For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 16 రకాల ఆహారాలను పొట్టలో అల్సర్లతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది

By R Vishnu Vardhan Reddy
|

వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పొట్టలో పుండు కూడా ఒకటి. ఈ పుండుని ఆంగ్లం లో అల్సర్ అని అంటారు. పొట్ట లో తెరచి ఉంచిన రంధ్రాలు వృద్ధి చెందుతాయి. ఇలా మార్పులు చోటు చేసుకోవడానికి ముఖ్య కారణం, హెలికాబాక్టర్ పైలోరి అనే సూక్ష్మ జీవులు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా ఏ వ్యక్తులు అయితే తరచూ ఆస్ప్రిన్ మరియు ఇబుప్రోఫెన్ అనే మాత్రలను వాడతారో, స్టెరాయిడ్లు కానటువంటి మంటను తగ్గించే మందులను ఎవరైతే ఎక్కువగా వాడతారో, అలాంటి వారందరిలో కడుపులో పుండు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

foods to eat when suffering from stomach ulcers

మీరు గనుక కడుపులో పుండుతో బాధపడుతున్నట్లైతే, తీసుకుంటున్న మందులతో పాటు కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది మరియు కొన్నింటికి పూర్తిగా దూరం ఉండాల్సి ఉంది. ఈ పుండుతో బాధపడుతున్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయమై నిర్దిష్టమైన ప్రణాళిక ఏమి లేదు. ఒకవేళ ఆలా గనుక తీసుకుంటే, ఈ వ్యాధి నయం అయిపోతుంది అని కూడా చెప్పలేము. కానీ, కొన్ని ఆహారాలను దూరంగా ఉంచినట్లయితే, మీ ఆరోగ్యానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

కొంతమంది పరిశోధకులు చాలా రోజుల పాటు పరిశోధించి కొన్నిరకాల ఆహారాలు, కడుపులో పుండుకి ప్రధాన కారణమైన హెలికాబాక్టర్ పైలోరి పై పోరాడుతామని గుర్తించారు.

ఇప్పుడు మనం కడుపులో ఆమ్లాలు అధికంగా విడుదల అవ్వకుండా అడ్డుకునే మందులు మరియు యాంటీ బయాటిక్స్ తో పాటు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఆహారాలన్నీ మన ఆరోగ్యానికి ఏ విధంగా లాభం చేకూరుస్తాయో కూడా తెలుసుకుందాం.

1. క్యాలీఫ్లవర్ :

1. క్యాలీఫ్లవర్ :

సాధారణంగా మనమందరం వెళ్లే కూరగాయల సంతలో ఖచ్చితంగా క్యాలీఫ్లవర్ దొరుకుతుంది. ఈ కాయగూరలో సుల్ఫోరఫానే అధికంగా ఉంటుంది. ఇది హెలికాబాక్టర్ పైలోరి అనే సూక్ష్మ జీవులు పై పోరాడుతుంది. ఒక ప్రయోగం ప్రకారం ఏ వ్యక్తులు అయితే రోజుకు రెండు సార్లు చొప్పున 7 రోజుల పాటు క్యాలీఫ్లవర్ తిన్నారో, అటువంటి వారి శరీరంలో ఉన్న ఈ సూక్ష్మ జీవుల పై ఇది 78% ప్రతికూల ప్రభావాన్ని చూపిందట.

క్యాలీఫ్లవర్ లో ఉండే ఈ సమ్మేళనం, జీర్ణకోశ ప్రాంతంలో ఉండే సూక్ష్మ జీవులను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది పుండుని నివారించడంలో సహాయం పడటంతో పాటు, ఇందులో విటమిన్ సి మరియు పీచు పదార్ధం కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా ఉడికించి సలాడ్ రూపంలో అయినా తినండి లేదా ఇంట్లో కూరలా వండుకొని అయినా ఆరగించండి.

2. క్యాబేజి :

2. క్యాబేజి :

క్యాబేజి కూరగాయలో ఎస్- మిథైల్ మితియోనైన్ అనే పదార్ధం ఉంటుంది. దీనినే విటమిన్ యు గా కూడా పిలుస్తారు. కడుపులో పుండుని నయం చేయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. కడుపులో ఉండే పి ఎచ్ స్థాయిల సమతుల్యత దెబ్బతినడం వల్లనే కడుపులో పుండు వస్తుందని మరియు ఆలా రాకుండా శరీరానికి చికిత్స చేయడంలో ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. దీనికితోడు క్యాబేజి ఎమినో ఆమ్లం గ్లుటమైన్ కూడా ఉంటుంది. పుండు ని చికిత్స చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ పదార్ధం తెరిచి ఉన్న రంద్రాలను చికిత్స చేయడంతో పాటు, చిన్న ప్రేగుల ప్రాంతంలో ఉన్న శ్లేష్మ ప్రాంతాన్ని శక్తివంతం చేస్తుంది. దీనిని పచ్చిగా లేదా సలాడ్లలో వేసుకొని ప్రతిరోజూ కనీసం రెండు కప్పులు తినాలి.

