For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పియర్ మింట్ టీ వలన కలిగే ఏడు రకాల ఆరోగ్య ప్రయోజనాలు!

స్పియర్ మింట్ టీ వలన కలిగే ఏడు రకాల ఆరోగ్య ప్రయోజనాలు!మీరు ఎప్పుడైనా స్పియర్ మింట్ టీ రుచి చూసారా? దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా? లేదు కదా! అయితే, ఈరోజు మనము స్పియర్ మింట్ టీ యొ

|

మీరు ఎప్పుడైనా స్పియర్ మింట్ టీ రుచి చూసారా? దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా? లేదు కదా! అయితే, ఈరోజు మనము స్పియర్ మింట్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

స్పియర్ మింట్, టూత్ పేస్టు, మౌత్ వాష్, మరియు సౌందర్య సాధనాలలో ఉపయోగించే పుదీనా జాతికి చెందిన మొక్క. దీనిని వివిధ మందుల తయారీలో మరియు చికిత్సా విధానాల్లో కూడా ఉపయోగిస్తారు.

దీనిలో పుదీనా వలే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్లు మరియు ముఖ్యమైన పోషకాలను ఉంటాయి, . స్పియర్ మింట్ మెంథోల్ తక్కువగా కలిగి ఉన్నప్పటికి, లిమోనెన్, సినియల్ మరియు డైహైడ్రోకార్వాన్ పుష్కలంగా ఉంటాయి . దీని రుచి పుదీనా కన్నా తియ్యగా ఉంటుంది.

7 Health Benefits Of Spearmint Tea And How To Make It

స్పియర్ మింట్ యొక్క పోషకాహార విలువలు:

100 గ్రాముల తాజా స్పియర్ మింట్ లో,

44 కిలోకెలరీల శక్తి

8.41 గ్రాముల కార్బోహైడ్రేట్లు

0.73 గ్రాముల కొవ్వు

3.29 గ్రాముల మాంసకృత్తులు

1.118 మిల్లీ గ్రాముల మాంగనీస్

11.87 మిల్లీగ్రాముల ఇనుము

0.240 మిల్లీగ్రాముల రాగి

458 మిల్లీగ్రాముల పొటాషియం

0.158 మిల్లీగ్రాముల పైరిడాక్సిన్

0.175 మిల్లీగ్రాముల రైబోఫ్లావిన్

13.3 మిల్లీగ్రాముల విటమిన్ సి

0.061 మిల్లీగ్రాముల విటమిన్ బి 5

0.041 మిల్లీగ్రాముల విటమిన్ బి 6

కొలెస్ట్రాల్ సున్నా శాతం ఉంటాయి


1. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

1. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

స్పియర్ మింట్ టీ, మన శరీరంలోని హార్మోన్ల సంతులనం మీద ప్రభావం చూపుతుంది. వివిధ హార్మోన్ల మధ్య జరిగే పరస్పర చర్యలు, మీ స్వరూపం, మానసిక స్థితి, ప్రవర్తన మరియు శక్తి సామర్ధ్యాలను నిర్వచిస్తాయి. స్పియర్ మింట్ టీని తాగడం వలన, మన శరీరంలో హార్మోన్ల నిల్వలు ఆరోగ్యకరమైన స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తుంది.

2. దీర్ఘకాలిక వ్యాధులు నిరోధిస్తుంది.

2. దీర్ఘకాలిక వ్యాధులు నిరోధిస్తుంది.

మన శరీరంలో కణాలు చచ్చుబడిపోవడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేయడానికి, ఫ్రీ రాడికల్స్ ప్రధాన కారణం. దీనికి ఉదాహరణ క్యాన్సర్. ఫ్రీ రాడికల్స్ కణాలలో మ్యుటేషన్లను ప్రేరేపించడం వలనే ఎక్కువగా క్యాన్సర్ కలుగుతుంది. స్పియర్ మింట్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

3. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

3. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

స్పియర్ మింట్ టీ మరియు స్పియర్ మింట్ టీ తైలం శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, మన రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే క్రిములకు వ్యతిరేకంగా పోరాడతాయి. మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసేందుకు, స్పియర్ మింట్ టీ తోడ్పడుతుంది.

4. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

4. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

స్పియర్ మింట్ టీలో ఉండే లిమొలిన్, ఫ్రీరాడికల్స్ యొక్క ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి మరియు మన శరీరంలో న్యూరోట్రాన్స్మిటర్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని, నిశితదృష్టిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఒక కప్పుడు స్పియర్ మింట్ టీని తాగతే మీ ఆలోచన తేలికై, అభిజ్ఞా పనులు పరిష్కరించడానికి సహాయపడుతుంది.

5. వికారం తొలగిస్తుంది.

5. వికారం తొలగిస్తుంది.

మీ కడుపులో వికారం లేదా అసౌకర్యం కలిగినపుడు, స్పియర్ మింట్ టీలో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు,వాటిని తగ్గించేందుకు సహాయపడతాయి. ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరిచి, కడుపు యొక్క లైనింగ్ ను కాపాడుతుంది. ఇది మీ పోషకాహారాన్ని మెరుగుగా గ్రహించడాన్ని ప్రోత్సహించి, కడుపునొప్పి, మలబద్ధకం, మరియు ఉబ్బరం వంటి అనారోగ్యాలను తొలగిస్తుంది. స్పియర్ మింట్ టీ ఇతర జీర్ణశయాంతర సమస్యలను కూడా నిరోధిస్తుంది.

 6. వాపు తగ్గిస్తుంది.

6. వాపు తగ్గిస్తుంది.

స్పియర్ మింట్ టీలో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, శరీరం అంతటా కలిగే నొప్పులు, తలనొప్పి మరియు ఇతర నొప్పులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పి నుండి ఉపశమనం తెస్తుంది. దీనిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, గొంతు నొప్పి మరియు అజీర్ణము నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.

 7. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.

7. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.

స్పియర్ మింట్ టీలో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే, శక్తివంతమైన శిలీంధ్ర నాశక లక్షణాలున్నాయి ఇది గొప్ప లో ఒకటి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు ప్రేగులలో ఉన్న పరాన్న జీవులను సమర్థవంతంగా తొలగించడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోడానిజి స్పియర్ మింట్ టీని తాగడం ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు.

English summary

7 Health Benefits Of Spearmint Tea And How To Make It

Spearmint belongs to the same species of mint found in toothpaste, mouthwashes, and cosmetics. It is also used in medicines for its therapeutic properties. The health benefits are that it balances hormone levels, prevents chronic disease, boosts immune system, improves memory, eliminates nausea, reduces inflammation, etc.
Story first published:Monday, July 30, 2018, 15:13 [IST]
Desktop Bottom Promotion