For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేయ వాపు వ్యాధిని దూరం చేసే 10 ఆహారపదార్ధాలు

మీరెప్పుడైనా కాలేయ వాపు వ్యాధి గురించి విన్నారా? ఇది ముఖ్యంగా కాలేయ కణాలలో అధిక శాతంలో కొవ్వు పదార్ధాలు చేరడం కారణంగా కలుగుతుంది. పర్యవసానంగా కుడివైపు పొత్తికడుపు పైభాగాన నొప్పిగా ఉండడం కాని, అసౌకర్యా

|

మీరెప్పుడైనా కాలేయ వాపు వ్యాధి గురించి విన్నారా? ఇది ముఖ్యంగా కాలేయ కణాలలో అధిక శాతంలో కొవ్వు పదార్ధాలు చేరడం కారణంగా కలుగుతుంది. పర్యవసానంగా కుడివైపు పొత్తికడుపు పైభాగాన నొప్పిగా ఉండడం కాని, అసౌకర్యానికి గురవ్వడం కాని జరుగుతుంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రాణాంతకం కూడా కావొచ్చు.

ఈ కాలేయ వాపు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి మద్యపానం కారణంగా ఆల్కహాల్ చాయలు పేరుకొనిపోవడం వలన వస్తే, మరొకటి మద్యపానానికి సంబంధం లేకుండా వస్తుంది. ఈ కాలేయవాపు వ్యాధి ఒక్కసారి వస్తే, ఇది కాలేయ పనితీరుని దెబ్బతీసి దాని వైఫల్యానికి దారి తీస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించని వారిలో కూడా సాధారణంగా వస్తూ ఉంటుంది, వారి వారి జీవన విధానాలు మరియు అలవాట్ల ప్రకారంగా.

సరైన క్రమబద్దీకరించిన పోషకాహారం కాలేయ వ్యాధి నివారణకు సరైన మందు అని నిపుణులు చెప్తున్నారు. సరైన వ్యాయామం మరియు ఆహారం కారణంగా శరీర బరువుని నియంత్రించడం వలన ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. పౌష్టికాహారం తీసుకోవడం వలన శరీరానికి లభించే పోషకాలు కాలేయంలోని కణాల నష్ట నివారణకు కృషి చేస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి అవడం ద్వారా, పొత్తికడుపు మంట కూడా నెమ్మదిగా తగ్గుతుంది.

ఈ కాలేయ వాపు వ్యాదికి గురైనవారు అవసరమైన ఆరోగ్యకర కొవ్వు పదార్ధాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, మరియు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందించుట ద్వారా నిరోధించవచ్చు. ఈ కాలేయవాపు వ్యాది నివారణకై తీసుకోవలసిన ఆహారపదార్ధాల వివరములు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

1. తృణధాన్యాలు

1. తృణధాన్యాలు

ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ మరియు బియ్యం వంటి ఆహార పదార్ధాలు ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు మరియు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండే పోషకాలు, ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వివిధ తీవ్రమైన పరిస్థితుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. గ్లైసెమిక్ సూచికలో ఈ ఆహారాలు తక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ సూచిక అనగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి ఒక కార్బోహైడ్రేట్ ఆహార సాపేక్ష సామర్థ్యాన్ని సూచించే ఒక పట్టీ. ఈ పట్టికలో ఈ ఆహారపదార్ధాలు తక్కువగా ఉంటాయి, కావున శరీరానికి ఎంత అవసరమో అంత పోషకాలను మాత్రమే అందించి కాలేయ వాపు వ్యాధి తీవ్రతను తగ్గించగలుగుతుంది.

2.కాఫీ

2.కాఫీ

కాఫీ అంటే కొందరు ప్రమాదమని, అందులో కెఫీన్ ఉంటుంది అని భయపడుతారు. కానీ కాఫీ గుండె జబ్బు రాకుండా కూడా నిరోధించగలదు అని అనేక నివేదికలు తేల్చాయి కూడా. కాఫీ కాలేయ వాపు వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. కాఫీ తీసుకున్న వారికంటే, తీసుకోని వారిలోనే ఈ కాలేయ వాపు వ్యాధి పెరిగే అవకాశo ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలలో తేలింది. కాఫీ, కాలేయ వాపు వ్యాధికి దోహదం చేసే ఎంజైముల సంఖ్యని తగ్గించడం మూలంగా ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.

