For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదంను తినడానికి ముందు నీళ్ళలో నానబెట్టుటకు ఫర్ఫెక్ట్ రీజన్స్ ఏంటి?

|

ఒకటా.. రెండా.. ఎన్నని చెప్పాలి.. డ్రైఫ్రూట్స్‌లోని గుణాలు.. ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో.. అంతటి శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి. పైగా వీటి రుచి వలన పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీటిని నేరుగానైనా.. లేదా వీటితో స్వీట్స్‌ వంటివి తయారు చేసుకుని తిన్నా సరే వీటి గుణాలు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ఇప్పుడు మార్కెట్‌లోనూ వీటితో తయారు చేసిన పదార్థాలకు ఎంతో డిమాండ్‌ వుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు వీటిని అడిగి మరీ తీసుకుంటున్నారు మరి..

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా బాదంలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం. ఇవి జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి. ఇంకా ఈ బాదం పప్పులను తినడానికి ముందు నీళ్ళలో నానబెట్టడం ద్వారా చాలా టేస్టీగా ఉండటమే కాదు, ఈజీగా జీర్ణం అవుతాయి.అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

నట్స్ తినే అలవాటు ఉన్నట్లైతే, వీటిని నీటిలో నానబెట్టుట వల్ల కొన్ని అసలైన వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. బాదంను నీటిలో నానబెట్టుట వల్ల శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్లు, ఎంజైములు, అమినోయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లను మన శరీరానికి పుష్కలంగా అందిస్తాయి. మరి నానబెట్టిన బాదం గురించి మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం..

ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

బాదంను నీటిలో నానబెట్టుట వల్ల వాటి మీద ఉండే పొట్టును తొలగించడానికి సులభ అవుతుంది. అలాగే బాదంపొట్టులో టానిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని న్యూట్రీషియన్స్ తేలికగా గ్రహిస్తుంది. దాంతో శరీరంలో న్యూట్రీషియన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి, బాదంను నీళ్ళలో నాన బెడితే తొక్కను తొలగించేయవచ్చు. ఇలా తినడం వల్ల స్టొమక్ యాసిడ్స్ పెరిగి, జీర్ణమయ్యే ఆహారాలను న్యూట్రీషియన్స్ గా మార్చి ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఫ్యాక్ట్ #2

ఫ్యాక్ట్ #2

నానబెట్టకున్న బాదంలను తిన్నప్పుడు రుచికూడా అంత బాగా అనిపించదు. నట్స్ ను తినడం కూడా డిపికల్ట్ గా ఉంటుంది. బాదంను సోక్ చేసిన తర్వాత బాదం పప్పు మెత్తగా అవుతుంది. అవుటర్ స్కిన్ కూడా సులభంగా తొలగించుకోవచ్చు.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

బాదంను పాలతో కలిపి తీసుకునే అలవాటు ఉన్నట్లైతే , నానబెట్టిన బాదంను మెత్తగా పొడిచేసి , లేదా నీళ్ళలో నానబెట్టిన బాదంను మెత్తగా పేస్ట్ చేసి, పాలలో కలిపి తాగాలి. నానబెట్టని బాదం పౌడర్ ను పాలలో సరిగా కలవకపోవడమే కాకుండా రుచికూడా ఉండదు.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

నానబెట్టిన బాదంను పొట్టలోని యాసిడ్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా నానబెట్టిన బాదంను ప్రతి రోజూ ఉదయం పరగడపున తినాలి. . ఇది ఎసిడిటిని మరియు యాసిడ్ రిఫ్లెక్షన్ ను నివారిస్తుంది.

ఫ్యాక్ట్ # 5

ఫ్యాక్ట్ # 5

నీళ్ళలో నానబెట్టిన బాదంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గర్భినీ మహిళలకు ఇది అత్యవసరమైన పోషకాహారం.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

బాదం పప్పు అవుటర్ స్కిన్ జింక్ మరియు ఐరన్ అబ్సార్షన్ తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడించారు.

ఫ్యాక్ట్ # 7

ఫ్యాక్ట్ # 7

బాదంను నీళ్ళలో నానబెట్టకుండా తింటే ఆరోగ్యానికి హానికరమా? ఇది కేవలం అపోహ మాత్రమే, అయితే నానబెట్టుట వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి .

బాదంను పొట్టుతో సహాయ తినడం వల్ల ఒక చిన్న ప్రయోజనం ఏంటంటే ఫైబర్ కంటెంట్ కోలన్ కు చేరి, బ్యాక్టీరియాకు ఫుడ్ లా మారి, మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

English summary

Why Are Almonds Soaked Before Eating?

Why are almonds soaked before eating? Is the soaking process necessary? Almost all of us believe that nuts should be soaked first before eating in order to get their full nutritional benefits. Is that true?
Story first published: Tuesday, February 14, 2017, 14:29 [IST]