For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ D లోపిస్తే మనోవైకల్య ప్రమాదం పెరుగుతుంది

విటమిన్ D లోపిస్తే మనోవైకల్య ప్రమాదం పెరుగుతుంది!మనోవైకల్య కేసుల సంఖ్యా ప్రపంచం మొత్తం బాగా పెరిగిపోయాయి. 2014 లో, విటమిన్ డి తక్కువగా ఉన్న రోగులలో పరిస్ధితి మరింత పెరగడమే దీనికి కారణమని పరిశోధనలు తేల

By Lakshmi Bai Praharaju
|

ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం చాలా మంచిది ఇది మీ మెదడుకి ఆరోగ్యమే కాకుండా మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. శరీరంలో ముఖ్యమైన ఎటువంటి పోషకాలు, మినరల్స్ తగ్గినా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మన శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ D ఒకటి. శరీరంలో విటమిన్ లోపిస్తే, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ D ఎముకలకు బలం చేకూర్చి, గుండె జబ్బు ప్రమాదాలను తగ్గించడానికి, రుమటాయిడ్ కీళ్ళనొప్పులు, మల్తిబుల్ స్క్లేరోసిస్ రాకుండా సహాయపడతాయి.

అయితే, ఇంతే కాదు, విటమిన్ డి లోపం వల్ల మనోవైకల్యం పెరిగే ప్రమాదం కూడా ఉందని కొత్త అధ్యయనంలో వెల్లడయింది. విటమిన్ డి కి సూర్యకాంతి ఒక ప్రధాన మూలం. ప్రతిరోజూ సూర్యకాంతి వద్ద కూర్చుంటే మనోవైకల్యం ప్రమాదం తగ్గడానికి సహాయపడుతుంది.

మనోవైకల్య కేసుల సంఖ్యా ప్రపంచం మొత్తం బాగా పెరిగిపోయాయి. 2014 లో, విటమిన్ డి తక్కువగా ఉన్న రోగులలో పరిస్ధితి మరింత పెరగడమే దీనికి కారణమని పరిశోధనలు తేల్చాయి.

విటమిన్ డి లోపం మధ్యస్ధంగా ఉన్న 53 శాతం మంది పెద్దవారు మనోవైకల్య ప్రమాదాన్ని కలిగి ఉంటె, 122 శాతానికి మించి ఈ పరిస్ధితితో ఎక్కువగా బాధపడుతున్నారని ఈ ఆధ్యయన కోర్స్ లో తేలింది.

మరోవైపు, అల్జీమర్ వ్యాధిగ్రస్తులు, అలాగే మనోవైకల్యం ఇతర రూపాలలో ఉన్న 1,600 మంది కంటే ఎక్కువగా ఉన్నారని ఆరు సంవత్సరాల నుండి అనుసరించి పరిశోధకులు గమనించారు.

dementia risk

అధ్యయనంలో పనిచేస్తున్న ఒక పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ లీ లేవేల్లిన్ మాట్లాడుతూ “విటమిన్ డి స్థాయి తక్కువగా ఉండి, మనోవైకల్య ప్రమాదం, అల్జీమర్ వ్యాధి మధ్య ఉన్న అనుబంధాన్ని మేము కనుగొన్నాము, కానీ ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ అనుబంధం రెండు రెట్లు బలంగా ఉన్నాయని మేము కనుగొన్నాము. ఆయిలీ ఫిష్ లేదా విటమిన్ డి సప్లిమెంట్ల వంటి పదార్ధాలను తిన్నా ఆలస్యం కావొచ్చు లేదా అల్జీమర్, మనోవైకల్యం వ్యాధిని నిర్ధారించే క్లినికల్ టెస్ట్ లు చేయడం ఇప్పుడు అవసరం” అని చెప్పారు.

విటమిన్ డి అధికంగా ఉన్న ఆహార పదార్ధాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఒకసారి చూడండి.

1.పుట్టగొడుగులు:

1.పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు సూర్యకాంతిని పొందుతాయి, కాబట్టి వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో పుట్టగొడుగులను చేర్చడం వల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది.

2.పాలు:

2.పాలు:

పాలలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగితే, ప్రత్యేకంగా పడుకోబోయే ముందు పాలు తాగితే శరీరానికి కావాల్సిన డి విటమిన్ అందుతుంది. మీరు తాగే టీలో కలిసే పాలు, కాఫీ లేదా మిల్క్ షేక్ ల కంటే, పోషక విలువలు కలిగిన పాలను సాధారణ రూపంలో తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

3.గుడ్లు:

3.గుడ్లు:

చాలామంది గుడ్డులోని పచ్చ సొన రుచిని ఇష్టపడరు, కానీ దీనిలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. మొత్తం గుడ్డు తింటే సాధ్యమైనంత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

4.సోయా పదార్ధాలు:

4.సోయా పదార్ధాలు:

సోయా పదార్ధాలు, ప్రత్యేకంగా సోయా పాలు విటమిన్ డి సమృద్ధిగా ఉండే మంచి మార్గాలలో ఒకటి. ఈ సోయా పాలలో విటమిన్ డి తోపాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుది. మీ దైనందిన ఆహారంలో సోయా పాలను తీసుకుంటే, మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి సమృద్ధిగా అందుతుంది.

5.ఆరంజ్ జ్యూస్:

5.ఆరంజ్ జ్యూస్:

విటమిన్ డి ఎక్కువగా ఉన్న మంచి పండ్లలో ఆరంజ్ ఒకటి. ఉదయం మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది.

English summary

Lack Of Vitamin D Increases Dementia Risk.

Lack of adequate vitamin D in the body can lead to several health problems. Vitamin D helps in strengthening the bones, reducing the risk of heart disease, rheumatoid arthritis and multiple sclerosis. A new study has found that the deficiency of Vitamin D increases the risk of developing dementia.
Story first published:Monday, December 4, 2017, 18:06 [IST]
Desktop Bottom Promotion