For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిలాపియా ఫిష్ ద్వారా కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

|

టిలాపియా ఫిష్ అనేది కొలనులలో, నదులలో, సరస్సులలో అలాగే లోతైన ప్రవాహాలలో నివసించే మంచినీటి చేప. ఈ చేప అత్యంత రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది చౌకగా లభిస్తుంది కూడా. తేలికపాటి ఫ్లేవర్ కలిగిన ఈ ఫిష్ అనేది ఇండియాలో చాలా ప్రముఖమైనది. ఈ చేప అంటే ఎంతో మందికి చాలా ఇష్టం.

చైనా అనేది టిలాపియా ఫిష్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమని మీకు తెలుసా? దాదాపు 135 దేశాలలో టిలాపియా చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. ఫార్మింగ్ కి అనువైన ఫిష్ ఇది.

టిలాపియా చేపలతో నాలుగు రకాలున్నాయి. మొజాంబిక్ టిలాపియా, బ్లూ టిలాపియా, రెడ్ టిలాపియా మరియు నైల్ టిలాపియా అనేవి నాలుగు రకాల టిలాపియా చేపలు. ఈ చేపలతో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. కేలరీలు తక్కువగా లభిస్తాయి. అలాగే, విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, కేల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, విటమిన్ ఈ, నియాసిన్, ఫోలేట్, విటమిన్ బి12 మరియు పాంటోథెనిక్ యాసిడ్ ఈ టిలాపియా ఫిష్ లో లభిస్తాయి.


ఇప్పుడు టిలాపియా చేపని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది:

1. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది:

ఎముకల ఎదుగుదలకు అవసరమయ్యే కేల్షియంతో పాటు ఫాస్ఫరస్, టిలాపియా చేపలో సమృద్ధిగా లభిస్తుంది. అలాగే, బోన్ సెల్ పునరుత్పత్తికి కూడా ఈ చేప అమితంగా సహాయపడుతుంది. అందువలన, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చేపలో లభించే పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

2. క్యాన్సర్ ని అరికడుతుంది:

2. క్యాన్సర్ ని అరికడుతుంది:

టిలాపియా ఫిష్ లో సెలీనియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కలవు. ఇవి క్యాన్సర్ పై పోరాటం జరుపుతాయి. అదే సమయంలో గుండెకి సంబంధించిన వ్యాధులను అరికడతాయి. సెలీనియం అనేది శరీరంలో జరిగే ఫ్రీ రాడికల్ యాక్టివిటీని తగ్గిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన సెల్స్ అనేవి హానికరమైన క్యాన్సరస్ సెల్స్ లా మారకుండా అడ్డుకుంటుంది.

3. మెదడుకు మంచిది:

3. మెదడుకు మంచిది:

టిలాపియా ఫిష్ ను ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడు యొక్క పనితనాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి న్యూరలాజికల్ ఫంక్షన్ ని పెంపొందిస్తాయి. అలాగే, ఈ ఫిష్ లో సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇది మెదడును అల్జీమర్స్, పార్కిన్సన్ అలాగే ఎపిలెప్సీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

4. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది:

4. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది:

టిలాపియా ఫిష్ మీ గుండెని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వైల్డ్ టిలాపియా ఫిష్ లో ఎక్కువ మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించి హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని, స్ట్రోక్స్ ని అలాగే అథెరోకలేరాసిస్ ని అరికడతాయి.

5. ఏజింగ్ ని అడ్డుకుంటుంది:

5. ఏజింగ్ ని అడ్డుకుంటుంది:

టిలాపియా ఫిష్ లో విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. తద్వారా, మీ కాంప్లెక్షన్ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మసమస్యలు తలెత్తవు. స్కిన్ సెల్స్ ఎప్పటికీ యాక్టివ్ గా అలాగే యవ్వనంగా ఉంటాయి.

6. బరువును తగ్గిస్తుంది:

6. బరువును తగ్గిస్తుంది:

టిలాపియా ఫిష్ బరువును తగ్గేందుకు తోడ్పడుతుంది. ఈ ఫిష్ లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అదే సమయంలో కేలరీలు తక్కువగా లభిస్తాయి. తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్లు అందుకోవడం ద్వారా అధిక బరువు సమస్య వేధించదు. అలాగే, మీ శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. షేప్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికీ టిలాపియా ఫిష్ అనేది వరం వంటిది.

7. థైరాయిడ్ పేషంట్స్ కోసం:

7. థైరాయిడ్ పేషంట్స్ కోసం:

సెలీనియం అనేది టిలాపియా ఫిష్ లో లభిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్స్ ని రెగ్యులేట్ చేసేందుకు ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, హార్మోన్ల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ గ్లాండ్స్ పనితీరు సవ్యంగా ఉంటే మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. తద్వారా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటారు.

8. ఎదుగుదల అలాగే అభివృద్ధికి:

8. ఎదుగుదల అలాగే అభివృద్ధికి:

టిలాపియా ఫిష్ లో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. మీకు రోజుకి అవసరమైనదాని కంటే 15 శాతం ఎక్కువగా ప్రోటీన్ టిలాపియా ఫిష్ ద్వారా లభిస్తుంది. సరైన ఎదుగుదలకు అలాగే అవయవాల వృద్ధికి, మెంబ్రేన్స్, సెల్స్ మరియు కండరాలకై తగినంత ప్రోటీన్ అవసరపడుతుంది. కండరాల రిపైర్ కి అలాగే సరైన మెటబాలిక్ యాక్టివిటీకి కూడా ప్రోటీన్ అవసరం ఏర్పడుతుంది.

9. బాడీ బిల్డర్స్ కోసం:

9. బాడీ బిల్డర్స్ కోసం:

టిలాపియా ఫిష్ లో ప్రోటీన్ తో పాటు విటమిన్స్ మరియు మినరల్స్ లభిస్తాయి. ఇవి బాడీని బిల్డ్ చేయాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలను బిల్డ్ చేయడానికి బాడీ బిల్డర్స్ కి తగిన మోతాదులో ప్రోటీన్ అవసరమవుతుంది. టిలాపియా ఫిష్ ని తీసుకోవడం ద్వారా బాడీ బిల్డర్స్ తమ గోల్ ని రీచ్ అవుతారు.

10. కాగ్నిటివ్ ఫంక్షన్ కోసం:

10. కాగ్నిటివ్ ఫంక్షన్ కోసం:

టిలాపియా ఫిష్ లో విటమిన్ బి12 లభిస్తుంది. ఈ ముఖ్యమైన విటమిన్ వలన కాగ్నిటివ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ సరైన విధంగా ఫార్మ్ అవడానికి తోడ్పడుతుంది. ఇందులో 2.4 గ్రాముల విటమిన్ బి12 లభిస్తుంది. ఇది శరీరం తన పనులను నిర్వర్తించడానికి అవసరమయ్యే సరైన మోతాదు. కాబట్టి, ఈ ఫిష్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే, మీ ప్రియమైనవారితో ఈ ఆర్టికల్ ని షేర్ చేసుకోండి.

English summary

10 Health Benefits Of Tilapia Fish

10 Health Benefits Of Tilapia Fish,In India, tilapia fish is very popular and many people love tilapia because it is full of nutrients. Know about the 10 health benefits of tilapia fish.
Story first published:Saturday, February 3, 2018, 13:20 [IST]
Desktop Bottom Promotion