For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప నూనె వలన కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health Organization) ప్రకారం వారానికి ఒకటి లేదా రెండు చేపలు తినడాన్ని సిఫార్సు చేస్తుంది. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండగా, మిగిలిన 70 శాతం ఖనిజాలతో,పోషకాలతో ని

|

మీకు రోజువారీగా చేపలను తినడం ఇష్టమా, అయితే చేపనూనె (ఫిష్ ఆయిల్) వలన కూడా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

చేప నూనె ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటుంది. ఇది అనేకరకాల అనారోగ్య లక్షణాలను, అనారోగ్యాలను కూడా దూరం చెయ్యగలదు. అసలు చేప నూనె అంటే ఏమిటి, ఎక్కడనుండి వస్తుంది? అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ మరియు అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health Organization) ప్రకారం వారానికి ఒకటి లేదా రెండు చేపలు తినడాన్ని సిఫార్సు చేస్తుంది. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండగా, మిగిలిన 70 శాతం ఖనిజాలతో,పోషకాలతో నిండి ఉంటుంది. కావున చేపని ఆరోగ్య ప్రదాయినిగా వ్యవహరిస్తుంటారు.

చేప నూనె అనేక సమర్ధవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బరువుని తగ్గించుటయే కాకుండా కాన్సర్ వంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

చేప నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం

1. గుండె ఆరోగ్యానికి మంచిది

1. గుండె ఆరోగ్యానికి మంచిది

గుండెపోటు ప్రపంచంలోని మరణాల ప్రధాన కారణాల్లో ఒకటి. చేప నూనెని తీస్కునే ప్రజలు ఎక్కువగా హృద్రోగం బారిన పడకుండా ఉన్నారని ఎన్నో నివేదికలు తేల్చాయి. ఈ చేప నూనె శరీరంలో కొవ్వు స్థాయిలను ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడం మూలంగా అధిక రక్తపోటుని, గుండెపోటును అడ్డుకోగలుగుతుంది.

2. అధిక బరువుని తగ్గిస్తుంది

2. అధిక బరువుని తగ్గిస్తుంది

ఊబకాయం ఇతర వ్యాధుల తీవ్రతని పెంచే ఒక ప్రమాదకరమైన వ్యాధి. గుండె జబ్బు, టైప్ 2 మధుమేహం, రక్తపోటు మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకి ప్రధాన కారణం ఈ ఊబకాయం. చేప నూనె ఈ ఊబకాయం స్థాయిని పెరగకుండా నిలువరిస్తుంది. తద్వారా అనేక రుగ్మతలకు కళ్ళెం వేస్తుంది. కావున మీరు ఉబకాయానికి గురవుతున్నారు అని అనుమానం వస్తే చేపనూనెని తీసుకోవడం మంచిది.

3. మానసిక వ్యాధులని నివారించుటలో

3. మానసిక వ్యాధులని నివారించుటలో

సాధారణంగా మెదడు పనితీరుకు కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. మరియు కొన్ని మానసిక రుగ్మతలతో ఉన్న ప్రజలు తక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటారు. చేప నూనె తీసుకోవడం ద్వారా , స్కిజోఫ్రీనియా మరియు బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధులని నివారించవచ్చు అని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి.

4.వృద్దాప్యంలో దృష్టి లోపం రాకుండా

4.వృద్దాప్యంలో దృష్టి లోపం రాకుండా

కొన్ని పరిశోధనల ప్రకారం ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు తగినంత తీసుకోని వ్యక్తులలో కంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. అంతేకాక కంటి చూపు వృద్ధాప్యంలో మందగిస్తూ ఉంటుంది , ఇది కంటికి సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది. కావున చేపనూనె తీసుకోవడం ఇప్పుడే ప్రారంభించండి.

5. నొప్పులను నివారించుటలో

5. నొప్పులను నివారించుటలో

బుద్దిమాంద్యం, మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన కలిగే నొప్పి తీవ్రతరంగా ఉంటుంది. చేప నూనెలో సహజ సిద్దంగా ఉండే నొప్పి నివారణా లక్షణాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలిగించే కొన్ని వ్యాధులను సైతం చికిత్స చేయగలదు.

6 శారీరిక, మానసిక పెరుగుదలకై

6 శారీరిక, మానసిక పెరుగుదలకై

చేప నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన , ఇది శారీరిక పెరుగుదల మరియు మానసిక అభివృద్ధికి చాలా తోడ్పాటుని ఇవ్వగలదు. గర్భధారణ సమయంలో తల్లులు తీసుకోవడం ద్వారా తమ శిశువులకి చక్కటి శరీరాకృతిని, కంటి చూపుని ఇవ్వగలరని డాక్టర్లు చెబుతున్నారు.

7. క్యాన్సర్ నివారించుటలో

7. క్యాన్సర్ నివారించుటలో

చేపనూనె లోని పోషకాలు రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు పెద్దప్రేగు కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్లను నివారించడానికి మరియు సమూలంగా కాన్సర్ కణాలను నాశనం చెయ్యడంలో సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా క్యాన్సర్ ను రాకుండా మరియు పెరగకుండా అడ్డుకోగలదు.

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

చేప నూనె తీసుకోవడం ద్వారా, వ్యాధి రోగనిరోధక శక్తి పెరగడంలో తోడ్పడుతుంది. ఇది జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి కొన్ని సాధారణ వ్యాధులను సైతం ఎదుర్కొనగలదు. చేప నూనె వినియోగం వలన జ్వరం, చర్మ వ్యాధులు మరియు అలసట తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

9. ADHD చికిత్సలో సహాయపడుతుంది

9. ADHD చికిత్సలో సహాయపడుతుంది

అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి చికిత్సను తగ్గించుటలో ఈ చేప నూనె సహాయపడుతుంది. దీనికి కారణం ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్. ఇది అధిక రక్తపోటు, డైస్లెక్సియా, ఏకాగ్రత కోల్పోవుట , భావోద్వేగ అస్థిరత మరియు సమన్వయ లోపాలతో బాధపడుతున్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది .

10.చర్మ సౌందర్యానికి

10.చర్మ సౌందర్యానికి

తామర(ring), చర్మం కమిలిపోయినట్లు మారడం, గాయాలు, దురద, మరియు దద్దుర్లు వంటి వివిధ రకాల చర్మ సమస్యలకై చేప నూనె ని తీస్కోవడానికి సిఫార్సు చేస్తారు. చేప నూనె రోజూవారీ వినియోగం వలన సాధారణ చర్మ వ్యాధులను రాకుండా అడ్డుకోవడమే కాకుండా, అందమైన చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది.

English summary

10 Awesome Health Benefits Of Fish Oil

Fish oil is obtained from the tissues of oily fish, especially cold-water fatty fish such as salmon, herring, white fish, sardines and anchovies. The health benefits of fish oil include maintaining a good heart health, promoting weight loss, improving eye health, reducing inflammation, treating mental disorders, etc.
Story first published:Saturday, March 10, 2018, 10:33 [IST]
Desktop Bottom Promotion