For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ సీజన్ : పైనాపిల్లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

పైనాపిల్ నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది.

By Lekhaka
|

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు(పైనాపిల్) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువరోజుల నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినడమే మంచిది. చాలామంది పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలానే దీనికి ఫ్రిజ్‌ పడదు. బయట ఉంచడమే మంచిది. తొక్కుతీసిన పైనాపిల్‌ను వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. జ్యూస్‌ని ఫ్రిజ్‌లో పెడితే రుచి మారుతుంది. దానికన్నా ముక్కలుగా నిల్వ చేయడమే మంచిది. కేనింగ్‌ లేదా ప్రాసెస్‌ చేసినవయితే ఏడాది వరకూ నిల్వ ఉంటాయి.


తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.

 It's The Season Of Pineapple! Read This Article To Know About Its Amazing Health Benefits

పైనాపిల్ నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వాతాన్ని, కఫాన్ని ఉపశమనం చేయడంలో ఇది ఉపయోగ పడుతుంది. చూడడానికి ముళ్లులాగా ఉండే పండు పైనాపిల్‌. ఆకారం బాగోకపోయినా దానిలో చాలా పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందామా!


ఆర్థ్రైటిస్ సమస్యను నివారిస్తుంది

ఆర్థ్రైటిస్ సమస్యను నివారిస్తుంది

ఎపైనాపిల్స్ లో విటమిన్ సీ తోపాటు మాంగనీస్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల ఎముకలకు శక్తి చేకూరుతుంది. లేటు వయసులో మహిళల్లో వచ్చే ఎముకల వ్యాధుల నుంచి కాపాడటానికి తోడ్పడుతుంది. ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ ద్వారా 70 శాతం మాంగనీస్ అందుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ పైనాపిల్ ముక్కలు రోజూ తినడం వల్ల.. శరీరానికి కావలిన శక్తి అందుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది

వ్యాధినిరోధకతను పెంచుతుంది

పైనాపిల్ ను రెగ్యులర్ గా తీసుకుంటే పైనాపిల్లో ఉండే విటమిన్ సి కంటెంట్ వ్యాధినిరోధకతను పెంచుతుంది, అలాగే ఎర్ర రక్తకణాలను ఉత్తేజపరుస్తుంది. వ్యాధులను దూరం చేస్తుంది.

టిష్యు, సెల్యులార్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

టిష్యు, సెల్యులార్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

పైనాపిల్లో ఉండే విటమిన్ సి కంటెంట్ ఇది అత్యంత విలువైనది. ఇది త్వరగా గాయాలను, చర్మ సమస్యలను మాన్పుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

 క్యాన్సర్

క్యాన్సర్

పైనాపిల్స్ చాలా ఎక్కువ పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి బయటపడేలా చేస్తాయి.

జీర్ణక్రియ:

జీర్ణక్రియ:

పైనాపిల్‌లో బ్రొమిలైన్‌ అనే ప్రొటియోలిటిక్‌ ఎంజైమ్‌ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.

సైనసైటిస్‌, గొంతునొప్పి:

సైనసైటిస్‌, గొంతునొప్పి:

గొంతునొప్పి, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధుల్నీ పైనాపిల్‌ తగ్గిస్తుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారిస్తుంది.

పంటి నొప్పులను నివారిస్తుంది-

పంటి నొప్పులను నివారిస్తుంది-

పంటి వ్యాధులతో బాధపడేవారిలో వాపులూ, మంటలూ నొప్పులూ ఎక్కువ. పైనాపిల్‌లోని సి-విటమిన్‌ బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

కళ్ళు ఆరోగ్యానికి:

కళ్ళు ఆరోగ్యానికి:

వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని కొన్ని కణాలకి కేన్సర్‌లతోనూ పోరాడగల శక్తి ఉంది.

బీపీని కంట్రోల్ చేస్తుంది

బీపీని కంట్రోల్ చేస్తుంది

పైనాపిల్ లో మినరల్స్, విటమిన్స్ కాకుండా.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది.


English summary

It's The Season Of Pineapple! Read This Article To Know About Its Amazing Health Benefits

The fruiting season of pineapple runs from March to June and this is definitely the best time to relish this fruit along with the amazing health benefits.
Desktop Bottom Promotion