For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊదా లేదా ఎరుపు రంగు క్యాబేజీలో ఉన్న, మీకు తెలియని ఆరోగ్యపరమైన సుగుణాలు

ఊదా లేదా ఎరుపు రంగు క్యాబేజీలో ఉన్న, మీకు తెలియని ఆరోగ్యపరమైన సుగుణాలు

|

మనలో ప్రతి ఒక్కరికి, మన ఇళ్లలో ఎక్కువగా వండుకునే ఆకుపచ్చ క్యాబేజీని గురించి బాగా తెలుసు. కానీ మీకు ఊదా లేదా ఎరుపు రంగులో ఉండే మరొక రకం క్యాబేజీ గురించి తెలుసా? ఊదారంగు క్యాబేజీ దాదాపుగా ప్రతిచోటా కనబడుతుంది. అయితే , దాని ఆరోగ్య ప్రయోజనాలను గురించి అందరికీ తెలియదు.

ఊదా లేదా ఎరుపు రంగు క్యాబేజీ అంటే ఏమిటి?

అని పిలువబడేది, ఆకుపచ్చ క్యాబేజీ వలే, ఊదా లేదా ఎరుపు రంగు క్యాబేజీ కూడా అనేక ఆకులు కలిగి ఉంటుంది. వివిధ కారణాల వల్ల ఈ పౌష్టిక కూరగాయ అత్యంత ప్రజాదరణ పొందినది. దీనిలో ఉన్న పదార్థం యొక్క pHని బట్టి రంగు మారుతుంది కనుక, దీనిని pH సూచికగా ఉపయోగిస్తారు. ఇది పెరిగే చోట ఉండే మట్టి యొక్క pHపై కూడా దీని రంగు ఆధారపడి ఉంటుంది.

7 Surprising Health Benefits Of Red Cabbage

ఊదా రంగు క్యాబేజ్ లో పోషక విలువలు ఎలా ఉంటాయి?

ఈ కూరగాయ, ఫైటోకెమికల్స్, పోషకాలు, పీచు పదార్థాలు, యాంటిఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే మరియు థయమిన్, ఫోలేట్, విటమిన్ బి వంటి విటమిన్లు మరియు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, రైబోఫ్లావిన్, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి.

ఒక గిన్నెడు తరిగిన ఊదా క్యాబేజీ, 2 గ్రాముల పీచుపదార్ధంను అందిస్తుంది. పీచుపదార్ధంను తీసుకోవడం వలన, కొలెస్ట్రాల్ ను రక్తప్రవాహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఒక కప్పు తరిగిన ఊదా క్యాబేజీలో 216 మి.గ్రా పొటాషియం, 51 మి.గ్రా విటమిన్ సి మరియు 993 IU విటమిన్ ఎ ఉంటుంది.

7 Surprising Health Benefits Of Red Cabbage

ఆకుపచ్చని క్యాబేజీ కంటే ఊదా రంగు క్యాబేజీ ఆరోగ్యవంతమైనదా?

ఎరుపు మరియు ఆకుపచ్చ క్యాబేజీ రెండూ మీ ఆరోగ్యానికి మంచివే. అయితే, పోషక విలువలు మరియు రుచి విషయానికి వస్తే, రెండు భిన్నంగా ఉంటాయి. ఆకుపచ్చ క్యాబేజీ కంటే ఎరుపు క్యాబేజీలో 10 రెట్లు అధికంగా విటమిన్ ఎ ఉంటుంది. ఒక కప్పు తరిగిన ఎర్ర క్యాబేజీలో, 51 మి.గ్రా విటమిన్ సి ఉండగా, ఆకుపచ్చ క్యాబేజీలో 37 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.

1. రోగనిరోధక శక్తి పెంచుతుంది

1. రోగనిరోధక శక్తి పెంచుతుంది

ఈ రకం క్యాబేజీలో, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ముఖ్యమైన యాంటిఆక్సిడెంట్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల చర్యను ప్రేరేపించి, తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలపరచి, ఫ్రీరాడికల్స్ కలిగించే నష్టం నుండి శరీరాన్ని కాపాడుతుంది.

