For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎర్రని పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎర్రని పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

|

ఆహార నియమ పాలన అనుసారం, ఎర్ర-రంగు కలిగిన ఆహారాల పదార్థాలలో, పోషకాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఎరుపు-రంగు పండ్లు మరియు కూరగాయలలోని ప్రకాశవంతమైన రంగు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులను శరీరానికి ఉపయోగపడే శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. అవి యాన్థోసయానిన్లు, లైకోపీన్, ఫ్లేవానాయిడ్స్ మరియు రెస్వెరట్రాల్ వంటి శక్తివంతమైన మరియు హృదయానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యాంటిఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.

ఈ యాంటిఆక్సిడెంట్లు, గుండె జబ్బులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి మరియు స్ట్రోక్ మరియు మాక్యులార్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

12 Benefits Of Red Fruits And Vegetables

ఎరుపు-రంగు ఆహార పదార్థాల జాబితా:

ఈ క్రింద ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయలు జాబితా ఇవ్వబడినది.

ఎర్రని పండ్లు

1. క్రాన్ బెర్రీస్

2. దానిమ్మ

3. చెర్రీస్

4. ఎర్ర నారింజ

5. రాస్ప్ బెర్రీస్

6. స్ట్రాబెర్రీలు

7.పుచ్చకాయ

8. ఎరుపు యాపిల్

9. ఎర్ర ద్రాక్ష

10. పంపరపనస పండు

11. ఎర్రని పియర్స్

12. టమోటాలు

13. జామపండు

ఎర్రని కూరగాయలు

1.ఎరుపు బెంగుళూరు మిరప

2. ఎర్రని రాజ్మా

3. ఎర్ర మిరప

4. బీట్రూట్

5. ఎర్రని ముల్లంగి

6. ఎర్ర ఉల్లిపాయలు

7. ఎర్రని బంగాళాదుంపలు

8. రూబర్బ్

ఎరుపు-రంగు ఆహార పదార్థాలు మీకు ఏ విధంగా మేలు చేస్తాయి?

ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు అన్నీ, సహజంగా తక్కువ కేలరీల మరియు తక్కువ సోడియం కలిగి ఉంటాయి. ఈ ఆహారాలలో లైకోపీన్ అని పిలువబడే కెరోటినాయిడ్ సమృద్ధిగా ఉంటుంది గనుక, ఈ ఆహారాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్ ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ మరియు ఎసోఫాగస్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

ఎర్ర-రంగుగల కూరగాయలు మరియు పండ్లలో ఉండే, ఎన్థోసయనిన్లు, లైకోపీన్, ఫ్లేవానాయిడ్స్ మరియు రెస్వెరట్రాల్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులతో పోరాడటానికి, కంటి చూపును మెరుగుపర్చడానికి, రక్తపోటును తగ్గించడానికి, వాపులు మరియు మాక్యులార్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి.

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ప్రకారం, పెద్దలలో 95 శాతం మంది ఆహారంలో, తగినన్ని ఎరుపు మరియు నారింజ-రంగు కూరగాయలు తీసుకోరు.

1. ఎర్రని టొమాటోలు

1. ఎర్రని టొమాటోలు

టొమాటోలు పండ్లుగా పరిగణించబడతాయి. వీటిలో ప్రోస్టేట్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ మరియు పెద్దప్రేగు కాన్సర్తో పోరాడటానికి సహాయపడే లైకోపీన్ అధిక స్థాయిలో ఉంటుంది. లైకోపీన్ ఎక్కువగా వండిన టొమాటో ఉత్పత్తులైన సూప్ లు, రసం మరియు టమోటా సాస్ వంటి వాటిలో కనిపిస్తుంది.

2. స్ట్రాబెర్రీలు

2. స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలలో ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 1 సెర్వింగ్ స్ట్రాబెర్రీస్ లో, ఒక నారింజ పండులో కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

3. క్రాన్ బెర్రీస్

3. క్రాన్ బెర్రీస్

క్రాన్ బెర్రీస్ యూటీఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్) ను అడ్డుకోవటానికి సహాయపడతాయి. ఇది కడుపు గోడలకి అంటుకుని, అల్సర్లను కలుగజేసే హెచ్. పైలోరి అనే బాక్టీరియాకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. క్రాన్ బెర్రీస్ లో ప్రోయాన్సయనిడిన్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కారణంగా ఇది సాధ్యపడుతుంది.