3.కూరగాయలు

3.కూరగాయలు

బ్రోకోలీ, పాలకూర, కాలే(ఆకుకూరలో రకం), టమోటాలు, మరియు బెల్ పెప్పర్స్(కాప్సికంలోని రకాలు) వంటి కూరగాయలు తినడం మూలంగా శరీరానికి కాలేయానికి అవసరమైన పోషకాలను అందించగలుగుతాము. అమెరికన్ లివర్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, కాలేయ వాపు వ్యాధి నివారణకు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోనవలసినదిగా సూచిస్తుంది.

4.టోఫు

4.టోఫు

ఇది చాలామందికి తెలియని పదం. కాని మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఇది సోయా నుండి తయారుచేయబడుతుంది. టోఫు కాలేయంలో కొవ్వు శాతాన్ని తగ్గించే మరొక ఆహారం. ఇది కొవ్వుని తక్కువగా కలిగి ఉండి, ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు కాల్షియం, విటమిన్A, ఐరన్ మరియు మెగ్నీషియంతో నిండి ఉంటుంది. టోఫు తినడం కాలేయ వాపు వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా వ్యాధి చికిత్సకి తోడ్పడుతుంది.

5.చేప

5.చేప

సాల్మన్, సార్డినెస్, ట్యూనా మరియు ట్రౌట్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరమైన మేర అందినప్పుడు కాలేయ వాపు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. ఈవిధంగా కాలేయ వ్యాధి నివారణలో సహాయం చేస్తుంది.

6. పండ్లు

6. పండ్లు

వ్యాధి నిరోధక శక్తి పెరగడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా నారింజ, బొప్పాయి, బ్లూబెర్రీస్, చెర్రీస్, రాస్ప్బెర్రీస్ మరియు అవకాడో వంటి పండ్లు కాలేయాన్ని కాపాడడంలో ప్రధానంగా పనిచేస్తాయి. ముఖ్యంగా అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు పుష్కలంగా దొరుకుతాయి, తద్వారా కాలేయ వాపు నష్ట తీవ్రతని తగ్గించుటలో దోహదం చేస్తుంది.

7.unsaturated fats

7.unsaturated fats

అసంతృప్త కొవ్వు పదార్ధాలు అయిన వాల్నట్, బాదం, మరియు ఇతర డ్రైఫ్రూట్స్ గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతూ మొత్తం శారీరక ఆరోగ్య పెరుగుదలకై సహాయం చేస్తాయి. ఇవి ఎక్కువమోతాదులో ఒమేగా3 ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండడమే దీనికి ప్రధాన కారణం.

8. గ్రీన్ టీ

8. గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది ప్రధానంగా కొవ్వును కరిగించుటలో సహాయం చేస్తుంది. ఎక్కువమంది దీని రుచి కారణంగా దూరం పెడుతుంటారు. కాని కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవటానికి కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించుటలో గ్రీన్ టీ సహాయపడగలదని పరిశోధకులు తేల్చారు.

9. ఆలివ్ ఆయిల్

9. ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆరోగ్యకరమైన నూనె. ఇది అధికమోతాదులో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఆలివ్ నూనె కాలేయ వాపు కారకులైన ఎంజైములు స్థాయిని తగ్గిస్తుంది మరియు బరువును నియంత్రిస్తుంది. తద్వారా కాలేయ వాపు వ్యాధిని నివారించవచ్చని పరిశోధనలో తేలింది.

10.పొద్దుతిరుగుడు విత్తనాలు

10.పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్E అధికంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని కాపాడగల వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా గుండె, మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్E తో పాటు విటమిన్A , కాల్షియం, విటమిన్C, ఇనుము, విటమిన్ B6 మరియు మెగ్నీషియం ను కూడా కలిగి ఉంటుంది.

English summary

10 Foods To Eat For Fatty Liver Disease

Fatty liver disease is a condition that is caused by excessive fat accumulation within the liver cells. It's very important to treat a fatty liver disease with a proper diet. The foods that can prevent fatty liver disease are whole grains, vegetables, almonds, olive oil, coffee, fish, fruits, etc.
Story first published:Saturday, March 10, 2018, 17:26 [IST]
Desktop Bottom Promotion