For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాటేజి జున్ను లేదా పనీర్ యొక్క 10 ఆరోగ్య సంబంధ లాభాలు

|

దాదాపు ప్రతి రకపు భారతీయ వండే పద్ధతిలో, కాటేజి ఛీజ్ లేదా పనీర్ వాడతారు. కాటేజ్ జున్ను లేదా పనీర్ శాకాహారులకి చాలా ఫేవరెట్ పదార్థం. కాటేజి జున్ను లేదా పనీర్ ను గ్రేవీ లేదా పొడి కూరల్లో వాడతారు మరియు తీపి వంటకాలలో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు.

కేసిన్ అనే పాల ప్రొటీన్ కు, వెనిగర్ లేదా నిమ్మ వంటి యాసిడ్లతో చర్య జరిగినప్పుడు పాలు విరిగి పనీర్ ఏర్పడుతుంది. ఈ ప్రొటీన్ బాడీబిల్డర్లకి, అథ్లెట్లకి, వివిధ ఆటగాళ్ళకి చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే కెసీన్ ప్ర్రొటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది.

పనీర్ లేదా కాటేజీ జున్నులో అనేక పోషకాలైన విటమిన్ డి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, సెలీనియం మరియు జింక్ ఉంటాయి.

పనీర్ లో ఉండే అధిక ప్రొటీన్ వలన బరువు తగ్గటంలో సాయపడి, శరీరానికి కావాల్సిన కొవ్వు మరియు ప్రొటీన్ ను అందిస్తుంది.

కాటేజీ జున్ను లేదా పనీర్ యొక్క ఆరోగ్య లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది

1.బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది

కాటేజీ జున్ను లేదా పనీర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను నివారిస్తుందని ప్రసిద్ధి. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే పనీర్ లో ఉండే కాల్షియం మరియు విటమిన్ డి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయని నిరూపితమైనది, సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ మెనోపాజ్ ముందు దశలో ఉన్న స్త్రీలకి వస్తుంది.

 2.పళ్ళు మరియు ఎముకలను బలంగా మారుస్తుంది

2.పళ్ళు మరియు ఎముకలను బలంగా మారుస్తుంది

పనీర్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది రోజువారీ తీసుకోవాల్సిన కాల్షియంలో 8 శాతానికి సరిపోతుంది. కాల్షియం ఎముకలు, పళ్ళు బలపడటానికి అవసరం మరియు దీనివలన నాడీ వ్యవస్థ కూడా ఏ అవరోధాలు లేకుండా పనిచేస్తుంది మరియు గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

3.ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది

3.ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది

పనీర్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకంగా ఆవుపాల పనీర్ లో చాలా ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. 100గ్రాముల పనీర్ లో 11 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది, ఇది శాకాహారులకి చాలా మంచిది, ఎందుకంటే వారు మరే మాంసాహారం తినరు కదా!

 4.గర్భవతులకి మంచిది

4.గర్భవతులకి మంచిది

కాటేజీ జున్నులో కడుపుతో ఉన్నవారికి అద్భుతమైన పాల ఉత్పత్తిగా సరిపోయే అన్ని అవసర పోషకాలు ఉన్నాయి. కడుపుతో ఉన్నవారికి కావాల్సిన కాల్షియం మరియు ఫాస్పరస్ పనీర్ లో ఉన్నాయి, కడుపుతో ఉన్నప్పుడు ఈ పోషకాలను తీసుకోమని సూచిస్తారు కూడా.

5.బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తుంది

5.బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తుంది

పనీర్ లో ఉండే అధిక ప్రొటీన్ మీకు ఎక్కువ గంటలు ఆకలి లేకుండా చేసి, మీ జిహ్వ చాపల్యాన్ని నియంత్రణలో ఉంచుతుంది. కాటేజీ జున్నులో లినోలినిక్ యాసిడ్ ఉంటుంది, ఇది శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియలో సాయపడే ఒక ఫ్యాటీ యాసిడ్.

6.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

6.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

కాటేజీ జున్నులో మెగ్నీషియం ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరస్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది. పనీర్ లో ఉండే ప్రొటీన్ చక్కెరను నియంత్రించి మరియు రక్తంలో చక్కరస్థాయిలను పెరగకుండా చూస్తుంది.

7.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

7.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కాటేజీ జున్ను అజీర్తిని నివారిస్తుంది. ఇందులో ఉండే ఎక్కువ ఫాస్పరస్ జీర్ణక్రియకి, విసర్జనకి సాయపడుతుంది. అందులో ఉండే మెగ్నీషియం జారుడు ప్రభావంతో మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

8.అన్నిరకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి

8.అన్నిరకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి

కాటేజీ జున్ను లేదా పనీర్ లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి, ఇవి శరీరంలో వివిధ పనులకి సాయపడతాయి. బి కాంప్లెక్స్ విటమిన్లలో విటమిన్ బి12, థయామిన్, నియాసిన్,ఫోలేట్, రిబోఫ్లేవిన్ మరియు పాంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి.

9.గుండె ఆరోగ్యానికి మంచిది

9.గుండె ఆరోగ్యానికి మంచిది

పనీర్ లో ఉండే పొటాషియం, శరీరంలో ద్రవపదార్థాల సమతుల్యతను ఉంచుతుంది. పొటాషియం రక్తంలోని అధిక సోడియం ప్రభావాలను కూడా తగ్గిస్తుంది కాబట్టి, అది రక్తపోటును తగ్గించి, రక్తనాళాలు కుచించకుండా చేస్తుంది.

10.ఫోలేట్ ఎక్కువగా ఉండే పదార్థం

10.ఫోలేట్ ఎక్కువగా ఉండే పదార్థం

కాటేజి జున్నులో ఉండే ఫోలేట్ అనే ఒక బి కాంప్లెక్స్ విటమిన్ కడుపుతో ఉన్న స్త్రీలకి చాలా అవసరం. ఫోలేట్ పిండం ఎదగటానికి సాయపడే ఒక ముఖ్య విటమిన్, మరియు ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

English summary

10 Health Benefits Of Cottage Cheese Or Paneer

Paneer is formed when casein, a milk protein reacts to acids like vinegar or lime and coagulates. This protein is excellent for body-builders, athletes and various sports enthusiasts because casein is a protein which is digested slowly. The high protein content in cottage cheese helps in weight loss and provides the body with fat and protein.
Desktop Bottom Promotion