4. చెర్రీస్

4. చెర్రీస్

చెర్రీస్ యొక్క ముదురు ఎరుపు రంగే, వాటిలోని పోషక సమృద్ధిని తేటతెల్లం చేస్తుంది. చెర్రీస్ కు ఆంథోసియనిన్లు, ముదురు ఎరుపు రంగుని ఇస్తాయి. ఈ ఆంథోసియనిన్లు, ఫ్రీరాడికల్స్ ను నాశనం చేసి, వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం కాకుండా మరియు కణాల మరణం మరియు నష్టాన్ని కలిగించే పర్యావరణ విషతుల్యాల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి.

5. రాస్ప్ బెర్రీస్

5. రాస్ప్ బెర్రీస్

ఫైబర్ అధికంగా కలిగి ఉండే రాస్ప్ బెర్రీస్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడతాయి. రాస్ప్ బెర్రీస్ లో జింక్, నియాసిన్, పొటాషియం, లిగ్నన్స్, టానిన్లు, ఫినాలిక్ ఆమ్లాలు, ఫ్లేవానాయిడ్స్ మరియు పాలీఫైనల్ ఫిటోకెమికల్స్ ఉంటాయి.

6. ఎరుపు బెంగుళూరు మిరప

6. ఎరుపు బెంగుళూరు మిరప

రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరు కొరకు ఎరుపు బెంగుళూరు మిరప అద్భుతంగా సహకరిస్తుంది. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఈ, ఫోలేట్ ఉంటాయి మరియు 30 కేలరీలు మాత్రమే ఉంటాయి.

7. ఎర్రని రాజ్మా

7. ఎర్రని రాజ్మా

ఎర్రని రాజ్మా హృదయ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ మరియు పునరుత్పత్తి ఆరోగ్యం మరియు గాయాలను నయం చేయడానికి అవసరమైన జింక్ మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే B విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇవి కూడా పొటాషియం మరియు ఫోలేట్ ను కలిగి ఉంటాయి.

8. పుచ్చకాయ

8. పుచ్చకాయ

పుచ్చకాయలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. , ఇది LDL కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఎర్రటి రంగు పండు, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు మక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9. బీట్రూట్

9. బీట్రూట్

USDA వారి ప్రకారం, బీట్రూట్లలో యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, నైట్రేట్లు మరియు ఫోలేట్ ల యొక్క అద్భుతమైన నిధి. ఈ పోషకాలు రక్తపోటును తగ్గిస్తాయి, అథ్లెట్లకు శక్తిని పెంచుతాయి మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.

10. ఎరుపు ముల్లంగి

10. ఎరుపు ముల్లంగి

పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి, లైకోపీన్, ఆంథోసియనిన్లు, జింక్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ ఈ, విటమిన్ కె మరియు డైటరీ ఫైబర్ దీనిలో దండిగా ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీర పనితీరు మెరుగుపరిచడానికి అవసరం.

11. ఎర్రని యాపిల్

11. ఎర్రని యాపిల్

యాపిల్ లో యాంటిఆక్సిడెంట్లు, ఆహార ఫైబర్ మరియు ఫ్లేవానాయిడ్లు అధికంగా ఉంటాయి. యాంటిఆక్సిడెంట్లు క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

12. దానిమ్మ

12. దానిమ్మ

క్యాన్సర్, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం అంతటా నొప్పి, వాపు తగ్గించడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టం నిరోధించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది


English summary

12 Benefits Of Red Fruits And Vegetables

Red-coloured foods are more concentrated in nutrients. The bright hue of red-coloured fruits and vegetables help in turning carbohydrates, proteins and fats into usable energy for the body. They are also loaded with powerful and heart-healthy antioxidants such as anthocyanins, lycopene, flavonoids and resveratrol.
Story first published:Tuesday, August 28, 2018, 17:48 [IST]
Desktop Bottom Promotion