారిన పడకుండా దూరంగా ఉంచుతుంది.

5. జీడిపప్పు

5. జీడిపప్పు

జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవర్ మరియు రుచి వల్ల వివిధ రకాల ఇండియన్ వంటకాల్లో జోడిస్తుంటారు. గుప్పెడు జీడిపప్పును తినడం వల్ల హార్ట్ ఎలిమెంట్ మరియు డిప్రెషన్ వంటి వ్యాధులతో పోరాడుతాయి. జీడిపప్పు శరీర ఉష్ణోగ్రతను పెంచి వింటర్లో హెల్తీగా ఉంచుతాయి.

6. పెప్పర్:

6. పెప్పర్:

వింటర్లో బ్లాక్ పెప్పర్ ను డైలీ వంటల్లో చేర్చడం వల్ల వ్యాధులు దూరం అవుతాయి. బ్లాక్ పెప్పర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ, అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ముఖ్యంగా వింటర్లో బాధించే, జలుబు, దగ్గు మరియు జాయింట్ పెయిన్ తగ్గుతాయని, అందుకే వింటర్లో పెప్పర్ ను వంటలకు జోడించి తీసుకోమని సూచిస్తుంటారు

7. యాపిల్స్

7. యాపిల్స్

యాపిల్ సీజనల్ ఫ్రూట్ , అయినా, ఇండియాలో వింటర్లో విరివిగా దొరుకుతాయి. ఈ రుచికరమైన పండులో యాంటీఆక్సిడెంట్స్, వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరీం యొక్క మెటబాలిక్ రేటును పెంచుతాయి.

8. డార్క్ చాక్లెట్:

8. డార్క్ చాక్లెట్:

డార్క్ కోకపౌడర్ తో తయారుచేసిన డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకతపెరుగుతుంది. అలాగే బాడీ టెంపరేచర్ ను కూడా పెంచి , ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా రోజూ చిన్న ఫ్యూర్ డార్క్ షుగర్ లెస్ చాక్లెట్ ను తినవచ్చు.

9. డేట్స్

9. డేట్స్

డేట్స్ (ఖర్జూలు)చాలా సుపరిచితమైనవి, అందరికీ తెలిసిన హై న్యూట్రీషియన్ డ్రైనట్. వీటిని రెగ్యులర్ గా తింటుంటే, వింటర్లో హెల్త్ బెనిఫిట్స్ రెట్టింపు అవుతాయి. చలికాలంలో బాడీ టెంపరేచర్ ను పెంచి , శరీరంను వెచ్చగా ఉంచుతుంది.

English summary

Best Foods To Consume In Winter To Stay Healthy

Winter can bring about a number of diseases in people due to the sudden drop in temperature. There are certain foods to be consumed during the winters which can prevent a number of ailments. Have a look at those healthy winter foods, here.
Story first published:Tuesday, December 19, 2017, 18:44 [IST]
Desktop Bottom Promotion