For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కు తీయకుండా కీరా దోసకాయ తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

చెక్కు తీయకుండా కీరా దోసకాయ తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

|

సాధారణంగా కీరా దోసకాయ తినేటప్పుడు ప్రతి ఒక్కరు చెక్కు తీసి తింటారు. అది మన ఇంటికి చేరక ముందు రకరకాల ప్రదేశాలను చుట్టిరావడం వలన తినేముందు కడిగి తొక్కతీసి తినడం సబబనిపిస్తుంది. తినేముందు కూరగాయలను నీటితో కడిగినంత మాత్రాన అవి ఖచ్చితంగా సురక్షితంగా మారతాయని భ్రమ పడవద్దు.

తొక్క తీసేయడం వలన దానిపై చేరిన వాతావరణ కాలుష్య పదార్థాలు తొలగిపోతాయి. అయితే, వీటితో పాటుగా ఎన్నో అత్యవసర పోషకాలు కూడా తొలగిపోతాయని మీకు తెలుసా!

Benefits of eating Unpeeled cucumbers that you were not aware of
చెక్కులో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది:

చెక్కులో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది:

కీరా చెక్కులో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. ఇది నీటిలో కరగదు కనుక మన జీర్ణ నాళంలో నుండి నెట్టివేయబడుతుంది. జీర్ణం కాని వ్యర్ధాలు అధికంగా తయారుకావటం వలన మలబద్దకం దరిచేరదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగారోజుకు 25గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. పురుషులలో ఇది 39 గ్రాములు.కీరా లోపల ఉండే పీచుపదార్ధం నీటిలో కరిగిపోతుంది. ఇది కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఇది విసర్జకాలను మృదువుగా మారుస్తుంది.

విటమిన్ కె మెండుగా ఉంటుంది:

విటమిన్ కె మెండుగా ఉంటుంది:

విటమిన్ కె రక్తం గడకట్టడానికి సహాయపడుతుంది. కీరాలో ఉండే విటమిన్ కె లో చాలా భాగం చెక్కులోనే ఉంటుంది. ఒక కప్పు చెక్కులో 49 మైక్రో గ్రాముల విటమిన్ కె ఉంటుంది. అదే చెక్కుతీసిన కీరాలో ఇది 9 మైక్రో గ్రాములు మాత్రమే ఉంటుంది.

కెలోరీలు తక్కువగా ఉంటాయి:

కెలోరీలు తక్కువగా ఉంటాయి:

ఎటువంటి మొహమాటం లేకుండా కీరాను ఎప్పుడుకావాలంటే తినేయవచ్చు, ఎందుకంటే, వీటిలో సహజంగా కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఒక కీరా ముక్కలో 1-2 కెలోరీలు ఉంటాయి. మీ డైటింగ్ చేస్తున్నప్పటికి, మధ్యాహ్న సమయాల్లో కొన్ని చెక్కుతీయని కుర్ర ముక్కలు తినడం వలన ఎటువంటి నష్టం వుండదు.

కంటిచూపుకు మంచిది:

కంటిచూపుకు మంచిది:

కీరా చెక్కులో బీటా కెరోటిన్ ఒక రకమైన విటమిన్ ఏ. ఇది మన కళ్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. విటమిన్ ఏ వివిధ సమ్మేళనాలలో లభింస్తుంది. కీరా చెక్కయిలో ఇది అధికంగా ఉంటుంది. ఆహార సప్లిమెంట్స్ కార్యాలయం వారి లెక్కల ప్రకారం, ఆడవారికి రోజుకు 2,310 IU విటమిన్ ఎ అవసరం. ఇది మగవాళ్ళలో 3,000 IU. ఒక కప్పు చెక్కుతీయని కీరా ముక్కలలో 55 IU విటమిన్ ఎ ఉంటుంది, ఇందులో సగం బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.

కనుక, ఈ రోజు నుండి కీరా తినేటప్పుడు చెక్కు తీయకుండా తినడం అలవాటు గా మార్చుకోండి. కానీ తినేముందు వాటిని శుభ్రంగా కడగడం తప్పనిసరి.

English summary

Benefits of eating Unpeeled cucumbers that you were not aware of

Benefits of eating Unpeeled cucumbers that you were not aware of ,Cucumber peels are rich in insoluble fibre, a type of fiber that sweeps through the digestive tract and creates a fecal bulk.
Story first published:Thursday, July 5, 2018, 18:32 [IST]
Desktop Bottom Promotion