For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్లో మెంతులు చేసే మేలు మరవకూడదు..

|

మనం ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి హాస్పిటల్ వెళ్లి మందులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ మందుల వల్ల నయం అవటం ఏమో కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

మన వంటిట్లో ప్రతి రోజు వాడే మెంతులు వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మెంతులు రుచిలో చేదుగా ఉన్నా చక్కని సువాసనతో ఔషధగుణాలను కలిగి ఉంటుంది. మెంతులు చేసే మేలు గురించి తెలుసుకుంటే తప్ప కుండా అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు చూద్దాం... మెంతులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో...

 స్థూలకాయం సమస్య తగ్గుతుంది.

స్థూలకాయం సమస్య తగ్గుతుంది.

ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను అంతా మెంతి పొడిని వేసి ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వడపోసి ఆ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగడం వలన స్థూలకాయం సమస్య తగ్గుతుంది.

మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది

మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది

మెంతి పొడిని పెరుగులో కలిపి ముఖానికి పాక్ లా వేసుకుని, ఒక ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకున్నట్లైతే చర్మం మీద ఉండే ముడతలు తగ్గుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ఆడవారికి ఋతు సమస్యలు తొలగుతాయి.

ఆడవారికి ఋతు సమస్యలు తొలగుతాయి.

అరచెంచా మెంతి పొడిని పరకడుపుతో వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన ఆడవారికి ఋతు సమస్యలు తొలగుతాయి. వారికి నెలసరి క్రమంగా వస్తుంది. అంతేకాక నెలసరి సమయం లో వచ్చే కడుపునొప్పి కూడా నివారించబడుతుంది.

గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.

గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.

నిప్పు వల్ల లేదా మంటల వల్ల పొరపాటున అగ్ని ప్రమాదం జరిగి గాయాలు అయినప్పుడు వెంటనే, మెంతులను మెత్తగా గుజ్జులా నూరి కాలిన చోట కట్టు వేస్తే, క్షణాల్లో మంట తగ్గిపోయి బొబ్బలెక్కకుండా ఉంటుంది. అంతే కాకుండా రోజూ రెండు పూటలా ఇలా చేస్తుంటే కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.

 వాపులు, నొప్పులు హరించిపోతాయి.

వాపులు, నొప్పులు హరించిపోతాయి.

దెబ్బల వల్ల గాని, మరే ఇతర వాయు దోషాల వల్ల గాని మోకాళ్ళు, చీలు మండలు మొదలైన చోట్ల వాపులు కలిగినప్పుడు మన వంటింటి మెంతులు వజ్రాయుధంలా పనిచేస్తాయి. మెంతుల్ని ఒక పగలు నీటిలో నానబెట్టి రాత్రి గుజ్జులా నూరి వాపుల పైన దట్టం గా పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. ఇలా విడవకుండా చేస్తుంటే వాపులు, నొప్పులు హరించిపోతాయి.

శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.

శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.

ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటబట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు. అలాంటి వారు ఒక కప్పు పెరుగులో ఒక చెంచా మెంతులను రాత్రి పూట వేసి, ఉదయం వరకు నానబెట్టి పరిగడుపున మెంతులతో పాటు పెరుగు కుడా తింటుంటే శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.

మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు

మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు

మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించుకుని ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు వంటివి నివారించబడి, జుట్టు ఒత్తుగా, బలంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు జుట్టు వేగంగా పెరుగుతుంది. చిన్న తనంలోనే జుట్టు తెల్లబడటం సమస్య తగ్గుతుంది.

 విరోచనాలు వెంటనే తగ్గుతాయి.

విరోచనాలు వెంటనే తగ్గుతాయి.

విరోచనాలు అవుతున్నప్పుడు ఒక స్పూను పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున, వెంటవెంటనే మూడు సార్లు తీసుకోవాలి. గంటకు ఒకసారి ఇలా చేయడం వల్ల విరోచనాలు వెంటనే తగ్గుముఖం పడతాయి.

మెంతులు ప్రాధాన్యత

మెంతులు ప్రాధాన్యత

మన వంటింట్లో ఉండే మెంతులు, ఇన్ని రకాల సమస్యలకి పరిష్కారంగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా..! పైన పేర్కొన్న సమస్యల్లో మీకేదైన ఉంటే ప్రయత్నించి చూసి సులభంగా లబ్ది పొందండి. ఈ విషయాన్ని షేర్ చేసి అందరికి మెంతులు యొక్క ప్రాధాన్యత తెలియజేయండి.

English summary

Nutritional Benefits Of Fenugreek

The bitter taste of kasuri methi or fenugreek might not be palatable and most of us do not eat it for that reason. But this bitter tasting food has innumerable nutrients and plenty of health benefits. Once you get to know about the benefits of fenugreek for our health, you will never ignore this super food.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more