For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోషకాలను శరీరం గ్రహించటం లేదని తెలిపే పది సైన్స్

|

శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ ను చదివితే పోషకాల గ్రహింపు తక్కువగా ఉన్న సూచనలను అర్థం చేసుకోవచ్చు.

మనం తీసుకునే ఆహారంలోంచి పోషకాలను గ్రహించడం చిన్న ప్రేగు బాధ్యత. చిన్న ప్రేగు కొన్ని రకాల పోషకాలని అలాగే ద్రవాలను సరిగ్గా గ్రహించకపోతే మీరు మాల్ అబ్సర్ప్షన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది.

ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ కలిగిన మాక్రో న్యూట్రియెంట్స్ అలాగే విటమిన్స్ మరియు మినరల్స్ కలిగిన మైక్రో న్యూట్రియెంట్స్ గా న్యూట్రియెంట్స్ ను క్లాసిఫై చేసుకోవచ్చు.

ఈ మాల్ అబ్సర్ప్షన్ సిండ్రోమ్ కి దారి తీసే అంశాలు చాలా ఉన్నాయి. ప్రేగులకు ఇన్ఫెక్షన్ సోకడం, ఇంఫ్లేమేషన్ లేదా సర్జరీ, యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం, కోలిక్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్, ల్యాక్టోస్ ఇంటాలారెంట్, గాల్ బ్లాడర్ డిసీస్, పారాసిటిక్ డిసీస్ లు కూడా కారణం కావచ్చు.

కాబట్టి, పోషకాల గ్రహణ తక్కువగా ఉందని తెలిపే ఈ సైన్స్ ను మీరు గమనించి తీరాలి.

1. గుండె దడ:

1. గుండె దడ:

ఐరన్ లోపం వలన గుండె దడ సమస్య తలెత్తుతుంది. గుండె దడగా అనిపించినా హార్ట్ బీట్ స్కిప్ అయినట్టు అనిపించినా హార్ట్ పాలిపిటేషన్ సమస్యని మీరు గుర్తించాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోవడం తగ్గినప్పుడు అబ్నార్మల్ హార్ట్ బీట్స్ లేదా హార్ట్ పాల్పిటేషన్ సమస్య తలెత్తుతుంది.

2. డైజెస్టివ్ డిజార్డర్:

2. డైజెస్టివ్ డిజార్డర్:

డైజెస్టివ్ డిజార్డర్ వలన శరీరం పోషకాలను గ్రహించలేదు. ఆహారం నుంచి పోషకాలను గ్రహించే సామర్థ్యం కోల్పోతుంది. పోషకాహార లోపం తలెత్తినప్పుడు శరీరం సరిగ్గా పనిచేయదు. ప్రత్యేకించి వర్క్ హావర్స్ లో అలాగే సోషల్ గ్యాతెరింగ్స్ లో అలసటగా అనిపిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు, ఆహారం నుంచి పోషకాలను గ్రహించలేదు.

3. చిట్లిన గోర్లు:

3. చిట్లిన గోర్లు:

పోషకాలు సరిగ్గా అందకపోతే గోర్లు చిట్లిపోతాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవటం వలన శరీరానికి ప్రొటీన్ల లోపం తలెత్తుతుంది. గోర్లను నరిష్ చేసేందుకు అవసరమైన ప్రోటీన్లను శరీరం పంపించలేదు. కాబట్టి, మీట్, లెజ్యుమ్స్, క్వినోవా మరియు ఫిష్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.

