For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి పొటాటో జ్యూస్ తాగడం వలన కలిగే 13 హెల్త్ బెనిఫిట్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి

పచ్చి పొటాటో జ్యూస్ తాగడం వలన కలిగే 13 హెల్త్ బెనిఫిట్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి

|

మీకు పొటాటోస్ అంటే ఇష్టమేనా? పొటాటోస్ ని రసం రూపములో తీసుకోవాలని మీరెప్పుడైనా అనుకున్నారా? లేదు కదా! అయితే, ఈ ఆర్టికల్ లో అదే విషయం గురించి ప్రస్తావించము. పొటాటో జ్యూస్ గురించి వివరించాము. పొటాటో జ్యూస్ ను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాము.

పచ్చి పొటాటోల నుంచి పొటాటో రసాన్ని తీసుకోవాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బి మరియు విటమిన్ సి, ఐరన్, కేల్షియం, పొటాషియం, కాపర్ మరియు ఫాస్ఫరస్ ఇందులో లభ్యమవుతాయి.

మిగతా వెజిటబుల్ ఫ్రూట్స్ కు ఉన్నంత క్రేజ్ పొటాటో జ్యూస్ కు లేదు. ఇందులో ముఖ్యమైన విటమిన్స్, పోషకాలు అలాగే ఫైటో కెమికల్స్ లభ్యమవుతాయి. అలాగే, ఇందులో ఆల్కలైన్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. తద్వారా, ఏసిడ్ రిఫ్లక్స్ ను తగ్గిస్తుంది. ఉదర సమస్యలను నివారిస్తుంది.

పొటాటో జ్యూస్ ను ప్రతి రోజూ ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విటమిన్ సి లభిస్తుంది:

1. విటమిన్ సి లభిస్తుంది:

పొటాటోస్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోజుకు శరీరానికి అందవలసినంత విటమిన్ మోతాదు ఇందులో లభ్యమవుతుంది. విటమిన్ సి అనేది ఐరన్ ని గ్రహించేందుకు శరీరానికి తోడ్పడుతుంది. అలాగే బ్లడ్ వెజిల్స్, కార్టిలేజ్, మజిల్ మరియు బోన్స్ లో కొలాజెన్ ఏర్పడటానికి తోడ్పడుతుంది. విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇరిటేషన్ మరియు కంటి కింద పఫీనెస్ ను తొలగిస్తాయి.

2. బి విటమిన్స్:

2. బి విటమిన్స్:

ఒక కప్పుడు పొటాటోస్ లో రోజువారి తీసుకోవడానికి సిఫార్సు చేయబడిన థయామిన్ మరియు నియాసిన్ లలో 40 శాతం లభిస్తుంది. పొటాటో జ్యూస్ ను తీసుకోవడం ద్వారా శరీరానికి రైబో ఫ్లోవిన్ మరియు విటమిన్ బి6 వంటి ఇతర బి విటమిన్స్ కూడా లభిస్తాయి.

కార్బోహైడ్రేట్స్ ను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి శక్తినిచ్చేనందుకు బి విటమిన్స్ తోడ్పడతాయి. ఈ విటమిన్స్ అనేవి బ్రెయిన్ కు సపోర్ట్ నిస్తూ నెర్వస్ సిస్టం పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే లివర్ హెల్త్ ను పెంపొందిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

3. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి

3. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి

పొటాటో జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైటో కెమికల్స్ లభ్యమవుతాయి. పొటాటో జ్యూస్ ద్వారా అందే మరొక ముఖ్యమైన ప్రయోజనమిది. ఫైటోకెమికల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వ్యాధులను అరికట్టడానికి తోడ్పడతాయి. ఎర్లీ ఏజింగ్ ను అరికట్టి ఇంఫ్లేమేషన్ ను నియంత్రణలో ఉంచుతాయి. ల్యూటీన్, జిగ్జాంథిన్ మరియు వయోల్యాగ్జాంథిన్ లనే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పొటాటోలో లభ్యమవుతాయి.

4. పొటాషియం పుష్కలంగా లభిస్తుంది:

4. పొటాషియం పుష్కలంగా లభిస్తుంది:

పొటాటోస్ లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అంటే, నారింజలో లభించే మోతాదు కంటే ఇది మూడు రెట్లు అధికం. రోజు వారి సిఫార్సు చేయబడిన పొటాషియం కంటెంట్ లో ఇది 31 శాతం. పర్ సెర్వింగ్ లో 1,467 మిల్లీగ్రాములు లభ్యమవుతాయి. పొటాషియం అనేది ఎలెక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ ను రెగ్యులేట్ చేసి మజిల్ ఫంక్షన్ కు సపోర్ట్ ని అందిస్తుంది.

5. ఆర్తరైటిస్ ను నిరోధిస్తుంది:

5. ఆర్తరైటిస్ ను నిరోధిస్తుంది:

పొటాటో జ్యూస్ లో అద్భుతమైన యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి పెయిన్ తో అనుసంధానమైన వాపు, ఇంఫ్లేమేషన్ మరియు రెడ్ నెస్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించేందుకు తోడ్పడతాయి. పొటాటో జ్యూస్ ను తీసుకోవడం వలన ఆర్తరైటిస్ తో పాటు ఇతర జాయింట్ పెయిన్స్ నుంచి విముక్తి లభిస్తుంది.

