For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ చేపలు తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య-ప్రయోజనాలు

ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో "చేపలు" అనేవి ఒకటి. చేపలలో ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండడంతో పాటు; ఐరన్, జి

|

ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో "చేపలు" అనేవి ఒకటి. చేపలలో ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండడంతో పాటు; ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు గొప్ప మూల పదార్థంగా కూడా ఉన్నది.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వంటి ముఖ్యమైన పోషక పదార్ధాలను కలిగి ఉన్న వాటిలో చేపలు కూడా ఒకటి. మీరు సన్నని శరీరంతో ఉండటానికి మరియు మీ శరీరం వృద్ధి చెందుటలో సహాయం చెయ్యటానికి మరియు మీ జ్ఞానశక్తి పనితీరును మరింతగా మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది.

మీ నడుం చుట్టూ కొవ్వుతో నిండి ఉన్న ప్రాంతాన్ని మాత్రమే ప్రభావితం చెయ్యకుండా, మానవుని ఇంద్రియాలలో భాగమైన కాలేయం, మెదడు, మొదలైనవి వృద్ధి చెందే విధంగానూ, మరియు మీ నిద్రను నియంత్రించేదిగా ఉండటంతో పాటు, ఇతర శరీర విధులను సక్రమంగా నిర్వర్తించడంలో సహాయపడుతుంది. రోజువారీ చేపలను తినటం వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవచ్చు.

<strong>చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు</strong>చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

1. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

చేపలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల, హృదయ సంబంధమైన వ్యాధుల ప్రమాదాల భారీ నుండి మరియు ఇతర ప్రాణాంతకమైన ప్రమాదాల ప్రభావాల ముప్పును తగ్గిస్తుంది. ఈ సముద్రపు ఆహారంలో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే 'ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను' కలిగి ఉంటుంది, ఇది వాపులను (బాధలను) తగ్గిస్తుంది, అలానే మీ గుండెను రక్షించడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.

2. అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది :

2. అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది :

మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలతో నిండిన శక్తిని, చేపలు అందజేస్తాయి. నిత్యం చేపలను తినేవారి విషయంలో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించటంలోనూ సహాయపడుతుంది. అలాగే, ప్రతిరోజూ చేపలను తినే వారి విషయంలో, మెదడు పనితీరుకు సంబంధించిన సమస్యలకు దారితీసే ప్రతికూల పరిస్థితులను తగ్గించడంలోనూ మరియు మెదడు యొక్క పని తీరును క్షీణింప బడే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

3. డిప్రెషన్ను తగ్గిస్తుంది :

3. డిప్రెషన్ను తగ్గిస్తుంది :

చేపలను ఆమె అమితంగా ఇష్టపడే వారికి ఇది నిజంగా చాలా మంచి వార్త. మీరు ఆందోళనను కలిగి ఉన్న లక్షణాలను గుర్తించినట్లయితే, చేపలను తినడానికి ప్రయత్నించండి. అవును, చేప (లేదా) చేప నూనె డిప్రెషన్ యొక్క లక్షణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది డిప్రెషన్ యొక్క లక్షణాలను తగ్గిస్తుంది, ఆ కారణం చేత మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4. విటమిన్-D సమృద్ధిగా దొరుకుతుంది :

4. విటమిన్-D సమృద్ధిగా దొరుకుతుంది :

విటమిన్-D అనేది చేపలలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది మరియు ఈ ముఖ్యమైన పోషక పదార్ధానికి - చేపలు ఉత్తమమైన ఆహార వనరులలో ఒకటిగా పరిగణించబడుతున్నది. ఎముక ఆరోగ్యం కోసం క్యాల్షియంను సంగ్రహించడానికి మరియు ఎముకల పెరుగుదల కోసం విటమిన్-D అనేది చాలా అవసరం. విటమిన్ D లోపం కారణంగా ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించుకోడానికి, క్రమం తప్పకుండా చేపలను తినడం.

