For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఆరోగ్యాన్ని ముల్బెర్రీస్ పళ్ళు ఏ విధంగా సంరక్షిస్తాయో మీరు తెలుసుకోండి !

|

ప్రపంచంలోని వివిధ రకాల ఉష్ణోగ్రతల వద్ద పెంచబడుతున్న తీపి పళ్ళే ఈ ముల్బెర్రీస్. ఈ పండ్లు ప్రత్యేకమైన రుచిని, పోషకాలతో ఆకట్టుకోవడం వల్ల దీనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ముల్బెర్రీస్ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి కూడా.

ఈ ముల్బెర్రీస్ను సాధారణంగా వైన్, టీ, జామ్, జ్యూస్ (లేదా) నిల్వ చేయబడే ఆహారాలుగా ఉండే పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండ్లను బాగా ఎండబెట్టి, అల్పాహారంగా కూడా ఉపయోగిస్తారు. ముల్బెర్రీస్ అనేవి నలుపు, ఎరుపు, తెలుపు వంటి అనేక రంగులలో మనకు లభిస్తాయి.

10 Health Benefits Of Organic Mulberries

ఒక కప్పు తాజా ముల్బెర్రీస్ 88% నీటిని కలిగి ఉంటాయి, అలాగే 60% కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. వారు 9.8% కార్బోహైడ్రేట్లను, 1.4% ప్రోటీన్లను, 1.7% ఫైబర్ను చివరిగా 0.4% కొవ్వులను కలిగి ఉంటాయి.

బాగా ఎండ బెట్టిన ముల్బెర్రీస్లో, 14% ఫైబర్, 70% పిండి పదార్థాలను, 3% కొవ్వును కలిగి ఉంటాయి.

సేంద్రీయమైన ముల్బెర్రీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి మనము ఇప్పుడు పరిశీలిద్దాం !

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి :

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి :

ముల్బెర్రీస్ అనేవి మలబద్ధకం నుంచి మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. వీటిలో ఫైబర్ను అనేది పుష్కలంగా కలిగి ఉంటుంది, ఈ ఫైబర్ మన శరీరం సంగ్రహించిన ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయటంలో బాగా సహాయపడుతుంది. ఈ ముల్బెర్రీస్ను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం జీర్ణ సమస్యల నుంచి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది :

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది :

ముల్బెర్రీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇవి 2 రకం డయాబెటిస్ను నివారించేందుకు ఉపయోగించే ఔషధాలలో ఉండే కొన్ని సమానమైన రసాయనాలను ఇవి కలిగి ఉన్నాయి.

3. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :

3. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :

ప్రతిరోజు ముల్బెర్రీస్ తినడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది, అందువలన మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

4. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

4. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

ముల్బెర్రీస్, యాంటీఆక్సిడెంట్స్, ఫైటో-ట్యూయురెంట్స్ను పుష్కలంగా కలిగి ఉంటాయి, ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు, వాటి వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో ఆంథోసియనిన్స్ అనే లక్షణాలను కలిగి ఉండటం వల్ల, శరీరంలో ఈ ముల్బెర్రీస్ వున్న చోట క్యాన్సర్ కణాలనేవి ఉత్పత్తి కావు.

5. రక్తహీనతని నయం చేస్తుంది :

5. రక్తహీనతని నయం చేస్తుంది :

ముల్బెర్రీస్లో ఐరన్ అనేది చాలా పెద్ద మొత్తంలో మనకు లభిస్తాయి, ఇది రక్తహీనతని నివారించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లు కూడా మైకము, అలసట వంటి రక్తహీనత లక్షణాలను పూర్తిగా నయం చేస్తాయి.

6. బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తాయి :

6. బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తాయి :

ఈ ముల్బెర్రీస్ రక్త ప్రవాహాన్ని, రక్తపోటును నియంత్రిస్తాయి అలాగే, రక్తమును శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి. ఈ ముల్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.

7. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది :

7. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది :

ఈ ముల్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఫ్లేవోనోయిడ్ వంటి గుణాలు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ ముల్బెర్రీస్, స్థిరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడంలో సహాయం చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ వంటి వాటిని నిరోధిస్తుంది.

8. కంటిచూపుకు మంచిది :

8. కంటిచూపుకు మంచిది :

ఈ ముల్బెర్రీస్, శరీరమును స్వేచ్ఛగా తిరిగే రాడికల్స్ నుంచి మీ కళ్ళను రక్షించి మీ కంటి చూపును పెంచుతాయి. ఈ రాడికల్స్ వల్ల మీ కంటి రెటినల్ను క్షీణింపజేసి మీ కంటిచూపుకు నష్టాన్ని కలిగిస్తాయి. ముల్బెర్రీస్లో జీజెసాన్తిన్ అనే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కంటి కణాలలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

9. మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది :

9. మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది :

ఈ పళ్ళు మీ మెదడుకు చాలా మంచిదని, అవి మీ మెదడుకి అలర్ట్నేస్ను పెంచుతోందని చాలా పరిశోధనలలో తెలియజేయబడింది. ఈ పళ్లలో ఉండే క్యాల్షియం - మీ మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచటంలో సహాయపడతాయి. ఈ ముల్బెర్రీస్ కూడా అల్జీమర్స్ వ్యాధిని మీకు చాలా దూరంగా ఉంచుతుంది.

10. ఎముకల కణజాలాన్ని నిర్మిస్తుంది :

10. ఎముకల కణజాలాన్ని నిర్మిస్తుంది :

ఈ ముల్బెర్రీస్ - కాల్షియం, ఐరన్, విటమిన్ K లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి బలమైన ఎముకల కణజాలాలను నిర్మించి, వాటిని బాగా సంరక్షించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు ఎముకల క్షీణతను, బోలు ఎముకల వ్యాధిని, కీళ్ళనొప్పుల వంటి ఎముకల లోపాలను నివారిస్తాయి.

English summary

10 Health Benefits Of Organic Mulberries

Mulberries are most commonly made into wine, tea, jam, fruit juice or canned foods. The fruits can also be dried and consumed as a snack. Mulberries contain 88 percent of water and contain only 60 calories. The health benefits of mulberries are improving digestive health, controlling blood sugar, lowering cholesterol, curing anaemia,etc.
Story first published:Monday, March 26, 2018, 13:15 [IST]
Desktop Bottom Promotion