For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాశయం, అండాశయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హెల్తీ ఫుడ్స్ తినాల్సిందే

By Mallikarjuna
|

మహిళల శరీరంలో యూట్రస్ (గర్భశాయం )ఒక ముక్యమైన అవయవం.ఇది స్త్రీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఉపయోగపడుతుంది. గర్భాశయం పిండం ఏర్పడిన తర్వాత పిండానికి రక్షణగా, పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన యూట్రస్ మరియు ఓవరీస్ రెండూ ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి అవసరం అవుతుంది.

అయితే గర్భశయం మరియు ఓవరీలు రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా గర్బం పొందడం సులభం అవుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఫైబ్రాయిడ్స్, మరియు ఎండోమెట్రియోసిస్ మొదలగునివి గర్భాశయం మీద ప్రభావం చూపుతాయి. ఇటువంటి అసాధరణ సమస్యలను నివారించడానికి న్యాచురల్ గానే చికిత్సను అందించాలి. అందుకోసం కొన్నిప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి.

గర్భశయంతో పాటు, ఓవరీస్ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేమైన న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి గర్భాశయంతో పాటు, ఓవరీస్ కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

యూట్రస్ తో పాటు, ఓవరీస్ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం...

11 Foods For Healthy Uterus And Ovaries

1. ఫైబర్ రిచ్ ఫుడ్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. హైఫైబర్ డైట్ శరీరంలో ఎక్సెస్ ఈస్ట్రోజెన్ నివారిస్తుంది.దాంతో యుటేరియన్ ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా చేస్తుంది. బీన్స్, లెగ్యుమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, త్రుణధాన్యాలు మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

2. వెజిటేబుల్స్

2. వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ ను ఆలస్యం చేస్తాయి. కాబట్టి, రోజువారి ఆహారాల్లో లెగ్యుమ్స్, క్యాబేజ్, బ్రొకోలీ, వంటి వెజిటేబుల్స్ చేర్చాలి.

3. పండ్లు

3. పండ్లు

రెగ్యులర్ డైట్ లో పండ్లు చేర్చుకోవాలి. పండ్లలో ఉండే విటమిన్ సి, బయోఫ్లెవనాయిడ్స్ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ పెరగకుండా చేస్తాయి. పండ్లు ఈస్ట్రోజెన్ లెవల్స్ ను నార్మల్ చేసి, ఓవేరియన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. డైరీప్రొడక్ట్స్

4. డైరీప్రొడక్ట్స్

రెగ్యులర్ గా పెరుగు, చీజ్, పాలు, బట్టర్, వంటిడైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల యూట్రస్ ఆరోగ్యగా ఉంటుంది. ఎందుకంటే, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉన్నాయి. క్యాల్షియం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి యుటేరియన్ ఫైబ్రాయిడ్ ను దూరం చేస్తుంది.

5. గ్రీన్ టీ

5. గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఓవరీస్ లో ఫైబ్రాయిడ్స్ లేకుండా చేస్తాయి, యుటేరియన్ ఫైబ్రాయిడ్స్ ను నివారించుకోవడానికి గ్రీన్ టీ ని రోజూ 8 వారాలు తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి.

6. ఫిష్

6. ఫిష్

చేపలలో మకరెల్, సాల్మ వంటి చేపలను తీసుకోవడం వల్ల ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి పోస్టోగ్లాడిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. మహిళ శరీరంలో పోస్టో గ్లాడిన్ హార్మోస్ యూట్రస్ సమస్యకు కారణం అవుతుంది.

7. నిమ్మ

7. నిమ్మ

నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది, విటమిన్ సి యూట్రస్ వ్యాధినిరోధకతను కూడా పెంచుతుంది. యూట్రస్ లో అనవసరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది. ఓవరీస్, యూట్రస్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 8. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

8. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

ఆకుకూరలు, కొలరాడో, గ్రీన్స్ , ఆకుకూరలు యూట్రస్ లో ఆల్కలైన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది యూట్రస్, ఓవరీస్ కు కావల్సిన న్యూట్రీషియన్స్ ను , ఫోలిక్ యాసిడ్ ను అందిస్తాయి, దాంతో హెల్తీ బేబిని పొందుతారు.

9. నట్స్

9. నట్స్

నట్స్ మరియు సీడ్స్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. బాదం, ఫ్లాక్స్ సీడ్స్, జీడిపప్పు వంటి నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ. ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఫైబ్రాయిడ్స్ ను తొలగించి, యూటేరియన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

10. ఆముదం

10. ఆముదం

ఆముదం నూనెను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. బ్యూటీకోసం, ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారు. ఇది ఓవేరియన్ సిస్ట్ ను కూడా నివారిస్తుంది. యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ను కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే రీకొలోనిక్ యాసిడ్ వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

11. బెర్రీస్

11. బెర్రీస్

బెర్రీస్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఓవరీస్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫీరాడికల్స్ ను నివారిస్తుంది. బెర్రీస్ ఒక సూపర్ ఫుడ్స్, ఓబరీ యూట్రస్ కండీషన్ ను మెరుగుపరుస్తుంది. కాబట్టి, వీరు సలాడ్స్, స్మూతీస్ లో జోడించవచ్చు

English summary

11 Foods For Healthy Uterus And Ovaries

11 Foods For Healthy Uterus And Ovaries,A healthy uterus and ovary is vital for every woman. The reproductive system of a woman plays a key role in her health and well-being. So have a look at the best foods for a healthy uterus and ovaries.
Desktop Bottom Promotion