For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలను ఆ సమయంలో తీసుకుంటే అంతే సంగతులు

మనం రోజూ రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆహారాలు మనం ఎప్పడంటే అప్పుడు తీసుకోకూడదు. అలా తింటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మరి ఏయో సమయాల్లో ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుక

By Bharath
|

మనం రోజూ రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆహారాలు మనం ఎప్పడంటే అప్పుడు తీసుకోకూడదు. అలా తింటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మనలో చాలామంది ఈ విషయాలు తెలియక వాటిని తీసుకుంటూ ఉంటారు. మరి ఏయో సమయాల్లో ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకోండి.

అరటిపండు

అరటిపండు

అరటిపండు మంచి పోషకాలుంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా తింటూ ఉంటారు. గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు అరటి బాగా ఉపయోగపడుతుంది. అయితే రాత్రి సమయాల్లో అరటి తింటే మాత్రం మీరు కొన్ని రకాల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. రాత్రిపూట అరటిని తింటే జలుబు, దగ్గు వంటి రోగాల బారినపడతారు. అందువల్ల వీలైనంత వరకు అరటిని రాత్రి సమయాల్లో తినకుండా ఉండండి.

యోగార్ట్

యోగార్ట్

పెరుగులాగా ఉండే ఇది మనకు ఎక్కువగా మిల్క్ పార్లర్లలో లభిస్తుంది. దీన్ని కూడా చాలామంది బాగా తింటూ ఉంటారు. అయితే దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తినవచ్చు కానీ రాత్రి పూట అస్సలు తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతింటుంది. అలాగే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని రాత్రిపూట తినకుండా ఉండండి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే దీన్ని ఎప్పుడుపడితే అప్పుడు తాగితే మాత్రం చాలా దుష్ఫలితాలుంటాయి. మీరు ఉదయం పరగడుపునే గ్రీన్ టీ తాగితే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. బాడీ మొత్తం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అలాగే యాసిడిటీ సమస్య కూడా వస్తుంది.

అన్నం

అన్నం

మనలో చాలామంది మూడు పూటలా అన్నమే తింటుంటారు. అయితే రాత్రి పూట అన్నం తింటే మాత్రం కొన్ని రకాల సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. రాత్రి పూట రోజూ అన్నం తినకూడదు. దీని వల్ల మీరు ఊబకాయానికి గురువుతారు. ఎక్కువగా వెయిట్ పెరుగుతారు. అంతేకాదు రాత్రి పూట అన్నం తినడం వల్ల అది జీర్ణం కావడానికి చాలా సమయంపడుతుంది.

పాలు

పాలు

పాలతో అత్యధిక పోషకాలుంటాయి. అయితే పాలు జీర్ణం కావాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని పగటి పూట తాగడం కన్నా రాత్రి పడుకునేముందు తాగడం చాలా మేలు. దీంతో మీరు హ్యాపీగా నిద్రపోతారు కూడా. మంచి పోషకాలు శరీరానికి అందుతాయి.

ఆపిల్

ఆపిల్

ఆపిల్ పండ్లు తినడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు. అయితే వీటిని రాత్రిపూట తింటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆపిల్ ను రాత్రి పూట తింటే కడుపులో ఎసిడిటీనీ పెరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్ర వరకు మాత్రమే ఆపిల్స్ తినడం ఉత్తమం.

డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిని తింటే గుండె జబ్బులు కూడా రావు. డార్క్ చాక్లెట్స్ లో చక్కెర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీటిని రాత్రి సమయంలో అస్సలు తినకూడదు. రాత్రి పూట డార్క్ చాక్లెట్స్ ను తింటే రక్తపోటును అధికం అవుతుంది.

రెడ్ వైన్

రెడ్ వైన్

రెడ్ వైన్ లో కొరోనరీ ఆర్టరీ వ్యాధి నిరోధించే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఆల్కహాల్ మోతాదు కాస్త తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని పగటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకపోవడం మంచిది. రెడ్ వైన్ ను రాత్రి సమయంలో డిన్నర్ చేసిన తర్వాత తాగితేనే మంచిది. రాత్రి తిన్న తర్వాత ఒక్కగ్లాస్ రెడ్ వైన్ తాగితే మీరు ప్రశాంతంగా నిద్రపోవొచ్చు. మీ బాడీపై కూడా పెద్ద ఎఫెక్ట్ పడదు.

కాఫీ

కాఫీ

చాలా మంది రాత్రి పూట మేల్కొని ఉండేందుకుగాను కాఫీ తాగాలనుకుంటారు. దీనివల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు.

తరుచూ ఇలా చేయడం వల్ల మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కాఫీలోని కెఫిన్ మీపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందువల్ల రాత్రి పూట కాఫీ తాగకపోవడమే మంచిది.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. దీన్ని మీరు పగటి పూట తాగొచ్చు. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ డీ కూడా ఉంటుంది. అందువల్ల ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఆరెంజ్ జ్యూస్ ను రాత్రి పూట తాగితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల ఆరెంజ్ జ్యూస్ ను రాత్రి పూట తాగకండి.

చక్కెర

చక్కెర

చక్కెరతో తయారు చేసిన పదార్థాలను మనం రోజూ తీసుకుంటూ ఉంటాం. ఉదయం పూట చక్కెరతో తయారు చేసిన పానీయాలు, ఆహారపదార్థాలు రాత్రి పూట అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. అందువల్ల రాత్రి సమయంలో మీరు చక్కెరతో తయారు చేసిన పదార్థాలను తినకండి.

English summary

11 foods we eat at wrong hours that affects health

11 foods we eat at wrong hours that affects health
Story first published:Friday, January 19, 2018, 15:09 [IST]
Desktop Bottom Promotion