For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునక్కాయ విత్తనాల్లో దాగున్న టాప్ 8 న్యూట్రీషినల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

కూరగాయల్లో మునగకాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. చాలామంది మునక్కాయ అనగానే కేవలం లైంగిక పటుత్వానికి ఉపయోగపడుతుందని మాత్రమే భావిస్తుంటారు. కానీ మునగకాయ వల్ల ఉన్న అసలు ప్రయోజనం కేవలం అదొక్కటే కాదు.

|

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. దీని ఉపయోగాలు ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ అన్నీ పనికొచ్చేవే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ శాస్ర్తీయ నామం 'మొరింగ బలిఫెర' ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా, తొందరగా పెరిగే మొక్కలలో ఇది ఒకటి. 5000 సంవత్సరాల క్రితమే మునగ వాడుకలో ఉంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.

 Top Nutritional Benefits Of Drumstick Seeds

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకును కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ చేసుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.

కూరగాయల్లో మునగకాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. చాలామంది మునక్కాయ అనగానే కేవలం లైంగిక పటుత్వానికి ఉపయోగపడుతుందని మాత్రమే భావిస్తుంటారు. కానీ మునగకాయ వల్ల ఉన్న అసలు ప్రయోజనం కేవలం అదొక్కటే కాదు. మునగకాయలోని గుజ్జు తిని విత్తనాలు వదిలేసేవాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ మునగకాయ విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. మునగ విత్తనాల్లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. డయాబెటిస్, అనీమియా, హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, ఆర్థ్రైటిస్, జీర్ణసమస్యలు, అనేక రకాల చర్మ సమస్యలను, రెస్పిరేటరీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వాధులను నిర్మూలించడంలో ముగవిత్తనాల్లో అద్భుతంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని న్యూట్రీషియనల్ , హెల్త్ బెనిఫిట్స్ ను తెలుసుకుందాం..

న్యూట్రీషియన్స్ కు స్టోర్ హౌస్ వంటిది.

న్యూట్రీషియన్స్ కు స్టోర్ హౌస్ వంటిది.

ఇందులో విటమిన్స్, మినిరల్స్, మరియు అమినోయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ మరియు క్యాల్షియం, ప్రోటీన్, పొటాషియం, వంటి మినిరల్స్ వంటి మైక్రోన్యూట్రీషియన్స్ శరీరానికి చాలా అవసరం అవుతాయి .

ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది:

ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది:

ముగవిత్తనాల్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, మోలుక్యులర్ సెల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలను నివారిస్తుంది. మునగాకు, మునగకాయ, మునగు పువ్వు, విత్తనాల్లో ఫ్లెవనాయిడ్స్, ఆక్సార్బిక్ యాసిడ్స్ మరియు ఫాలీఫినాల్స్ వంటి అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ప్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

డయాబెటిస్ తగ్గిస్తుంది:

డయాబెటిస్ తగ్గిస్తుంది:

మునగాకు విత్తనాలు డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు, ముఖ్యంగా రెటినోపతి నివారించడంలో గొప్పగా సమాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ టైప్ 1తో బాధపడే వారిలో బ్లడ్ వెజల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి బెస్ట్ నేచురల్ మెడిసిన్ మునగ విత్తానలు .

.కార్డియో వ్యాస్కులర్ సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది :

.కార్డియో వ్యాస్కులర్ సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది :

మునగాకు విత్తనాల్లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల హార్ట్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది. బ్లడ్ వెజల్స్ ను స్ట్రాంగ్ గా, ఫ్లెక్సిబుల్ గా మార్చుతుంది .

బ్రెయిన్ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది :

బ్రెయిన్ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది :

మునగాకు విత్తనాల్లో ఫోలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. వీటిలో పాటు విటమిన్ ఇక కూడా పుష్కలంగా ఉంది. ఇవన్నీ బ్రెయిన్ పవర్ పెంచడంలో సహాయపడే కరెక్టైన న్యూట్రీషియన్స్.

కాలేయానికి రక్షణ కల్పిస్తుంది:

కాలేయానికి రక్షణ కల్పిస్తుంది:

ముగవిత్తనాల్లో ఫాలి ఫినాల్స్ అధికంగా ఉన్నాయి. టాక్సిటికి వ్యతిరేఖంగా రక్షణ కవచంగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ కలగకుండా నివారిస్తుంది. లివర్ హెల్త్ ను కాపాడుతుంది.

గాయాలను త్వరగా మాన్పుతుంది:

గాయాలను త్వరగా మాన్పుతుంది:

మునచెట్టులో ప్రతి భాగం వేర్లు, ఆకులు, కాయలు, పువ్వులు, విత్తనాలు ఇలా ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. స్క్రాచెస్, కట్స్, గాయాలను మాన్పుతుంది.

యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:

యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:

మునగాకు మరియు మునగ విత్తనాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ , జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు వ్యతిరేఖంగా పోరాడటంలో ఇది గొప్పగా సహాయపడుతుంది.

English summary

Top Nutritional Benefits Of Drumstick Seeds

Read this article to know about the several nutritional and health benefits of moringa (drumstick) seeds.
Story first published: Tuesday, January 17, 2017, 13:09 [IST]
Desktop Bottom Promotion