For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయ విత్తనాల వల్ల ప్రత్యేకంగా మగవారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ విత్తనాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

|

పురుషుల విషయానికి వస్తే, వ్యాయామశాలకు వెళ్ళడం అనేది ఆరోగ్యంగా ఉండే క్రమంలో ప్రాథమిక ఎంపికగా చెప్పబడుతుంది. కానీ సరైన ఆహార ప్రణాళిక కూడా ముఖ్యమని ఎంతమంది గ్రహిస్తున్నారు? పరిపూర్ణ ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహార పదార్ధాలలో, గుమ్మడికాయ గింజలు మానవాళికి ఉత్తమ స్నేహితులుగా చెప్పబడినవి. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే ఈ గుమ్మడికాయ విత్తనాల గురించిన పూర్తి వివరాలు ఈ వ్యాసంలో మీకోసం.

గుమ్మడికాయ గింజలు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి మరియు ఏడాది పొడవునా కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. పురుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగించే పోషకాలతో ఇవి నిండిపోయి ఉంటాయి.

గుమ్మడికాయ విత్తనాల పోషక విలువలు:

గుమ్మడికాయ విత్తనాల పోషక విలువలు:

గుమ్మడికాయ విత్తనాలు జింక్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సెలీనియం, కాల్షియం మరియు ఫాస్పరస్ యొక్క అద్భుతమైన మూలంగా ఉన్నాయి. మరియు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బి-విటమిన్, బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ సమ్మేళనాలతో నిండి ఉంటుంది.

28 గ్రాముల షెల్ తీసిన గుమ్మడికాయ గింజలలో 151 కేలరీల కొవ్వు మరియు ప్రొటీన్ కలిగిఉంటుంది. ఇది సుమారు 1.7 గ్రా ఫైబర్ మరియు 5 గ్రాముల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం నిల్వలను కలిగి ఉంటాయి, ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటును నిర్వహించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం మరియు జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అలాగే, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల ఉనికి, హార్మోన్లు ఉత్తెజితమవడంలో సహాయం చేస్తుంది. ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు ఎముకలను పటిష్టం చేయడంలో, ఎర్ర రక్త కణాలను తయారుచేయడంలో, మరియు వాపు లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

గుమ్మడికాయ విత్తనాలు పురుషుల ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది?

1. పురుషుల ఫెర్టిలిటీ హార్మోన్ల మోతాదును మెరుగుపరుస్తుంది

1. పురుషుల ఫెర్టిలిటీ హార్మోన్ల మోతాదును మెరుగుపరుస్తుంది

గుమ్మడికాయ గింజలు జింక్ నిక్షేపాలతో కూడుకుని ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచి, పురుషుల సంతానోత్పత్తి మెరుగుపరుస్తాయి. ఇది ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు ప్రోటీన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, ఇనుము, జింక్ మరియు పొటాషియం నిక్షేపాలకు మూలంగా ఉంటుంది. ఇవి పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన పోషకాలుగా ఉన్నాయి.

2. ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది

2. ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది

భారతీయ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలదని వెల్లడించింది. గుమ్మడికాయ గింజలు తీసుకోవడం ప్రోస్టేట్ గ్రంధిని బలపరుస్తుంది మరియు పురుషులలో ఆరోగ్యకరమైన హార్మోన్ చర్యను ప్రోత్సహిస్తుంది.

గుమ్మడికాయ గింజలు, ప్రోస్టాటిక్ హైపెర్ప్లాసియా (బి.హెచ్.పి) తగ్గించడంలో సహాయపడతాయి. ప్రోస్టాటిక్ హైపెర్ప్లాసియా అనగా ప్రోస్టేట్ గ్రంధి అసాధారణంగా పెరగడం. దీని కారణంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కావున, ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా (బి.హెచ్.పి) సంబంధించిన లక్షణాలను తగ్గించడానికి ఇవి దోహదపడుతాయి.

3. కండరాల ఆరోగ్యాన్ని పెంచుతుంది

3. కండరాల ఆరోగ్యాన్ని పెంచుతుంది

కండరాల నిర్మాణం మరియు మరమత్తుల కోసం ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ గుమ్మడికాయ గింజల్లో సమృద్ధిగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ వారి పోషకాల చార్ట్ ప్రకారం 23.33 గ్రాముల గుమ్మడి గింజలలో 100 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది.

మీరు మీ ఆహారప్రణాళికలో ప్రోటీన్ నిక్షేపాలను పెంచడానికి, స్మూతీలో కలిపి తీసుకోవచ్చు.

గుమ్మడికాయ విత్తనాల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

గుమ్మడికాయ విత్తనాల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

గుమ్మడికాయ విత్తనాలు జింక్ నిక్షేపాలతో నిండి ఉంటాయి, ఇవి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు వాటిని పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతాయి. భాస్వరం యొక్క ఉనికి మీ జీవక్రియలను పునరుద్దరించడానికి మరియు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి.

మీ ఆహార ప్రణాళికలో గుమ్మడికాయ విత్తనాలను ఎలా జోడించాలి?

మీ ఆహార ప్రణాళికలో గుమ్మడికాయ విత్తనాలను ఎలా జోడించాలి?

1. ఈ గుమ్మడి కాయ గింజలను స్మూతీస్, తృణధాన్యాలు, గ్రనోలా, సూప్స్ మరియు సలాడ్లలో చేర్చడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

2. మీరు కూరగాయల ఫ్రైలలో కూడా విత్తనాలను జోడించవచ్చు లేదా కాల్చి తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్ వలె తీసుకోవచ్చు కూడా.

3. మీరు కుకీలు లేదా మఫిన్ల వంటి బేకింగ్ డిజర్ట్లు తయారుచేస్తున్న ఎడల, వీటిని కూడా జోడించవచ్చు

హెచ్చరిక:

హెచ్చరిక:

గింజలు ఫైబర్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి, కనుక వాటిని పెద్ద పరిమాణాల్లో లేదా అదే పనిగా తినడం మూలంగా గ్యాస్ మరియు ఉబ్బర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడం మూలంగా మలబద్ధక సమస్యలు కూడా రావొచ్చు. కావున, ఎట్టి పరిస్థితుల్లో పరిమితి మించకుండా తీసుకోవలసినదిగా సూచించడమైనది. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైన అనుభూతికి లోనైనా, వెంటనే మితం చేయడం లేదా కొంతకాలం మానివేయడం మంచిదిగా సూచించబడింది.

మరియు వ్యాయామం, ఆహార ప్రణాళిక మాత్రమే ఆరోగ్యాన్ని నిలబెడుతుంది అనడం తప్పు. సరైన జీవన శైలి, ఆరోగ్యపు అలవాట్లు, జంక్ ఫుడ్ త్యజించడం, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండడం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ప్రణాళికా బద్దమైన అలవాట్లు, పద్దతులు మొదలైనవి అనేకం మీ ఆరోగ్యకర జీవన మార్గానికి తోడ్పాటును అందివ్వగలవు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


English summary

Benefits Of Pumpkin Seeds For Men's Health

Pumpkin seeds are an excellent source of zinc, magnesium, manganese, copper, iron, selenium, calcium and phosphorous. They are a great source of protein, omega-3 fatty acids, B vitamins, beta-carotene and vitamin A. Pumpkin seeds are normally dark green in colour and oval in shape and are available all year round.
Desktop Bottom Promotion