4. స్టూల్ అఫియరెన్స్ లో మార్పులు:

4. స్టూల్ అఫియరెన్స్ లో మార్పులు:

మీ శరీరం ఏ విధంగా పోషకాలను గ్రహిస్తుందో స్టూల్ ద్వారా గమనించవచ్చు. డయారియా లేదా లూజ్ స్టూల్స్ అనేవి పోషకాహార లోపాన్ని ఇండికేట్ చేస్తాయి. స్టూల్ అఫియరెన్స్ లో ఏవైనా మార్పులు కనిపిస్తే మీరు వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

5. హెయిర్ లాస్:

5. హెయిర్ లాస్:

మాల్ అబ్సర్ప్షన్ సిండ్రోమ్ వలన బ్రిటిల్ మరియు డ్రై హెయిర్ సమస్య వేధిస్తుంది. హెయిర్ లాస్ కి కూడా ఈ సమస్య దారితీయవచ్చు. పోషకాల గ్రహింపు తక్కువగా ఉందనడానికి ఇది ఒక ముఖ్య సంకేతం. ఇటువంటి హెయిర్ లాస్ ప్రాబ్లెమ్ ను మీరు ఎదుర్కొంటే మీ డైట్ ను మార్చుకోండి. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోండి.

6. నంబ్ నెస్ మరియు టింగ్లింగ్ సెన్సేషన్:

6. నంబ్ నెస్ మరియు టింగ్లింగ్ సెన్సేషన్:

నంబ్ నెస్ మరియు టింగ్లింగ్ సెన్సేషన్ ను మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే పోషకాహార లోపం వలన ఈ సమస్య మీకు ఎదురై ఉండవచ్చు. విటమిన్ బి 12 లోపం తలెత్తినప్పుడు నంబ్ నెస్ మరియు టింగ్లింగ్ సెన్సేషన్ తలెత్తుతుంది. యానిమల్ ప్రోటీన్ కలిగిన లివర్ లేదా విటమిన్ సప్లిమెంట్ ను తీసుకోండి.

7. అలసట:

7. అలసట:

మీ శరీరంలో మేగ్నేషియం మరియు ఐరన్ లోపం తలెత్తితే విపరీతమైన అలసట అలాగే డిజ్జీనెస్ ను మీరు గమనిస్తారు. శరీరం తగినంత ఐరన్ ను గ్రహించలేకపోతే అనీమియా వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీని వలన మీ ఎనర్జీపై అలాగే మూడ్ పై ప్రభావం ఉంటుంది.

8. బ్లోటింగ్ మరియు స్వేల్లింగ్:

8. బ్లోటింగ్ మరియు స్వేల్లింగ్:

పోషకాల లోపం వలన బ్లోటింగ్ మరియు స్వేల్లింగ్ సమస్య ఎదురవుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోకపోవటం వలన కాళ్లలో వాపును మీరు గమనించవచ్చు. అలాగే పోషకాహార లోపం వలన పొత్తికడుపులో అసౌకర్యం తో పాటు క్రామ్పింగ్ సమస్య ఎదురవుతుంది.

9. సరైన ఫుడ్ కాంబినేషన్స్ ని తీసుకోకపోవటం:

9. సరైన ఫుడ్ కాంబినేషన్స్ ని తీసుకోకపోవటం:

కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ అనేవి పోషకాల గ్రహింపుని పెంపొందిస్తాయి. ఉదాహరణకు, కేల్షియం రిచ్ ఫుడ్స్ ను విటమిన్ డి ఫుడ్స్ తో కంబైన్ చేస్తే శరీరం చక్కగా పోషకాలను గ్రహిస్తుంది. విటమిన్ డి తో కూడి కేల్షియం బోన్స్ లోకి అబ్సర్బ్ అవుతుంది.

10. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ:

10. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ:

నెలసరిని మిస్ అవుతున్నారా? అంటే, మీరు తగిన పోషకాలను తీసుకోవటం లేదన్నమాట. రోజూ తగిన విధంగా పోషకాలను అలాగే కేలరీలను తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, లెజ్యుమ్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ను తీసుకోవాలి.

English summary

10 Signs Of Poor Nutrient Absorption

The small intestine's role is to absorb nutrients from the food you eat and pass it into your bloodstream. If your small intestine can't absorb enough of certain nutrients and fluids, you may suffer from a malabsorption syndrome. The signs of poor nutrition are menstrual irregularity, heart palpitations, poor digestive system, hair loss, etc..
Story first published:Thursday, March 29, 2018, 18:06 [IST]
Desktop Bottom Promotion