For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజు ఒక బీట్ రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు

ప్రతిరోజు ఒక బీట్ రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు

|

ఆరోగ్యకరమైన కూరగాయలతో ఒకటిగా పేరొందిన బీట్ రూట్ కు ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది. మన దైనందిన ఆహారములో దీనిని భాగం చేసుకోవడం వలన కలిగే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి మీకు తెలుసా! తెలిస్తే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు.

సాధారణంగా రక్తహీనతను అధిగమించడానికి బీట్ రూట్ పనిచేస్తుంది అని అందరికీ తెలిసినదే కానీ రక్తపోటును మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా బీట్ రూట్ అద్భుతంగా సహకరిస్తుంది. దానిలో ఉండే నైట్రేట్ లు రక్తపోటును తగ్గిస్తాయి. దీనిలో సోడియం మరియు కొవ్వులు అత్యల్పంగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది.

What are the benefits of eating one beetroot daily

మీ శక్తి సామర్ధ్యాలను పెంచి మీ రోజువారి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వవర్తించడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజు ఒక బీట్ రూట్ తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఎందుకు ఆలస్యం? ఇక చదవండి.

1. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:

1. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:

బీట్ రూట్ లో ఫ్లావనాయిడ్లు, నీటిలో కరిగే పీచుపదార్థాలు మరియు బీటాసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వలనే బీట్ రూట్ కి ఆ ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ల వలనే LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెంది ధమనులలో పేరుకోవు. దీనివలన మన గుండె ఆరోగ్యం చురుకుగా ఉంటుంది.

2. రక్తపోటు తగ్గిస్తుంది:

2. రక్తపోటు తగ్గిస్తుంది:

బీట్ రూట్ లో నైట్రేట్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలో చేరినాక నైట్రైట్లు మరియు మరియు నైట్రిక్ ఆక్సైడ్ వాయువులుగా పరివర్తన చెందుతాయి. ఇవి మన ధమనులను వెడల్పుగా చేసి రక్తపోటు నియంత్రిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ బీట్ రూట్ ను కనుక ఆహారంలో తీసుకుంటే, మూడు రోజులలో రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది.

3. గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది:

3. గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది:

బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కనుక ఇది పుట్టబోయే బిడ్డ ఎదుగుదలను ప్రోత్సహించి గర్భిణులకు మేలు చేస్తుంది. బిడ్డ యొక్క వెన్ను ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి ఇది చాలా ఉపయోగకరమైనది. ఇది శక్తినిచ్చి బిడ్డలో అలసటను తగ్గిస్తుంది.

4. కాన్సర్ ను నివారిస్తుంది:

4. కాన్సర్ ను నివారిస్తుంది:

బీట్ రూట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ పెరుగుదలను అరికడతాయి. హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధనలలో, బీట్ రూట్ ను సేవించడం ద్వారా ఊపిరితిత్తుల మరియు చర్మ కాన్సర్ లు నివారించవచ్చని తేలింది. క్యారెట్ మరియు బీట్ రూట్ రసాలను ల్యుకేమియా చికిత్సలో భాగంగా క్రమం తప్పకుండా తీసుకుంటారు.

5. వాపు మరియు నొప్పులను తగ్గిస్తుంది:

5. వాపు మరియు నొప్పులను తగ్గిస్తుంది:

బీట్ రూట్ మన శరీరంలోని వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. శరీర ముఖ్య అంతర్గత అంగాలలో కలిగే వాపులు, నొప్పులు రోజు బీట్ రూట్ తినడం వలన నయమవుతాయి. బీట్ రూట్ లో ఉండే ఫోలేట్, బీటాలయిన్ కు నొప్పులు తగ్గించే లక్షణముంది.

6. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి డిమెన్షియాతో పోరాడుతుంది:

6. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి డిమెన్షియాతో పోరాడుతుంది:

బీట్ రూట్ లోని అధిక నైట్రేట్ మోతాదు శరీరం ఆక్సిజన్ ను అధికంగా తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెదడు కణాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వలన మెదడు పనితీరు మెరుగుపడి డిమెన్షియా వంటి రుగ్మతలను నిరోధించడానికి లేదా వాటితో పోరాడటానికి సహాయపడుతుంది.

7. జీర్ణక్రియకు తోడ్పడుతుంది:

7. జీర్ణక్రియకు తోడ్పడుతుంది:

మీరు కనుక ప్రతిదినం బీట్ రూట్ ను తింటే అది మీ జీర్ణ శక్తిని పెంపొందించి మీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాక మీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి మీ కాలేయం మరియు ప్లీహం లకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

8. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు:

8. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు:

బీట్ రూట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని మీకు తెలుసు. దీనిలో ఉండే లుటైన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మానికి ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టాలతో పోరాడుతుంది. దీని వలన చర్మంపై ముడుతలు, సన్నని గీతలు ఏర్పడకుండా, చర్మం యవ్వనంతో కాంతివంతంగా నిగానిగలాడుతుంది.ప్రతిరోజు ఒక బీట్ రూట్ ను తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. పైన ఉదహరించిన ప్రయోజనాలే కాకుండా శరీరంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించడం, ఆస్టియోపోరాసిస్ తో పోరాడటం, చర్మ సంరక్షణకు తోడ్పడటం మరియు శృంగారం పై అనురక్తి కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

కనుక, ఎన్నో రకాల ఆరోగ్య మరియు సౌందర్య సమస్యల పరిష్కారానికి బీట్ రూట్ ను ఆశ్రయించవచ్చు. ఒక బీట్ రూట్ ను జ్యూస్ చేసుకొని తాగటమో లేదా ముక్కలుగా కోలుకుని సలాడ్ లో కలిపి తినటం వలన మీ జీవితం మరియు ఆరోగ్యంలో విశేషమైన మార్పులు సంభవిస్తాయి.

English summary

What are the benefits of eating one beetroot daily?

Beetroots may not taste all that delicious, but they are a chock-full of nutrients, flavonoids and antioxidants. Read on to discover the other benefits of eating one beetroot daily.
Desktop Bottom Promotion