For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి మీ అల్పాహారంలో తప్పనిసరిగా తీసుకోవల్సిన హై ప్రోటీన్ ఫుడ్స్..!

పాత సామెత లాగా, “అల్పాహార౦ రాజులాగా చేయాలి, లంచ్ రాజకుమరుడిలా చేయాలి, రాత్రి భోజనం భిక్షగాడి లాగా చేయాలి”, ఇది నేటికీ వాస్తవమే.ఏ వయసు వారికైనా రోజులో అల్పాహారం అనేది అత్యంత ముఖ్యమైన భోజనంలో ఒకటి. రో

By Lakshmi Bai Praharaju
|

పాత సామెత లాగా, "అల్పాహార౦ రాజులాగా చేయాలి, లంచ్ రాజకుమరుడిలా చేయాలి, రాత్రి భోజనం భిక్షగాడి లాగా చేయాలి", ఇది నేటికీ వాస్తవమే.

ఏ వయసు వారికైనా రోజులో అల్పాహారం అనేది అత్యంత ముఖ్యమైన భోజనంలో ఒకటి. రోజంతా ఎంతో బలంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం అవసరం.

కానీ కొంతమంది బరువు తగ్గడం కోసం అల్పాహారాన్ని మానేస్తారు. ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు.

foods to lose weight

బరువు తగ్గడానికి బదులు, అల్పాహారాన్ని మానేస్తే నిజానికి బరువు పెరుగుతారు అనేది అర్ధంచేసుకోవాల్సిన నిజం.

మరో గ్రూపుకు చెందిన వారు, పనిలో మునిగిపోయి, అల్పాహారం తీసుకోకుండా, నేరుగా మధ్యాహ్న భోజనంతో ముగిస్తారు.

అంతేకాకుండా, మరోవైపు, అల్పాహారం లేదా రోజులో ప్రధానమైన భోజనం విషయానికి వస్తే, సరైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ప్రాధాన్యతని ఇవ్వాలి.

రాత్రి భోజనం తరువాత, మర్నాడు ఉదయం వరకు మీరు ఏమీ తినరు. కాబట్టి, మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయి తక్కువగా ఉండి, శక్తి తక్కువగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారం గ్లూకోజ్ స్థాయిని, అలాగే మీ శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అయితే, మీ అల్పాహారంలో కాల్షియం, ఐరన్, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు తప్పకుండా ఉండాలి.

ఇదికూడా చదవండి: బరువు తగ్గడానికి పరగడుపున తినాల్సిన 20 ఆహారపదార్ధాలు

బరువు తగ్గడం కోసం మీ అల్పాహారంలో చేర్చవలసిన ప్రోటీన్ ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారపదార్ధాల జాబితా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించండి.

1.కోడిగుడ్లు:

1.కోడిగుడ్లు:

కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ముఖ్యంగా పచ్చసొనలో. వాటి అధిక ప్రయోజనాలు పొందడానికి, సరైన మార్గంలో కోడిగుడ్లను తినడం ఎంతో ముఖ్యం. ప్రోటీన్ ని పొందాలి అంటే రోజుకు ఒక ఉడికించిన కోడిగుడ్డు తినడం అనేది మంచి మార్గం.

ఉడికించిన కోడిగుడ్లు తినడానికి ఇష్టపడని వారు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో వేయించిన కూరగాయలతో పాటు కోడిగుడ్లు తినవచ్చు. అంతేకాకుండా, పాలకూర్, చీజ్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసి కోడిగుడ్డును ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం మరో మంచి మార్గం.

2.టోఫు:

2.టోఫు:

మీకు లాక్టోజ్ సరిపడినంత లేకపోతే, మీకు అవసరమైన ప్రోటీన్ పొందడానికి ఉత్తమమైన ఎంపికల్లో టోఫు ఒకటి. టోఫు లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ అల్పాహారంలో టోఫు ను ఎలా జతచేస్తారు?

