For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ అవర్స్ లో తినాల్సిన హెల్తీ ఫుడ్స్!

By Mallikarjuna
|

రోజువారి దినచర్యలో ఆహారం ఒక భాగం. ఆహారాన్ని ఇష్టంగా, ఇష్టమైనది తినడం కూడా ఒక కళ. అయితే ఈ కళ కూడా సంతోషకరమైనది, ఆరోగ్యకరమైనదిగా ఉండేట్లు చూసుకోవాలి. మనం తినే ఆహారం మీద శ్రద్దపెట్టాలి. ఇది మన జీవనశైలికి చాలా ఉపయోగకరం. ఈ ఆధునిక ప్రపంచంలో బిజీగా ఉండటం వల్ల కొంత మంది ఆఫీసుల్లో వర్క్ చేసే ప్రదేశాల్లోనే కూర్చొన్న సీటులోనే భోజనం కానిచ్చేస్తుంటారు. అలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఆఫీస్ లో దాదాపు 8-10గంటలు గడుపుతారు. ఎక్కువ సమయం కంప్యూటర్ మోనిటర్ ను చూడటం వల్ల, శారీరక శ్రమ లేమ లేకుండా గడపడం అత్యంత దురదృష్టకర విషయం.

ఆఫీస్ అవర్స్ లో తినాల్సిన హెల్తీ ఫుడ్స్!

శరీరానికి శ్రమ కల్పించకపోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండదు? దానికి తోడు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లే. శారీరక శ్రమ ఉండదు, కనీసం తినే ఆహారంలో తక్కువ క్యాలరీలుండేట్లు చూసుకోవడం, న్యూట్రీషియన్ స్నాక్స్, మరియు భోజనం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే, మీరు కోరుకున్నహెల్తీ లైఫ్ స్టైల్ కళ నిరవేరదు.

కాబట్టి, పనిచేసే చోట ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలు ఎంచుకోవాలి. పని విరామ సమయంలో ఎలాంటి న్యూట్రీషియన్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలో తెలుసుకోవాలి.

కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను

పనిచేసే ప్రదేశంలో ఆకలి కాకుండా, జంక్ ఫుడ్స్ మీద కోరికలు పెరగడకుండా ఫుల్ స్టాప్ పెట్టడం ఎలాగో తెలుసుకుందాం..

1. ఇంట్లో తయారుచేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం:

1. ఇంట్లో తయారుచేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం:

పనిచేసే కార్యాలయాల్లో , విరామసమయంలో, భోజనం సమయంలో తినే ఆహారాలు, ఇంట్లో తయారుచేసినవై ఉండాలి. వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారాలను తీసుకుపోవడం వల్ల ఆర్థకంగానే కాదు, సమయాన్ని సేవ్ చేస్తుంది. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.

2. నీళ్ళ బాటిళ్ళు డెస్క్ మీద పెట్టడం:

2. నీళ్ళ బాటిళ్ళు డెస్క్ మీద పెట్టడం:

అనారోగ్య సమస్యలను దూరం చేయాలంటే, పనిచేసే చోట కళ్ళకు ఎదురగా డెస్క్ మీద నీళ్ళ బాటిల్స్ ఉంచి, తరచూ నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. నీళ్ళు తాగడం వల్ల తక్షణ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మరింత చురుకుగా పనిచేయవచ్చు. ఇంకా మలబద్దకం, కిడ్నీ సమస్యలు, కండరాలు పాడవకుండా నివారించుకోవచ్చు.

ఆఫీసులో ‘యోగా’... ! ఆఫీసులో ‘యోగా’... !

3. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు నట్స్ పట్టుకెళ్లాలి:

3. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు నట్స్ పట్టుకెళ్లాలి:

రోజులో ఎక్కువ సమయం కార్యాలయాల్లోనే గడుపుతారు కాబట్టి, పనిచేసే సమయంలో లేదా విరామ సమయాల్లో చిరుతిండ్లుగా తినడానికి నట్స్ లేదా మొలకలు, లేదా ఉడికించిన ధాన్యాలు తీసుకుపోవడం మంచిది. ఇవి బయట తెచ్చుకునే సాల్ట్ స్నాక్స్, ఇతర ఆయిల్ జంక్ ఫుడ్స్ కంటే ఆరోగ్యకరమైనవి, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తాయి.

4. పండ్లు:

4. పండ్లు:

ఉపయోగపడనివి ఎన్ని తిన్నా ప్రయోజనం ఉండదు, వాటి స్థానంలో పండ్లను ఎంపిక చేసుకోండి. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవసరమైన పోషకాలను అందిస్తాయి. పండ్లతో పాటు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో విటమిన్స్,న్యూట్రీషియన్ల లోపాలను పోగొట్టుకోవచ్చు.

5. ఓట్ మీల్:

5. ఓట్ మీల్:

పనిచేసే చోట ఎక్కువ పని భారంగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు, తక్షణం తయారుచేసుకోగల ఓట్ మీల్ వంటి ఆహారా పదార్థాలను తీసుకెళ్ళడం మంచిది. ప్లెయిన్ వాటి కంటే ఎండు ఫలాలు, నట్స్ కలిపిన వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది ఆకలి తీర్చడం మాత్రమే కాదు బరువు పెరగడకుండా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ ను క్రమబద్దం చేస్తుంది.

కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను

6. జంక్ ఫుడ్ :

6. జంక్ ఫుడ్ :

జంక్ ఫుడ్ తినడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మీరు జంక్ ఫుడ్ ప్రియులైతే మాత్రం ఈ క్రింది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

ఊబకాయం

కార్డియోవాస్కులర్ వ్యాధులు

డయాబెటిస్

దంత సమస్యలు

డిప్రెషన్, మొదలైనవి

ఈ జీవితం దేవుడిచ్చిన వరం. కాబట్టి, వరాన్ని భద్రపరుచుకోవడం, శరీరానికి కాపడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యంగా జీవించడానికి ఆరోగ్యకరమైన మార్గాలను ఎందుకు ఎంపిక చేసుకోకూడదు!

English summary

Smart & Easy Ways To Eat Healthy During Office Hours

Eating healthy at work is very essential. Know about the best ways to eat healthy at work ...
Story first published:Thursday, July 6, 2017, 18:12 [IST]
Desktop Bottom Promotion