For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో కచ్చితంగా వీటిని తినాలి

చలికాలం వచ్చేసింది. వస్తూవస్తూ అనేక వ్యాధులను వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో కాస్త క్లిష్టమైన వాతావరణ పరిస్థితులుంటాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది.

By Bharath
|

చలికాలం వచ్చేసింది. వస్తూవస్తూ అనేక వ్యాధులను వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో కాస్త క్లిష్టమైన వాతావరణ పరిస్థితులుంటాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పోషకాహారాన్ని ఎక్కుగా తీసుకుంటూ.. జీవక్రియను సక్రమంగా, చురుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. చలికాలంలో శరీరంలో వేడి తగ్గకుండా, రోగాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

1) మిరియాలు

1) మిరియాలు

మిరియాలు చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి బాడీలో వేడిని పెంచుతాయి. ఫ్లూ, జలుబు వంటి వాటి బారినపడకుండా ఇందులోని ఆమ్లజనకాలు కాపాడుతాయి. అందువల్ల రోజూ తీసుకునే ఆహారాల్లో మిరియాలు ఉండేలా చూసుకోండి.

2) మెంతులు

2) మెంతులు

వీటిలో యాంటి వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఒంట్లో వేడిని పెంచుతాయి. జలుబు బారిన పడకుండా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. సగం టీస్పూన్ మెంతులను తీసుకుని వాటిని రాత్రంతా నానబెట్టండి. మరుసటి వాటిని పేస్ట్ మాదిరిగా చేసుకోండి. రోజూవారీ తినే వంటల్లో ఈ పేస్ట్ ను మిక్స్ చేయండి. దీంతో మీకు జలుబు సమస్య అనేదే రాదు.

3. తులసి + అల్లం

3. తులసి + అల్లం

తులసిలో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలాగే అల్లం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతేకాకుండా అల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

అయితే తులసి, అల్లం కలిపి తయారు చేసే టీ వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఈ టీ చలికాలం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. 5 నుంచి 6 దాకా తులసి ఆకులు తీసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. వాటిని మొత్తం పేస్ట్ మాదిరిగా చేసుకోండి. వేడినీళ్లలో ఆ మిశ్రమాన్ని కలుపుకుని తాగండి. దీంతో చాలా ప్రయోజనాలుంటాయి.

4) తృణధాన్యాలు

4) తృణధాన్యాలు

తృణధాన్యాలు కూడా బాడీని వెచ్చగా ఉంచడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. శరీర ఉష్ణోగ్రతని పెంచేందుకు ఇవి బాగా తోడ్పడుతాయి. వీటిలో మెగ్నీషియం, సెలీనియంతో పలు మినరల్స్ ఉంటాయి. రోజూవారీ తీసుకునే ఆహారంలో వోట్స్, బార్లీ, క్వినో వంటి తృణధాన్యాలను చేర్చుకుంటే మంచిది. ఇవి వింటర్ లో పలు సీజనల్ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

5) పసుపు

5) పసుపు

పసుపు బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి పసుపు బాగా పని చేస్తుంది. కాలేయ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. రోజూ కాస్త గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడిని కలుపుకుని తాగితే చాలా మంచిది.

6. తేనె

6. తేనె

తేనె కూడా బాడీలో వేడిని పెంచుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. చలికాలంలో రెగ్యులర్ గా తేనే తీసుకుంటూ ఉండడం మంచిది. చిటికెట్ దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలుపుకుని తాగితే ఈ చలికాలంలో మీరు కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.

7) దాల్చిన చెక్క

7) దాల్చిన చెక్క

దాల్చినచెక్క కూడా శరీరంలో వేడిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మీరూ రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగుతున్నట్లయితే అందులో కాస్త దాల్చినచెక్క పొడి కలుపుకుని తాగండి. ఇది మీ బాడీలో హీట్ పెంచుతుంది. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

8) నువ్వులు

8) నువ్వులు

నువ్వులు కూడా శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. అలాగే న్యుమోనియా, ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా నువ్వులు మంచి శక్తిని ఇస్తాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ మీరూ తీసుకునే ఆహారాల్లో నువ్వులు ఉండేలా చూసుకోండి.

9) కుంకుమ పువ్వు

9) కుంకుమ పువ్వు

ఇది బాగా ఖరీదైనది. అయితే కుంకుమ పువ్వు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులు సోకకుండా కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్లాస్ పాలలో కాస్త కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే చాలా మంచిది.

10) హాట్ వెజిటేబుల్ సూప్

10) హాట్ వెజిటేబుల్ సూప్

వింటర్ లో మీరు ఎక్కువగా వేడివేడిగా ఉండే వెజిటబుల్ సూప్స్ తీసుకుంటూ ఉండాలి. వీటిని ఒక కప్ తీసుకున్నా చాలు. దీంతో మీ బాడీలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇష్టమైన కూరగాయాలతో వెజిటేబుల్ సూప్ తయారు చేసుకుని తీసుకుంటూ ఉండండి.

English summary

indian foods to keep you warm during winter

Here is a list of Indian foods that will provide you with the much-needed warmth and energy during the cold winter months, take a look
Desktop Bottom Promotion