For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కలిగే 10 ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు?

పెరుగుని అనేకమంది ఇష్టపడతారు. ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన పాల ఉత్పత్తి. తాజా పెరుగులో శక్తివంతమైన ప్రోటీన్లు కలవు. పెరుగు ద్వారా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని అనేక రకాలుగా తినవచ్చు.

|
health benefits of yogurt in the morning,

పెరుగుని అనేకమంది ఇష్టపడతారు. ఇతి అత్యంత ప్రసిద్ధి చెందిన పాల ఉత్పత్తి. తాజా పెరుగులో శక్తివంతమైన ప్రోటీన్లు కలవు. పెరుగు ద్వారా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని అనేక రకాలుగా తినవచ్చు.

పండ్లతో కలిపి అలాగే స్మూతీలుగా చేసుకుని లేదంటే వంటకాలలో కలుపుకుని పెరుగుని తీసుకోవచ్చు. వంటకం ఏదైనా పెరుగనేది తన ఫ్లేవర్ ని అద్ది ఆ వంటకాన్ని మరింత రుచికరంగా మార్చుతుంది.

పాల నుంచి పెరుగు తయారవుతుంది. ఇందులో పొటాషియం, కేల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి2 మరియు విటమిన్ బి12 వంటి వివిధ రకాలైన పోషకవిలువలు కలవు. ఇది అత్యంత పోషకమైనది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేకరాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ లో పెరుగుని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కంటే ముందుగానీ లేదా బ్రేక్ ఫాస్ట్ తరువాత గానీ తీసుకోవడం ద్వారా లభించే 10 ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాల గురించి చర్చించుకుందాం....

1. జీర్ణ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది

1. జీర్ణ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరిచే సామర్థ్యం పెరుగులో కలదు. కాబట్టి, పెరుగుని రోజూ ఉదయాన్నే తీసుకోవడం ద్వారా ప్రేగులను అలాగే జీర్ణవ్యవస్థను వివిధ రకాల విషపదార్థాల నుంచి అలాగే హానికర బాక్టీరియా నుంచి సంరక్షించుకోవచ్చు. జీర్ణవ్యవస్థను ప్రశాంతపరచి కడుపునొప్పుల నుంచి ఉపశమనం కల్గించేందుకు పెరుగు ఎంతగానో తోడ్పడుతుంది.

2. రోగనిరోధక వ్యవస్థను దృఢపరుస్తుంది

2. రోగనిరోధక వ్యవస్థను దృఢపరుస్తుంది

రోగకారక క్రిములను ఎదుర్కునే సామర్థ్యాన్ని శరీరానికి అందించడంలో పెరుగు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా, మీ ఇంటస్టినల్ ట్రాక్ట్ ను అలాగే గట్ ను మరింత సంరక్షిస్తుంది. అంతేకాక, పెరుగుని తీసుకోవడం ద్వారా రోగనిరోధక సామర్థ్యాన్ని మరింత పటిష్టంగా తయారుచేసుకోవచ్చు. పెరుగులో లభించే మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి మినరల్స్ ఇందుకు తోడ్పడతాయి.

3. అధికరక్తపోటును తగ్గిస్తుంది

3. అధికరక్తపోటును తగ్గిస్తుంది

కొన్నిసార్లు మీరు తెలిసీతెలియక అధికంగా ఉప్పును తీసుకోవడం వలన హైపర్టెన్షన్ తో పాటు కిడ్నీ సమస్యల బారిన పడతారు. పెరుగులో లభించే పొటాషియం వలన శరీరంలో పేరుకుపోయిన అదనపు సోడియం బయటకు పోతుంది. తద్వారా, అధిక రక్తపోటు సమస్య తొలగిపోయి గుండె అర్యోగం మెరుగవుతుంది.

4. వెజీనల్ ఇన్ఫెక్షన్స్ ని అరికడుతుంది

4. వెజీనల్ ఇన్ఫెక్షన్స్ ని అరికడుతుంది

మహిళలకు పెరుగు వలన కలిగే ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను అరికట్టే శక్తి పెరుగులో కలదు. పెరుగులో లభించే లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ అనే బాక్టీరియా అనేది శరీరంలోని ఇన్ఫెక్షన్ విస్తరణని అరికట్టడంలో అమితంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి.