కాలే తో కలిపి టోఫు ను వేయించండి, దాన్ని మీ రోజువారీ అల్పాహారానికి జతచేయండి. ఇది మీరు ప్రభావవంతంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3.గ్రీక్ వెన్న

3.గ్రీక్ వెన్న

ఎటువంటి అదనపు రుచి లేకుండా గ్రీక్ వెన్నను తీసుకోవడం అనేది ప్రోటీన్ కి మంచి మూలం. కానీ తక్కువ కొవ్వు కలిగిన గ్రీక్ వెన్నను ఎంచుకోవడం అనేది గుర్తుంచుకోవాలి. గ్రీక్ వెన్నలో ఉండే మరో మంచి గుణం ఏమిటంటే ఇందులో కాల్షియం కూడా అద్భుతంగా కలిగి ఉంటుంది.

తక్కువ కొవ్వు కలిగిన గ్రీక్ వెన్నతో పాటు గోధుమ పిండి, గింజలు, బెర్రీస్ ని కూడా మీ అల్పాహారంలో తీసుకుంటే ఇది ఎక్కువసేపు మీ కడుపు నిండుగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి చికిత్సగా కూడా పనిచేస్తుంది.

4.అరటిపండు & మజ్జిగ ప్రోటీన్ షేక్:

4.అరటిపండు & మజ్జిగ ప్రోటీన్ షేక్:

మీకు సాధారణంగా పనివల్ల ఆలస్యం అవుతుంటే, ఒక గ్లాసు బాదంపాలు, అరటిపండు, మజ్జిగ ప్రోటీన్ షేక్ తీసుకోవడం కంటే మంచి మార్గం ఇంకోటి లేదు. అరటిపండు ప్రోటీన్, ఫైబర్, పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది మీ పొట్టను నిండుగా ఉండేట్టు చేయడమే కాకుండా, మీకు అవసరమైన మేర సత్తువని, శక్తిని అందిస్తుంది.

5.జామపండు:

5.జామపండు:

అన్ని పళ్ళలోకి, అధిక ప్రోటీన్ కలిగిన వాటిలో జామపండు ఒకటి. తక్కువ క్యాలరీలతో, జామపండు విటమిన్ C, ఫైబర్ ని కూడా అధికంగా కలిగి ఉంటుంది. మీ అల్పాహారంలో ఒక కప్పు జామపండు ముక్కలు తీసుకుంటే, మీకు అవసరమైనంత శక్తిని ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

6.వేరుశెనగ వెన్న:

6.వేరుశెనగ వెన్న:

వేరుశెనగ వెన్నలో మోనో అన్సాచురేటేడ్ కొవ్వులు లేదా మంచి కొవ్వులుగా ఏమి పిలవబడతాయో అవి ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ మీ అల్పాహారంలో జతచేస్తే మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండడమే కాకుండా, జంక్ ఫుడ్ ల కోరికను తగ్గించి, జంక్ ఫుడ్ జోలికి పోకుండా చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుదలను కూడా నివారించడానికి సహాయపడుతుంది.

7.సబ్జా గింజలు:

7.సబ్జా గింజలు:

ప్రోటీన్, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఇతర అవసరమైన పోషకాలు అధికంగా కలిగిన ఈ సబ్జా గింజలు అల్పాహారంగా తీసుకోవడానికి మంచి ఆహారపదార్ధాలలో ఒకటి. ఈ పోషకాలే కాకుండా, సబ్జా గింజలు ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ లేదా సాధారణంగా మంచి కొవ్వుగా చెప్పుకునే లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.

మీరు ఓట్మీల్ చేసుకున్నపుడు, ఒక టీస్పూన్ సబ్జా గింజలు అందులో కలపండి. దీనివల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

8.గింజలు:

8.గింజలు:

గింజలను అల్పాహారంగా తప్పక తీసుకుంటే, ఇవి బరువు తగ్గించడమే కాకుండా, ఆరోగ్యంగా ఉండేట్టు కూడా చేస్తాయి. గింజలు, ప్రత్యేకంగా బాదం, వాల్నట్స్, జీడిపప్పులు అధిక ప్రోటీన్ ని, ఆరోగ్యకరమైన కొవ్వు ని కలిగి ఉంటాయి. గింజలు శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

English summary

Protein-rich Foods For Breakfast To Lose Weight

Breakfast is one of the most important meals of the day for any age group. Skipping breakfast is not an ideal solution to lose weight. Adding certain protein-rich foods in your breakfast actually helps one to lose weight.
Story first published:Monday, December 18, 2017, 14:33 [IST]
Desktop Bottom Promotion