జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

నానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదంపప్పులను నీటిలో నానబెట్టినపుడు, పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు దాని నుంచి అందుతాయి.

కడుపుతో ఉన్నప్పుడు మంచిది

కడుపుతో ఉన్నప్పుడు మంచిది

మీరు కడుపుతో ఉన్నవారైతే, మీ డైట్ లో తప్పక బాదంలను జతచేసుకోండి, ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నానబెట్టిన బాదంపప్పులు తల్లికి, బిడ్డకి అన్నిటికన్నా ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి. అంతేకాక బాదంపప్పులలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

డాక్టర్లు 4 నుంచి 6 బాదంపప్పులు రోజూ తినటం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి, కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని, పొద్దున్నే బాదం తినటం వలన మీ జ్ఞాపకశక్తి చురుకుగా మారి, మెదడు పనితీరు మెరుగవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

నానబెట్టిన బాదంపప్పుల వలన కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం తగ్గుతుంది. వీటిల్లో మోనోసాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి అవి శరీరంలోని చెడ్డ కొవ్వులను కరిగిస్తాయి. బాదంలలో ఉండే విటమిన్ ఇ రక్తప్రవాహంలోని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

గుండెకి మంచిది

గుండెకి మంచిది

నానబెట్టిన బాదంపప్పులలో ప్రొటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, తీవ్ర ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడటంలో సాయపడతాయి.

రక్తపోటును మెరుగుపరుస్తాయి

రక్తపోటును మెరుగుపరుస్తాయి

మీకు తెలుసా నానబెట్టిన బాదంపప్పు అధిక రక్తపోటును నయం చేస్తాయని? నానబెట్టిన బాదంపప్పుల్లో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చూస్తాయి. వాటిల్లో ఫోలిక్ యాసిడ్ మరియు మెగ్నీషియం ఉండి రక్తనాళాలు నిండిపోకుండా ఆ రిస్క్ ను తగ్గిస్తాయి.

బరువు తగ్గటంలో సాయపడతాయి

బరువు తగ్గటంలో సాయపడతాయి

మీ మొండి పొట్ట కొవ్వును కరిగించటానికి నానబెట్టిన బాదంలను మీ డైట్ లో జతచేసుకోండి. నానబెట్టిన బాదంపప్పులు పై తొక్కు తీసేయటం వలన బరువు తగ్గటం వేగతరం చేస్తాయి. నానబెట్టిన బాదంలలో మోనోసాచ్యురేటడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉంచుతాయి.

మలబద్ధకాన్ని నయం చేస్తుంది

మలబద్ధకాన్ని నయం చేస్తుంది

నానబెట్టిన బాదంపప్పులు తినటం వలన దీర్ఘకాలంగా ఉండే మలబద్ధకం నయం కావచ్చు. నానబెట్టిన బాదంలలో కరగని పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి మీ శరీరంలో ఎక్కువ జీర్ణమవకుండా సాఫీగా విరేచనం అయ్యేలా చూసి మీ మలబద్ధకం తగ్గిపోయేలా చేస్తాయి.

మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

ప్రముఖ అధ్యయనం ప్రకారం, నానబెట్టిన బాదంపప్పులు ప్రీబయాటిక్ ప్రభావం కలిగి ఉండి, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రీబయాటిక్ మీ ఆహారనాళంలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదపడుతుంది మరియు దాని ఫలితంగా, అనేక వ్యాధులను నివారించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేయటం లేదా నివారిస్తుంది

వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేయటం లేదా నివారిస్తుంది

మీ చర్మంపై ముడతలు తొలగించుకోటానికి వాడే వస్తువులను, ఉత్పత్తులను బయట పారేయండి. వాటి బదులు, నానబెట్టిన బాదంపప్పులు తినండి, ఇవి సహజంగా వయస్సు మీరకుండా చూసే ఆహారంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ పొద్దున నానబెట్టిన బాదంపప్పులు తిని మీ చర్మాన్ని గట్టిగా,ముడతలు లేకుండా చేసుకోండి.

Read more about: almond health benefits skin heart digestion pregnancy brain cholesterol weight loss constipation బాదం ఆరోగ్య ప్రయోజనాలు కొలెస్ట్రాల్ బరువు తగ్గుట మలబద్దకం
English summary

10 Health Benefits Of Eating Soaked Almonds In The Morning

Almonds are high in nutritional content with a wide range of vital vitamins and minerals. Nutritionists say that eating soaked almonds is much healthier than eating the raw ones. It is because soaking almonds in water overnight removes toxic materials present in its coating, releases phytic acid and decomposes its gluten content.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X