3. ముల్లంగి :

3. ముల్లంగి :

ముల్లంగిలో పీచు పదార్ధం చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణం బాగా అవుతుంది మరియు ఇతర ఖనిజాలను పీల్చుకోవడంలో ఎంతగానో సహకరిస్తుంది. ప్రతిరోజూ తెల్లటి ముల్లంగిని తినాలి అని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కడుపు భాగంలో మంట రాకుండా చూస్తుంది. జీర్ణం బాగా అయ్యేలా చేస్తుంది మరియు జీర్ణకోశ వ్యాధులను దూరం చేస్తుంది.

4. యాపిల్స్ :

4. యాపిల్స్ :

ప్రతిరోజూ ఖచ్చితంగా ఒక యాపిల్ తినడం అలవర్చుకోండి. ఇలా తినడం వల్ల కడుపులో పుండు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికితోడు యాపిల్స్ లో ఫలావోనోయిడ్స్ ఉంటాయి. ఇది హెలికాబాక్టర్ పైలోరి అనే సూక్ష్మ జీవులు పెరకుండా అడ్డుకుంటాయి మరియు వాటి యొక్క వ్యాప్తిని అరికడతాయి.

5. బ్లూ బెర్రీస్ :

5. బ్లూ బెర్రీస్ :

ప్రతి రోజు ఉదయాన్నే బ్లూ బెర్రీ తినడం వల్ల కడుపులో పుండుని నయం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల మీ యొక్క రోగనిరోధక శక్తి ఎంతగానో పెరుగుతుంది మరియు పుండు నుండి కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది.

6. రాస్ప్బెర్రీస్ ( కోరిందకాయలు ) :

6. రాస్ప్బెర్రీస్ ( కోరిందకాయలు ) :

రాస్ప్బెర్రీస్ మరియు బ్లాక్ బెర్రీస్, ఈ రెంటిలో ఫెనోలిక్ అనే సమ్మేళనం చాలా అధికంగా ఉంటుంది మరియు ఇందులో జీర్ణం అయ్యే పీచుపదార్థం కూడా చాలా ఎక్కువగా ఉందట. దీని వల్ల జీర్ణం చాలా బాగా అవుతుంది మరియు కడుపులో జీర్ణకోశ సంబంధిత మంటను రాకుండా తగ్గిస్తుంది.

7. స్ట్రాబెర్రిస్ :

7. స్ట్రాబెర్రిస్ :

ఒక కొత్త పరిశోధన ప్రకారం స్ట్రాబెర్రిస్ ఒక రక్షణ కవచంగా ఉండి కడుపులో పుండుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని కనుగొన్నారు. స్ట్రాబెర్రిస్ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి పుండు నుండి శరీరాన్ని కాపాడతాయి. అంతేకాకుండా ఇవి పొట్ట యొక్క గోడలను కూడా శక్తి వంతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక కప్పు స్ట్రాబెర్రిస్ లను ధాన్యాలతో కలిపి అల్పహారం క్రింద కానీ లేదా చిరు తిళ్ళు తినాలి అనుకున్న సమయంలో గాని తినండి.

8. గంట మిరియాలు :

8. గంట మిరియాలు :

తియ్యని గంట మిరియాలు తినడం వల్ల పొట్టకు సంబంధించిన పుండుని తగ్గించడంలో ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. మీరు తీసుకొనే సలాడ్ లో ప్రతిరోజూ వీటిని పచ్చిగా అలానే వేసుకొని తినండి.

9. క్యారెట్లు :

9. క్యారెట్లు :

పొట్ట యొక్క గోడలను శక్తివంతం చేయడంలో క్యారెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యారెట్ల లో ఉండే విటమిన్ ఏ కడుపులో ఉండే పుండుని, జీర్ణకోశ సంబంధిత మంటను మరియు అజీర్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీరు రోజు త్రాగే కూరగాయల సూప్ లో ఉడికించి అయినా తినండి లేదా సలాడ్ లో పచ్చిగా వేసుకొని అలానే అయినా తినండి. ప్రతిరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ మీరు త్రాగినా మంచిదే.

10. బ్రోకలీ :

10. బ్రోకలీ :

పరిశోధనల ప్రకారం బ్రోకలీ లో ఒక రకమైన రసాయనం ఉందట. ఇది పొట్టలో వచ్చే పుండుకు కారణం అయిన సూక్ష్మ జీవులను పూర్తిగా నాశనం చేయడంలో ఇది సహాయపడుతుంది. బ్రోకలీ లో ఉండే సల్ఫోరాఫాన్ ఎంతగానో సహాయపడుతుంది. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మీ సలాడ్ తో పాటు దీనిని స్వీకరించండి.