5. ఎముకలకు బలం చేకూరుతుంది

5. ఎముకలకు బలం చేకూరుతుంది

ఒక కప్పుడు పెరుగులో 275 మిల్లీగ్రాముల కేల్షియం లభిస్తుంది. ఉదయాన్నే ఈ మోతాదులో పెరుగుని తీసుకుంటే ఎముకలకు బలం చేకూరుతుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చడంతో పాటు ఎముకల సాంద్రతను కూడా మెరుగుపరిచేందుకు పెరుగు ఉపయోగపడుతుంది.

6. హానికర బాక్టీరియాని నశింపచేస్తుంది

6. హానికర బాక్టీరియాని నశింపచేస్తుంది

పెరుగులో లభించే ప్రోబయాటిక్స్ అనేవి హానికరమైన క్రిములను జీర్ణాశయం నుంచి తొలగిస్తాయి. కడుపు ఉబ్బరం, అతిసారం వంటి వాటితో ఇబ్బంది పడేటప్పుడు పెరుగుని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

7. వర్క్ అవుట్ తరువాత త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది

7. వర్క్ అవుట్ తరువాత త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది

పెరుగనేది వర్క్ అవుట్స్ తరువాత తీసుకోబడే అత్యద్భుతమైన స్నాక్. పెరుగులో లభించే ప్రోటీన్ అనేది కండరాలకు తమంతట తాముగా కోలుకునే శక్తిని కలిగిస్తుంది. అందువలన, వర్క్ అవుట్ తరువాత శరీరంలో శక్తి తగ్గిపోయినప్పుడు పెరుగుని తీసుకోవడం ద్వారా శరీరంలోని శక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు.

8. అలర్జీలను అరికడుతుంది

8. అలర్జీలను అరికడుతుంది

అనేక అధ్యయనాల ప్రకారం గర్భిణీలు తమ ఎనిమిదో నెలలో పెరుగుని తీసుకోవడం ద్వారా వారికి పుట్టే బిడ్డలలో అలర్జీ లక్షణాలు తక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే, పెరుగుని ప్రతిరోజూ తీసుకునే పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్స్ కి అలాగే అలర్జీలకి గురయ్యే ప్రమాదాలు తక్కువని తేలింది.

9. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది

9. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది

పెరుగులో కేలరీలు తక్కువగా లభిస్తాయి. అందువలన, దీనిని తీసుకోవడం వలన అధిక బరువు సమస్య వేధించదు. మీ నడుం చుట్టూ పేరుకుపోయిన కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ కొవ్వును పేర్చమని మీ శరీరాన్ని ఆదేశిస్తుంది. పెరుగుని తీసుకోవడం ద్వారా లభించే కేల్షియం అనేది కార్టిసాల్ ను తక్కువ ఉత్పత్తి చేయమని ఫ్యాట్ సెల్స్ కు ఆదేశాన్నిస్తుంది. ఆ విధంగా మీరు బరువు తగ్గుతారు.

10. కావిటీస్ పై పోరాటం సాగిస్తుంది

10. కావిటీస్ పై పోరాటం సాగిస్తుంది

టూత్ ఎనామిల్ ని పాడు చేసే కేవిటీస్ పై పెరుగు పోరాటం సాగిస్తుంది. పెరుగులో లభించే లాక్టిక్ యాసిడ్ అనేది చిగుళ్ళను క్రిములనుంచి అలాగే అనవసర ఆహార పదార్థాల నుంచి సంరక్షిస్తుంది.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే మీకు ప్రియమైన వారితో ఈ ఆర్టికల్ ను షేర్ చేసుకోండి.

English summary

10 Surprising Health Benefits Of Yogurt When Taken In The Morning

Yogurt is a popular dairy product which is versatile and can be eaten in a variety of ways. Yogurt comes from milk and it is loaded with several nutrients like potassium, calcium, magnesium, vitamin B2 and vitamin B12. It is nutritious, healthy and eating it regularly may boost several aspects of health..
Desktop Bottom Promotion