2. క్యాన్సర్ ను నిరోధిస్తుంది

2. క్యాన్సర్ ను నిరోధిస్తుంది

ఇండోల్స్ మరియు ఆంథోసయనిన్లు వంటి అధిక యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా, ఈ కూరగాయలు క్యాన్సర్ నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆంథోసయనిన్లు క్యాబేజీకి ఊదా రంగునిస్తే, ఇండోల్స్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను తగ్గిస్తాయి.

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పీచుపదార్ధం అధికంగా ఉండటంతో పాటు, కేలరీలు చాలా తక్కువగా ఉండటం వలన, ఊదా రంగు క్యాబేజీ అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

4. కీళ్ళవాతం(ఆర్ధ్రైటీస్) మరియు వాపు,మంటలను తగ్గిస్తుంది

4. కీళ్ళవాతం(ఆర్ధ్రైటీస్) మరియు వాపు,మంటలను తగ్గిస్తుంది

ఈ కూరగాయలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్, దీర్ఘకాలిక వాపు మరియు నొప్పులను తగ్గిస్తాయి. ఊదా రంగు క్యాబేజ్ లో సల్ఫోరాఫాన్ అనే ఒక సమ్మేళనాన్ని ఉంటుంది. ఇది వాపులతో శక్తివంతంగా పోరాడుతుంది.ఆర్థరైటిస్ ఫౌండేషన్ వారి సూచన ప్రకారం, ఒక ఆర్థరైటిస్ రోగి యొక్క దైనందిన ఆహార ప్రణాళికలో ఎరుపు క్యాబేజీని తప్పక భాగంగా చేసుకోవాలి.

5. అల్సర్ల చికిత్స

5. అల్సర్ల చికిత్స

గ్లూటమైన్ అని పిలువబడే అమైనో ఆమ్లం కలిగి ఉండటం వలన, ​ఈ కూరగాయలో కడుపులో అల్సర్ల వలన కలిగే వాపును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఊదా రంగు క్యాబేజీ రసం, కడుపులో అల్సర్ల గృహవైద్య చికిత్సలో ఉపయోగిస్తారు.

6. ఆస్టియోపోరాసిస్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది

6. ఆస్టియోపోరాసిస్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఈ అద్భుతమైన కూరగాయలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్ K, ఎముకలలోని ఖనిజ సాంద్రతను పెంచి, ఎముకల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది ఆర్థరైటిస్, ఆస్టియోపోరాసిస్ మరియు ఇతర ఎముకల రుగ్మతల నుండి రక్షిస్తుంది.

7. జీవక్రియను మెరుగుపరుస్తుంది

7. జీవక్రియను మెరుగుపరుస్తుంది

జీవక్రియ అనేది మన శరీరంలో, శక్తి ఉత్పాదకతను సాధించే యంత్రాంగం. ఎరుపు లేదా ఊదా క్యాబేజీ జీవక్రియను పెంచడానికి సహాయపడే కూరగాయలలో ఒకటి. దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్ ఉండటం వలన, ఇది కణాలలో జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

హెచ్చరిక : మీరు హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నట్లయితే, ఊదా క్యాబేజీని తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే క్యాబేజీ థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే ఒక క్రూసిఫర్ కూరగాయ.

ఊదా రంగు క్యాబేజ్ తినే విధానం:

క్యాబేజీని వండేటప్పుడు, వినెగార్ లేదా నిమ్మరసాన్ని కలపడం ద్వారా రంగును కాపాడుకోండి. మీరు దీనిని పచ్చిగా సలాడ్లలో, లేదా రసం రూపంలో కూడా తీసుకోవచ్చు.

English summary

7 Surprising Health Benefits Of Red Cabbage

The purple or red cabbage as it is called, is a variety of the head cabbage that has many leaves just like the green ones. A single cup serving of chopped purple cabbage provides 2 g of fibre. Intake of dietary fibre prevents too much cholesterol from entering your bloodstream. This vegetable is loaded with phytochemicals, antioxidants, vitamins & minerals.
Desktop Bottom Promotion