11. పెరుగు :

11. పెరుగు :

మన శరీరానికి అవసరమైన ఆరోగ్యవంతమైన ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. ఇందులో ప్రోబయోటిక్స్ , లాక్టోబాసిల్లస్ మరియు అసిడోఫైలస్ అనే సూక్ష్మ జీవులు ఉంటాయి. ఇవి కడుపులో పుండుని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. అంతేకాకుండా జీర్ణకోశ వ్యవస్థలో ఉండే మంచి మరియు చెడు ప్రేగు సూక్ష్మ జీవుల మధ్య సమతుల్యతో అవి ఉండటానికి ఇవి కృషి చేస్తాయి. సొయా ఉత్పత్తులు మరియు సోయాతో తయారు చేసిన పదార్ధాల్లో కూడా ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.

12. ఆలివ్ నూనె మరియు ఇతర మొక్క ఆధారిత నూనె :

12. ఆలివ్ నూనె మరియు ఇతర మొక్క ఆధారిత నూనె :

కడుపులో ఉండే పుండుని చికిత్సను చేసే సామర్థ్యం ఆలివ్ నూనెకు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే ఫెనోల్స్ సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీని వల్ల హెలికాబాక్టర్ పైలోరి సూక్ష్మ జీవులు ఇతర ప్రాంతాలకు పాకకుండా అడ్డుకుంటాయి మరియు కడుపు గోడల పై ప్రభావం చూపకుండా కృషి చేస్తాయి.

13. తేనె :

13. తేనె :

చర్మం యొక్క సౌందర్యాన్ని పెంపొందించడానికి మరియు దెబ్బలను నయం చేయడానికి మాత్రమే తేనె ఉపయోగపడుతుంది అని అనుకోకండి. ఎందుకంటే, అంతకు మించిన చాలా పనులును తేనె చేయగలుగుతుంది. పొట్ట గోడల ప్రాంతంలో తెరుచుకొని ఉన్న రంధ్రాల పై కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. సూక్ష్మ జీవుల యొక్క వృద్ధిని అడ్డుకొని, కడుపులో పుండుని నయంచేయగలదు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ పచ్చి తేనెను అలానే అయినా స్వీకరించండి లేదా మీరు తీసుకొనే అల్ఫాహారంలో అయినా వేసుకొని తినండి.

14. వెల్లుల్లిపాయలు :

14. వెల్లుల్లిపాయలు :

చిన్న వెల్లుల్లిపాయ, హెలికాబాక్టర్ పైలోరి అనే సూక్ష్మ జీవులును పూర్తిగా నియంత్రించి కడుపులో పుండు రాకుండా అరికట్టగలదు. వెల్లుల్లిపాయలో సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పనిచేసే ఎన్నో పదార్ధాలు ఉన్నాయి. ఇవన్నీ కడుపులో పుండు ని నయం చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

15. కెఫీన్ ని పూర్తిగా తీసివేసిన గ్రీన్ టీ :

15. కెఫీన్ ని పూర్తిగా తీసివేసిన గ్రీన్ టీ :

కెఫీన్ ని పూర్తిగా తీసివేసిన గ్రీన్ టీ లో ఈ సి జి సి అనే పదార్ధం ఉంటుంది. ఇందులో అతి ఎక్కువ స్థాయిలో ఉండే కాటెచిన్ అనే పదార్ధం యొక్క విపరీతమైన సామర్ధ్యం వల్ల అది కడుపులో పుండు భారి నుండి మిమ్మల్ని కాపాడగలదు. ఇందులో ఉండే కడుపు మంట రాకుండా ఉండే లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లు పుండు పై అత్యుత్తమంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక కప్పు టీ ని తీసుకోండి.

16. గ్లైకో రైస్ ;

16. గ్లైకో రైస్ ;

ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అతి ప్రాచీనమైన మందులో గ్లైకో రైస్ కూడా ఒకటి. కడుపులో ఉండే పుండు మరియు జీర్ణ సంబంధిత సమస్యల పై పోరాటం చేసే సామర్థ్యం దీనికి ఉంది. కడుపులో మంట రాకుండా చూసే లక్షణాలు, ఇందులో ఉండటం వల్ల ఇది కడుపులో మంటను పూర్తిగా తగ్గించివేస్తుంది.

కాబట్టి ఏ ఆహారాల్లో అయితే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయో, అవన్నీ కడుపులో పుండుని నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు ఇన్ఫెక్షన్ ని వృద్ధి చెందకుండా అరికడతాయి. పైన చెప్పబడిన ఆహారాలనే కాకుండా ప్రతిరోజూ మిగతా ఆకుకూరలు మరియు కూరగాయలు కూడా తినండి. ముఖ్యంగా విటమిన్ బి మరియు కాల్షియమ్ అధికంగా ఉండే వాటిని, బాదం పప్పు, చెర్రీ లు మొదలగు వాటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్యం భారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

English summary

16 Foods To Eat When Suffering From Stomach Ulcers

While you are suffering from stomach ulcer, besides medication, there are certain foods that you must eat and some of them which you should avoid. Although there is no proper diet that a patient suffering from an ulcer can consume and get cured, avoiding some foods can be beneficial for your health.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more