For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ హ్యాపీగా..హెల్తీగా ఉండాలని కోరుకునే వారు ఖచ్చితంగా తినాల్సిన 6 హైప్రోటీన్ ఫుడ్స్

ఇటు ఆరోగ్యాన్ని అటు కండర పుష్టిని ప్రోత్సహించే కొన్ని రకాల ఆహారాలు, మరియు పండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ ఫుడ్స్ హెల్తీ లైఫ్ కు గొప్పగా సహాయపడుతాయి. ఇప్పుడు కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ గురిం

|

నిత్య జీవితంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి మరియు అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి ప్రోటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కావున మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ల స్థాయిలు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ప్రోటీన్ లను తీసుకునే వారిని, ప్రోటీన్లను తీసుకోని వారితో పోలిస్తే, తీసుకునే వారు ఎక్కువ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచి అలవాటుగా, మార్గంగా చెప్పవచ్చు. వీటి వలన కడుపు నిండినట్లుగా అనిపించి, రోజంతా లోరీలు ఎక్కువగా అందించే ఆహార సేకరణకు దూరంగా ఉండేలా చేస్తాయి.

High-Protein Foods That Nutritionists Want Us To Eat

అంతేకాకుండా, ప్రోటీన్లు శరీరాన్ని మరమ్మత్తులకు గురి చేసి, బాడీ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. మీ శరీర కండరాలను పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ప్రోటీన్లు మంచి మార్గంగా చెప్పవచ్చు. అదేవిధంగా మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?అయితే రోజు ఉదయాన్నే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, కండర అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

ఇటు ఆరోగ్యాన్ని అటు కండర పుష్టిని ప్రోత్సహించే కొన్ని రకాల ఆహారాలు, మరియు పండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ ఫుడ్స్ హెల్తీ లైఫ్ కు గొప్పగా సహాయపడుతాయి. ఇప్పుడు కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ గురించి మనం తెలుసుకుందాం..

శెనగలు:

శెనగలు:

హై ప్రోటీన్ ఫుడ్స్ లో శెనగలు ఒకటి. వీటిలో ప్రోటీన్ మరియు ఫైబర్లు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, మినిరల్స్, ఐరన్, ఫొల్లెట్, జింక్, కాపర్లు మరియు మ్యాంగనీస్ లో అధికంగా ఉంటాయి. వీటిని సలాడ్స్ లో మరియు కర్రీలలో జోడించి తీసుకోవాలి.

కాటేజ్ చీజ్:

కాటేజ్ చీజ్:

కాటేజ్ చీజ్ హైప్రోటీన్ ఫుడ్ . ఇందులో క్యాల్షియం అధికంగా ఉంది. దీన్ని అన్ని ఏజ్ గ్రూపుల వారు తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

క్వీనా:

క్వీనా:

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో క్వీనా ఒకటి. వీటిలో హై ప్రోటీన్స్ మాత్రమే కాదు, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ హై ప్రోటీన్ ఫుడ్ ను రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం మంచిది. క్వీనా హెల్తీ ప్రోటీన్ ఫుడ్ . ఒక సర్వింగ్ తోను పొట్ట నిండిపోతుంది . అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఉదయం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

సీ ఫిష్ :

సీ ఫిష్ :

సాల్మన్ ఫిస్ ప్రోటీన్ ఫుడ్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎనర్జీ అందిస్తుంది బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి మరియు బరువు తగ్గుతారు .

గుడ్డు:

గుడ్డు:

బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి.

బాదం:

బాదం:

బాదం ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం సాల్ట్ లేని బాదంపప్పును తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం తీసుకుంటే మరింత ప్రయోజనకరం.

English summary

High-Protein Foods That Nutritionists Want Us To Eat

Protein must form an integral part of our diet. Nutritionists believe that there are certain high-protein foods that we must include in our everyday diet. Today in this article we shall talk about these high-protein foods.
Story first published: Saturday, January 21, 2017, 13:18 [IST]
Desktop Bottom Promotion