<strong>చేప ముల్లుని పొరపాటున మింగితే చనిపోతారా?</strong>చేప ముల్లుని పొరపాటున మింగితే చనిపోతారా?

5. కంటి చూపును మెరుగుపరుస్తుంది :

5. కంటి చూపును మెరుగుపరుస్తుంది :

చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మరియు కంటి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల కారణంగా మీ మెదడు మరియు కళ్ళు ఎక్కువగా ఏకాగ్రతను కలిగి ఉండి, వాటి పూర్తి ఆరోగ్యానికి మరియు వాటి పనితీరు నిర్వహణకు ఈ ఆమ్లాలు చాలా అవసరం.

6. మీరు నిద్రకు సహకరిస్తుంది :

6. మీరు నిద్రకు సహకరిస్తుంది :

మీకు నిద్రపట్టక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారా అయితే క్రమం తప్పకుండా చేపలను తినండి, దాని వల్ల వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక అధ్యయనం ప్రకారం, చేపల వినియోగం పెంచిన చాలామంది ప్రజలు మెరుగైన / నాణ్యమైన నిద్రను పొందుతున్నారనే కొత్త విషయం బయట పడినది. అలాగే ఇది విటమిన్ D యొక్క అధిక స్థాయిల కారణంగా, ఇది మంచి నిద్రను అందించుటలో సహాయపడుతుంది.

7. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది :

7. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది :

మీరు గానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గాని అయితే, మీరు రోజువారీ చేపలను తినడమే మంచి మార్గం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల వాతముల యొక్క దీర్ఘకాలిక మంటకు కారణం కాగా, దాని నుండి పూర్తి ఉపశమనం కోసం రెగ్యులర్గా చేపలను తినడం వల్ల, మీరు ఎదుర్కొంటున్న వాపులు మరియు నొప్పుల నియంత్రణకు సహాయపడుతుంది.

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

చేపలు శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరంలో LDL (చెడ్డ) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేపలు కలిగి ఉన్నవి. కావున ఈ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు - శరీరంలో పేరుకుపోయి ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి మరియు శరీరంలో ఏర్పడే చెడ్డ కొలెస్ట్రాల్ ను నిరోధించేవిగా సహాయపడుతున్నాయి.

9. రోగనిరోధకత పెరిగి - వ్యాధులను తగ్గిస్తుంది :

9. రోగనిరోధకత పెరిగి - వ్యాధులను తగ్గిస్తుంది :

ఒక పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజువారీ కొవ్వు చేపలను తినడం వల్ల, మొదటిరకం డయాబెటిస్ కు కారణమైన వ్యాధి కారకాలను నిరోధించడానికి అవసరమైన రోగ నిరోధకతను పెంపొందించడంలో సహాయపడుతుంది. చేపలలో అధిక స్థాయిలో గుర్తించబడిన విటమిన్-D వల్ల శరీరంలో ఉన్న గ్లూకోజును బాగా జీవనం చేసిన తర్వాత, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

10. PMS లక్షణాలు నిరోధిస్తుంది :

10. PMS లక్షణాలు నిరోధిస్తుంది :

మహిళల్లో బహిష్టు తొందరగా అయ్యే లక్షణాలను నిరోధించటంలో - చేపలు కూడా సహాయపడతాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. నిర్వహించబడిన ఒక అధ్యయనం ప్రకారం, తొందరగా బహిష్టులకు గురవుతున్న మహిళలు క్రమం తప్పకుండా వారి ఆహారంలో చేపలను కలిగి ఉండాలి. చేపలలో ఉన్న "ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు" త్వరగా సంభవించే బహిష్టు లక్షణాలను నిరోధిస్తాయి.

English summary

10 Health Benefits Of Eating Fish Daily

Fish is also one of the best sources of essential nutrients like omega-3 fatty acids. These help keep your body lean and are also important for your brain and cognitive functioning. Fish not only impacts your waistline, but also helps in other bodily functions, including the liver, brain and even your sleep.
Story first published:Wednesday, January 3, 2018, 12:08 [IST]
Desktop Bottom Promotion