6. మైగ్రేన్ ను తగ్గిస్తుంది:

6. మైగ్రేన్ ను తగ్గిస్తుంది:

పొటాటో జ్యూస్ ను తీసుకోవడం లేదా పొటాటో స్లైస్ తో నుదుటిపై రబ్ చేసుకోవడం ద్వారా మైగ్రైన్, ఒత్తిడి మరియు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పొటాటో జ్యూస్ ను సాంప్రదాయ మెడిసిన్స్ లో కూడా వాడతారు. అంటే, పొటాటో జ్యూస్ లో అంతటి ఔషధ గుణాలు కలవన్న మాట.

7. బ్లడ్ సర్క్యూలేషన్ ని పెంపొందిస్తుంది:

7. బ్లడ్ సర్క్యూలేషన్ ని పెంపొందిస్తుంది:

పొటాటో జ్యూస్ లో నియాసిన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఈ విటమిన్ అనేది ఎనర్జీ లెవల్స్ ని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. అలాగే అక్షీజన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి పోషకాలతో పాటు తగినంత అక్షీజన్ అనేది శరీరంలోకి ఇతర అవయవాలకు చేరేలా తోడ్పడుతుంది. అందువలన ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది.

8. వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది:

8. వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది:

పొటాటోస్ ను తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. అయితే, అధ్యయనాల ప్రకారం ఇది తప్పని తేలింది. పచ్చి పొటాటో జ్యూస్ ను తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ ప్రక్రియ ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఇందులో లభించే విటమిన్ సి అనేది మెటాబాలిజాన్ని పెంపొదిస్తుంది. భోజనం తరువాత పొటాటో జ్యూస్ ను తీసుకోవడం వలన ఆకలి హార్మోన్స్ వృద్ధిని ఇది నిరోధిస్తుంది. అందువలన, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. తద్వారా, వెయిట్ లాస్ ప్రక్రియ జరుగుతుంది.

9. క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:

9. క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:

క్యాన్సర్ సెల్స్ అనేవి వేగంగా విభజించబడడాన్ని పొటాటో జ్యూస్ ను తీసుకవడం ద్వారా నిరోధించవచ్చు. పొటాటోస్ లో గ్లైకోల్కాలాయిడ్స్ వంటి కెమికల్ కాంపౌండ్స్ కలవు. వీటిలో యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్ కలవు. అందువలన, పొటాటో జ్యూస్ ను తరచూ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

10. అల్సర్ ను హీల్ చేస్తుంది:

10. అల్సర్ ను హీల్ చేస్తుంది:

పొటాటోస్ లో విభిన్నమైన యాంటీ బాక్టీరియల్ మాలిక్యూల్స్ కలవు. ఇవి హార్ట్ బర్న్ ను అలాగే అల్సర్స్ ను హీల్ చేయగలవు. అలాగే, మీరు పొటాటో జ్యూస్ ను తాగడం ప్రారంభించాక స్టమక్ అల్సర్స్ వృద్ధి అనేది అరికట్టబడుతుంది.

11. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

11. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

పొటాటోస్ లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ అలాగే విటమిన్ సి లభ్యమవుతాయి. ఈ పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు తోడ్పడతాయి. అలాగే, పొటాటో జ్యూస్ ను తీసుకోవడం ద్వారా శరీరానికి అన్ని విధాలా లాభం కలుగుతుంది.

12. కాన్స్టిపేషన్ ను తగ్గిస్తుంది:

12. కాన్స్టిపేషన్ ను తగ్గిస్తుంది:

పొటాటో జ్యూస్ లో తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. ఇది కాన్స్టిపేషన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ పనితీరును పెంపొందిస్తుంది. ఒక గ్లాసుడు పొటాటో జ్యూస్ లో లభ్యమయ్యే పల్ప్ అనేది జీఐ ట్రాక్ట్ ను శుభ్రపరుస్తుంది.

13. సయాటికాను తగ్గిస్తుంది:

13. సయాటికాను తగ్గిస్తుంది:

నడుం కింది భాగం నుంచి కాళ్ళ వరకూ పాకే నొప్పిని సయాటికాగా భావించవచ్చు. సయాటికా సమస్యకు పొటాటో జ్యూస్ అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది నెర్వ్ ఇరిటేషన్ ను తాగించి లెగ్ మూవ్మెంట్ కు తోడ్పడుతుంది.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

13 Health Benefits Of Raw Potato Juice: Here's Why You Should Drink Raw Potato Juice

Potato juice might not be as glamorous as other fruit and vegetable juices. But it's packed with key vitamins, nutrients, and phytochemicals. Potato juice is rich in vitamin C, high in antioxidants and potassium, relieves arthritis, treats constipation, contains B vitamins, and treats migraine headaches.
Desktop Bottom Promotion